E-Paper
Advertisement

తారక్, బాలయ్య రంగంలోకి దిగినా.. డోంట్ ట్రబుల్‌కి ట్రబుల్ తప్పలేదా?

తారక్, బాలయ్య రంగంలోకి దిగినా.. డోంట్ ట్రబుల్‌కి ట్రబుల్ తప్పలేదా?
Advertisement

Dont Trouble The Trouble Box Office:ప్రమోషన్స్ సినిమాకి ఆక్సిజన్. అది ఎంత సాలిడ్ గా ఉంటే సినిమా అంతగా జనాల్లోకి దూసుకుపోతుంది.అయితే అది జనాల్లోకి చేరే వరకే.కాని ఆడియన్స్ దాన్ని అక్కున చేర్చుకోవాలంటే కావల్సింది కంటెంట్ .లేకపోతే ఎన్ని జిమ్మిక్కులు చేసినా ,ఎంత మంది స్టార్ హీరోలు క్యూలో నిలబడి ఆకాశానికి ఎత్తినా బాక్సాఫీస్ గల్లా పెట్టె కాసులు లేక డీలా పడాల్సిందే.

ఇదిగో డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ విషయంలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఫహద్ ఫాజిల్ హీరోగా నటించడం ఒక ఎత్తయితే.. ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో సినిమా రావడం మరో ఎత్తు. దీనికి తోడు ఇండస్ట్రీలోని పలువురు స్టార్ హీరోలు ఈ సినిమాపై మాట్లాడటం, ప్రమోట్ చేయడంతో సినిమాపై హైప్ బాగానే క్రియేట్ అయింది.

Advertisement

ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ వంటి స్టార్ హీరోలు కూడా సినిమాకు తమవంతు సపోర్ట్ ఇవ్వడంతో.. ఇక థియేటర్ల దగ్గర హంగామా మామూలుగా ఉండదని చాలామంది అనుకున్నారు. సినిమా గురించి ఇండస్ట్రీలో ఇంతమంది మాట్లాడుతున్నారు కాబట్టి కంటెంట్ కూడా అదే రేంజ్‌లో ఉంటుందని ప్రేక్షకులు ఊహించారు. కానీ థియేటర్లలో సినిమా చూసిన తర్వాత మాత్రం ఆ అంచనాలకు, తెరపై కనిపించిన కంటెంట్‌కు మధ్య గ్యాప్ ఉందనే టాక్ వచ్చింది.కట్ చేస్తే సినిమాకి ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు కేవలం రూ.2.20 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ వర్గాలలో వినిపిస్తుంది.

ఇదిగో ఇక్కడే నెటిజన్లలో డిబేట్ మొదలైపోయింది. ప్రమోషన్ చేయడానికి స్టార్ హీరోలు ఉండొచ్చు.. సినిమా వెనుక రాజమౌళి లాంటి బ్రాండ్ ఉండొచ్చు.. ఫహద్ ఫాజిల్ లాంటి నటుడు హీరోగా ఉండొచ్చు.. కానీ చివరికి థియేటర్‌లో కూర్చున్న ప్రేక్షకుడికి నచ్చాల్సింది మాత్రం సినిమాలోని కంటెంట్. తెరపై కంటెంట్ కనెక్ట్ అయితేనే ప్రేక్షకుడు కాసులు కురిపిస్తాడు.లేదంటే ఎంత పెద్ద స్టార్స్ సపోర్ట్ చేసినా సినిమా పెట్టె బేడా సర్దేయ్యల్సిందే.

Advertisement

ఇండస్ట్రీలో పెద్ద హీరోలు ప్రమోట్ చేసిన సినిమా కాబట్టి ఓపెనింగ్స్ అదిరిపోతాయని అనుకోవడం సహజమే. కానీ ఆడియన్స్ మాత్రం ‘ఎవరు ప్రమోట్ చేశారు?’ అనే దానికంటే ‘సినిమాలో ఏముంది?’ అనేదే చూస్తాడని మేకర్స్ ఇకనైనా గ్రహిస్తే మంచిది.

ALSO READ:సుకుమార్ అపార్ట్‌మెంట్ కిందే నాలుగేళ్లు.. శ్రీకాంత్ ఓదెల పడ్డ కష్టం ఇదే!

రాజమౌళి పేరు సినిమా ప్రమోషన్ కి ప్లస్ అవ్వొచ్చు. తారక్, బాలయ్య లాంటి హీరోలు ప్రమోట్ చేయడం సినిమాపై ఆసక్తిని పెంచొచ్చు. ఫహద్ ఫాజిల్‌కు ఉన్న నటుడిగా ఇమేజ్ కూడా ప్లస్ కావచ్చు. కానీ ఇవన్నీ ప్రేక్షకుడిని థియేటర్‌కి తెచ్చేవరకే.ఒక్కసారి కుర్చీలో కూర్చున్నాడంటే అతన్ని ఎంగేజ్ అన్నా చేయాలి,లేదా ఎంటర్ టైన్ అయినా చేయాలి.ఈ రెంటిలో ఏది మిస్ అయినా ఇదిగో డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ లా ట్రబుల్ లో పడాల్సిందే !

Tags

Related News

ఇలా తయారయ్యారేంట్రా? ‘చుట్టమల్లే’ సాంగ్ పై విజయ్ దేవరకొండ ఫైర్

సుకుమార్ అపార్ట్‌మెంట్ కిందే నాలుగేళ్లు.. శ్రీకాంత్ ఓదెల పడ్డ కష్టం ఇదే!

‘వారణాసి’ రుద్ర పాత్ర పై రాజమౌళి కామెంట్… ఇది అసలు ఊహించలేదంటూ!

ప్యారడైజ్‌ను మోస్తున్న తెలంగాణ..నైజాం నానిని వదల్లేదుగా!

భాగ్యశ్రీ బోర్సే కొత్త లుక్..అందాల ఆరబోతతో అదరగొట్టేసిందిగా!

మీసం మెలేస్తూ తొడకొట్టిన రష్మిక…వైరల్ అవుతున్న క్యూట్ వీడియో!

శేఖర్ మాస్టర్ స్టెప్పులకు అంత రేటా? చిన్న హీరోల రెమ్యునరేషన్‌కన్నా ఎక్కువే!

Big Stories

Advertisement
×