The Paradise Nizam Collections:‘ది ప్యారడైజ్’…శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మాతగా న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాలతో బరిలోకి దిగిన సంగతి తెల్సిందే. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో దసరా వంటి సాలిడ్ బ్లాక్ బస్టర్ రావడంతో ఈ కాంబోపై అంచనాలు ఆకాశాన్ని తాకేశాయి. కాని మొదటి రోజున మిక్స్డ్ టాక్ తో మొదలైన సినిమా క్రమంగా నెగెటివ్ టాక్ మూట గట్టుకోవడంతో సినిమా కనీసం బ్రేక్ ఈవెన్ అయినా అవుతుందా అన్న పరిస్థితి.
మొదటి రోజే ఏకంగా వంద కోట్లు
అయితే ఊహించని విధంగా సినిమా మొదటి రోజే ఏకంగా వంద కోట్లు కొల్లగొట్టడంతో ఆ కలెక్షన్స్ అలాగే కంటిన్యూ అవుతాయనుకున్నారు అంతా..కానీ రోజురోజుకి సినిమా కలెక్షన్స్ డ్రాప్ అవడంతో సినిమా ప్యాకప్ చెప్పెసినట్టే అనుకున్నారు.అయితే సీమ, కోస్తా , రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ లలో కూడా డ్రాప్ అయిన కలెక్షన్స్ మళ్ళీ పుంజుకున్నట్టుగా కూడా కనిపించట్లేదు.
కానీ నైజాంలో మాత్రం ఆడియన్స్ నానికి ఫుల్ సపోర్ట్ గా నిలవడం విశేషం. ముఖ్యంగా తెలంగాణ నేటివిటీ, జీవన విధానం, యాస, కథా నేపథ్యం ఇవన్నీ సినిమాలో ఉండటంతో తెలంగాణ ఆడియన్స్ సినిమాను ఓన్ చేసుకున్నట్టుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అందుకే నైజాం మార్కెట్‌లో ‘ది ప్యారడైజ్’ వసూళ్లు మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ప్రత్యేకంగా కనిపిస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది.
నైజాం షేర్ రూ.38 కోట్లకు పైగా
తాజాగా నెటింట్లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం తొమ్మిదో రోజున నైజాం ఏరియాలో సుమారు రూ.90 లక్షల షేర్ వచ్చినట్టు తెలుస్తుంది. దీంతో మొత్తం నైజాం షేర్ రూ.38 కోట్లకు పైగా చేరినట్టు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రోజులు గడుస్తున్నా ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం చూస్తే ప్యారడైజ్ సినిమాకి తెలంగాణా ప్రజలు ఎలా పట్టం కట్టారో అర్థమవుతుంది. ముఖ్యంగా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన సినిమా కావడంతో ఇక్కడి ప్రజల కనెక్షన్ కూడా కలెక్షన్లకు ప్లస్ అవుతోందనే టాక్ వినిపిస్తుంది.
నెత్తిన పెట్టుకుంటున్న నైజాం ఆడియన్స్
ఇదే ‘దసరా’ విషయంలో కూడా కనిపించిందనే చెప్పాలి. తెలంగాణ గ్రామీణ వాతావరణాన్ని బలంగా చూపించిన ఆ సినిమా నాని కెరీర్‌లో మాస్ ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు అదే దర్శకుడు ‘ది ప్యారడైజ్’తో మరోసారి తెలంగాణ నేటివిటీని సాలిడ్ గా చూపించడంతో నెత్తిన పెట్టుకుంటున్నారు నైజాం ఆడియన్స్.
ఇక క్యాస్టింగ్ విషయానికి వస్తే ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించగా, మోహన్ బాబు కీలకమైన శిఖంజా మాలిక్ గా అదరగొట్టాడు.ఇక అనిరుద్ సంగీతంలో వచ్చిన ఆయా షేర్ ,ఏష నాగుల కట్ట మీద పాటలు సినిమాని మరో లెవెల్ కి తీసికెళ్ళాయి.
ALSO READ:భాగ్యశ్రీ బోర్సే కొత్త లుక్..అందాల ఆరబోతతో అదరగొట్టేసిందిగా!
మొత్తానికి ‘ది ప్యారడైజ్’కు అన్ని చోట్లా ఒకే రకమైన రియాక్షన్ రాకపోయినా.. తెలంగాణ మాత్రం నానిని మరోసారి నెత్తిన పెట్టుకున్నట్టుగా నైజాం కలెక్షన్స్ చూస్తేనే అర్థమవుతుంది.చూడాలి మరి ముందు ముందు ఈ జోరు ఇంకెలా కంటిన్యూ అవుతుందో !