Bhagyashri Borse:భాగ్యశ్రీ బోర్సే..రీసెంట్ గా లెనిన్ తో సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా నెట్టింట్లో ఎప్పటికప్పుడు తన లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలని షేర్ చేస్తూ ఫాన్స్ ని ఫిదా చేస్తూనే ఉంటుంది.ఇక ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట మరోసారి వైరల్ అవుతున్నాయి.
చిరునవ్వులు చిందిస్తున్న భాగ్యశ్రీ
ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని చిరునవ్వులు చిందిస్తున్న భాగ్యశ్రీ బోర్సే.. తన పోస్టుకు “Busy romanticising life through all the bumps & turning it to magicccc” అంటూ క్యాప్షన్ ఇవ్వడం విశేషం .జీవితంలో ఎదురయ్యే ఎత్తుపల్లాలను కూడా ఆస్వాదిస్తూ, వాటినే అందమైన జ్ఞాపకాలుగా మార్చుకుంటున్నానంటూ తన అభిప్రాయాన్ని ఇలా క్యాప్షన్ రూపంలో పెట్టేసింది ఈ ముద్దుగుమ్మ.
ఫిదా అయిపోతున్న ఫాలోవర్స్
ఇక తాజాగా షేర్ చేసిన ఈ ఫొటోల్లో భాగ్యశ్రీ బోర్సే వైట్ టాప్, డెనిమ్ స్కర్ట్, బూట్స్ వేసి చాలా క్యాజువల్ లుక్‌లో దర్శనమిచ్చింది.ఇక ఈ ఫోటోలు నెట్టింట ఇలా వచ్చాయో లేదో ఒక్కసారిగా వైరల్ అయిపోయాయి,ముఖ్యంగా ఓ వైపు ప్రకృతి వాతావరణం, మరోవైపు పాతకాలపు ఆర్కిటెక్చర్ కనిపించే లొకేషన్‌లో ఆమె ఫొటోలు తీయించుకోవడం పోస్టుకు క్రేజీ ఫీల్‌ను తీసుకొచ్చిందనే చెప్పాలి. సాధారణంగా సినిమా ప్రమోషన్స్, ఫ్యాషన్ షూట్స్‌లో కనిపించే భాగ్యశ్రీకి ఇలా ఫొటోల్లో క్యాజువల్ లుక్ లో కనిపించడంతో ఫిదా అయిపోతున్నారు ఫాలోవర్స్.
కెరీర్ విషయానికి వస్తే
ఇక భాగ్యశ్రీ బోర్సే కెరీర్ విషయానికి వస్తే బాలీవుడ్‌లో ‘యారియాన్ 2’తో తన సినీ జర్నీని మొదలెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ‘చందూ ఛాంపియన్’లో చిన్న పాత్రలో తళుక్కుమన్న సంగతి తెల్సిందే.ఇక తెలుగులోకి రవితేజ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిస్టర్ బచ్చన్’తో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే అట్టర్ ఫ్లాప్ ని మూట గట్టుకుంది. అయితే ఈ సినిమాలో జిక్కీ పాత్రలో నటించిన భాగ్యశ్రీ తనదైన గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో మంచి గుర్తింపే తెచ్చుకుంది.ఇక ‘మిస్టర్ బచ్చన్’లో తన పాత్రకు తనే స్వయంగా తెలుగు డబ్బింగ్ చెప్పుకోవడం ఇక్కడ మెచ్చుకోతగ్గ విషయం.
ఒకే ఏడాదిలో మూడు వేరు వేరు భాషలలో
ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ‘కింగ్‌డమ్’లో కనిపించిన భాగ్యశ్రీ. దుల్కర్ సల్మాన్‌తో ‘కాంత’లో మెప్పించింది.ఇక అదే సమయంలో రామ్ పోతినేని, ఉపేంద్రలతో కలిసి ‘ఆంధ్ర కింగ్ తాలూకా’లో కూడా నటించిన భాగ్యశ్రీ ఇలా ఒకే ఏడాదిలో మూడు వేరు వేరు భాషలలో నటించడంతో టాలీవుడ్ ఫోకస్ ఈ భామపై పడింది.
ALSO READ:శేఖర్ మాస్టర్ స్టెప్పులకు అంత రేటా? చిన్న హీరోల రెమ్యునరేషన్‌కన్నా ఎక్కువే!
అయితే ఆమె కెరీర్‌లో ఈ ఏడు వచ్చిన ‘లెనిన్’మోర్ స్పెషల్ అనే చెప్పాలి.అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన ఈ సినిమా అటు అకిల్ కి ,ఇటు భాగ్యశ్రీకి తొలి సాలిడ్ హిట్ అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం శివకార్తికేయన్‌తో ‘సెయోన్’లో హీరోయిన్‌గా కనిపించబోతున్న ఈ ముద్దుగుమ్మ ఎలాంటి సంచలనం స్ప్రుష్టిస్తుందో చూడాలి !