S.S.Rajamouli: టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ . ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన తాజా చిత్రం వారణాసి(Varanasi) ఈ సినిమా తాజాగా షూటింగ్ పనులు అన్నింటిని పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే .ఇక త్వరలోనే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సినిమా 2027 ఏప్రిల్ ఏడో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక రాజమౌళి(Rajamouli) సినిమా అంటే సినిమాపై గ్లోబల్ రేంజ్ లో భారీగా అంచనాలు ఉన్నాయి. వారణాసి సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ మాత్రం భారీ అంచనాలను పెంచేశాయి.
ఇదిలా ఉండగా తాజాగా దర్శకుడు రాజమౌళి ఇటీవల అమెరికాలోని ప్రతిష్టాత్మక ‘పెన్ స్టేట్ యూనివర్సిటీ ఫిల్మ్ స్కూల్’ విద్యార్థులతో ముచ్చటించారు. ఈ నేపథ్యంలోనే వారణాసి సినిమాకి సంబంధించి కొన్ని కీలక విషయాలను కూడా బయటపెట్టారు. ముఖ్యంగా మహేష్ బాబు నటించిన రుద్ర(Rudra) పాత్ర గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు మహేష్ బాబు నుంచి తాను మంచి అవుట్ ఫుట్ ఎలా రాబట్టాలి అని ఆలోచించాను. అయితే ఒకసారి మహేష్ బాబు సెట్ లోకి అడుగు పెట్టిన తర్వాత మహేష్ బాబు యాక్టింగ్ చూసి నేను చాలా ఆశ్చర్యపోయానని తెలిపారు. ఒక దర్శకుడిగా నటుడి నుంచి నేను 100% అవుట్ ఫుట్ కోరుకుంటాను.
ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర పాత్రలో నటిస్తూ.. నేను 100% అవుట్ ఫుట్ రాబట్టాలని ప్రయత్నిస్తే ఆయన రెండు వందల శాతం ఎఫర్ట్ పెట్టి నన్ను పూర్తిగా సర్‌ప్రైజ్ చేశారని , మహేష్ నుంచి ఇలాంటి రిజల్ట్ ఉంటుందని తాను ఊహించలేదని తెలిపారు. ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర పాత్రలో నటించడం కాదు జీవించేసారని రాజమౌళి తెలియచేశారు. ఇక రాజమౌళి సినిమాల విషయంలో హీరోల ఎంపిక గురించి కూడా మాట్లాడుతూ తాను ఎప్పుడు తన సినిమాలో స్టార్ హీరో ఉండాలి అని ఎప్పుడూ ఎంపిక చేయను, కథను బట్టి నటీనటులను ఎంపిక చేస్తానని తెలియజేశారు.
ఇక రాజమౌళి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన RRR సినిమా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత జక్కన్న డైరెక్షన్ లో రాబోతున్న ప్రెస్టేజియస్ ప్రాజెక్టు వారణాసి కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.ఈ సినిమాలో రాజమౌళి మునుపెన్నడూ చూడని ఒక సరికొత్త విజువల్ మైండ్‌బ్లోయింగ్ వరల్డ్‌ను ఆవిష్కరించబోతున్నారు. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో కనిపించబోతున్నారు మహేష్ బాబుకి విలన్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు .చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు మాత్రమే ఉన్నాయని తెలుస్తోంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులలో రాజమౌళి బిజీ కానున్నారు.
Also Read: మీసం మెలేస్తూ తొడకొట్టిన రష్మిక…వైరల్ అవుతున్న క్యూట్ వీడియో!