E-Paper
Advertisement

మీసం మెలేస్తూ తొడకొట్టిన రష్మిక…వైరల్ అవుతున్న క్యూట్ వీడియో!

మీసం మెలేస్తూ తొడకొట్టిన రష్మిక…వైరల్ అవుతున్న క్యూట్ వీడియో!
Advertisement

Rashmika Mandanna: రష్మిక మందన్న ప్రస్తుతం రణబాలి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉంటూనే మరోవైపు మైసా, రాకా సినిమాల పనులలో కూడా బిజీగా గడుపుతున్నారు. ఇక విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో కలిసి ఈమె నటించిన రణబాలి(Ranabaali) సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే రష్మిక విజయ్ దేవరకొండ సుమతో కలిసి ఒక ఇంటర్వ్యూలో చేశారు. ఈ ఇంటర్వ్యూ సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఇకపోతే రష్మికకి సంబంధించిన ఒక క్యూట్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సింగనమల బొబ్బిలి రణబాలిరా నీయక్కా…

ఈ వీడియోలో భాగంగా రష్మిక మందన్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటించిన సింగనమల బొబ్బిలి రణబాలి (Singanamala bobbili Ranabaali)డైలాగును రీ క్రియేట్ చేసి చూపించారు. అచ్చం విజయ్ దేవరకొండ నడిచిన విధంగానే నడుస్తూ రావడం, విజయ్ దేవరకొండ తరహాలోనే మీసం మేలేస్తూ, తొడగొట్టి “సింగనమల బొబ్బిలి రణబాలిరా నీయక్కా” అనే డైలాగ్ చెప్పినటువంటి ఒక వీడియో వైరల్ అవుతుంది.ఇలా వీరిద్దరి ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రాయలసీమ కరువు నేపథ్యంలో…

Advertisement

ఇక ఈ సినిమా విజయ్ దేవరకొండ రష్మిక మందన్నకు మూడవ సినిమా కావటం విశేషం. అయితే పెళ్లి తర్వాత వీరిద్దరు నిజ జీవితంలో భార్యా భర్తలుగా అలాగే తెరపై కూడా భార్య భర్తలుగా ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇలా పెళ్లి తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఇది మొదటి సినిమా కావటంతో ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 150 సంవత్సరాల క్రితం రాయలసీమ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొన్న కరువు కాటకాలు ,ఆకలి, బ్రిటిష్ వారికి వ్యతిరేకం పోరాటం నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

Advertisement

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ శింగనమల బొబ్బిలి రణబాలి పాత్రలో కనిపించబోతున్నారు అదేవిధంగా రష్మిక మందన్న జయమ్మ పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్స్ , పాటలు కూడా సోషల్ మీడియాలో మంచి ఆదరణ సొంతం చేసుకోవటమే కాకుండా సినిమా పై భారీగా అంచనాలను పెంచేసాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే మూడు డాక్యుమెంటరీ సిరీస్ లను కూడా విడుదల చేశారు. ఈ సిరీస్ ద్వారా సినిమా కథకు మూలం ఏంటి , ఎవరి స్ఫూర్తి ఆధారంగా రణబాలి పాత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారనే విషయాల గురించి తెలియజేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా విజయ్ రష్మీక అభిమానులకు ఎలాంటి వినోదాన్ని అందిస్తుందో తెలియాల్సి ఉంది.

Also Read: అల్లు అర్జున్ పై వేణు స్వామి కామెంట్స్.. బన్నీ అంటే అంత ఇష్టమా?

Related News

‘వారణాసి’ రుద్ర పాత్ర పై రాజమౌళి కామెంట్… ఇది అసలు ఊహించలేదంటూ!

ప్యారడైజ్‌ను మోస్తున్న తెలంగాణ..నైజాం నానిని వదల్లేదుగా!

భాగ్యశ్రీ బోర్సే కొత్త లుక్..అందాల ఆరబోతతో అదరగొట్టేసిందిగా!

శేఖర్ మాస్టర్ స్టెప్పులకు అంత రేటా? చిన్న హీరోల రెమ్యునరేషన్‌కన్నా ఎక్కువే!

SIRపై ప్రకాశ్ రాజ్ ఫైర్ .. 13 కోట్ల ఓట్ల లెక్కేంటి?

అల్లు అర్జున్ పై వేణు స్వామి కామెంట్స్.. అక్కడికి వెళ్తే బన్నీతోనే అంటూ?

ఎస్కేఎన్ చేతుల మీదుగా ‘ధరణి ఐ లవ్ యు’ పోస్టర్ లాంఛ్!

Big Stories

Advertisement
×