E-Paper
Advertisement

సుకుమార్ అపార్ట్‌మెంట్ కిందే నాలుగేళ్లు.. శ్రీకాంత్ ఓదెల పడ్డ కష్టం ఇదే!

సుకుమార్ అపార్ట్‌మెంట్ కిందే నాలుగేళ్లు.. శ్రీకాంత్ ఓదెల పడ్డ కష్టం ఇదే!
Advertisement

Srikanth Odela:శ్రీకాంత్ ఓదెల ..ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్‌లో గట్టిగానే వినిపిస్తోంది. ‘దసరా’ సినిమాతో దర్శకుడిగా తన సత్తా చూపించిన శ్రీకాంత్.. ఆ తర్వాత నానితోనే ‘ది ప్యారడైజ్’ లాంటి భారీ సినిమా చేస్తూ తన స్థాయిని మరింత పెంచేసుకున్నాడు. అయితే ఈ స్థాయికి రావడం వెనుక ఆయన పడిన కష్టం మాత్రం మామూలుది కాదు.
ఇదిగో ఆ విషయాన్నే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చాడు.

సుకుమార్ అంటే తనకి చాలా ఇష్టమని,ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి సినిమా ఎలా తీయాలో నేర్చుకోవాలన్న కోరిక బలంగా ఉండేదని తెలిపాడు.ఆ క్రమంలోనే ‘ఆర్య 2’ తర్వాత సుకుమార్ గారిని అన్నపూర్ణ స్టూడియోస్‌లో కలిశానని చెప్పుకొచ్చాడు.

Advertisement

అయితే సుకుమార్‌ను కలవడం ఒక్క రోజులో అయిపోయిన పని కాదట. ఆ అవకాశం కోసం శ్రీకాంత్ ఏకంగా నాలుగేళ్లు వెయిట్ చేశారట. రోజూ ఉదయం ఐదు గంటలకే సుకుమార్ అపార్ట్‌మెంట్ కిందకు వెళ్లి కూర్చునేవాడినని ఆయన చెప్పుకొచ్చారు. సుకుమార్ బయటకు వచ్చే వరకు అక్కడే ఉండేవాడినని ఏదో ఒకరోజు తనను గమనించి అవకాశం ఇస్తారన్న నమ్మకంతో రోజూ అదే పని చేసేవాడినని అసలు విషయం చెప్పుకొచ్చాడు.

మొదటి సంవత్సరం కాదు.. రెండో సంవత్సరం కాదు.. ఏకంగా మూడు సంవత్సరాల పాటు ఇలాగే ఎదురు చూశాడట. రోజూ సుకుమార్‌కు గుడ్ మార్నింగ్ చెప్పడం, సాయంత్రం గుడ్ నైట్ చెప్పడం తప్ప పెద్దగా మాట్లాడే అవకాశం కూడా రాలేదట. అయినా శ్రీకాంత్ మాత్రం వెనక్కి తగ్గకుండా మూడేళ్లు గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ చెబుతూ తన ప్రయత్నం కొనసాగించానని ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఇక మూడేళ్ళు సుక్కు అలాగే చూసి చూసి నాలుగో సంవత్సరం శ్రీకాంత్‌ను.. “ఎవడ్రా నువ్వు?” అని అడిగారట. వినడానికి సరదాగా అనిపించినా.. శ్రీకాంత్ మాత్రం ఆ ఒక్క మాట కోసం నాలుగేళ్లు ఎదురుచూశారంటే ఆయన పట్టుదల ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఆ తర్వాత సుకుమార్ టీమ్‌లో శ్రీకాంత్‌కు పనిచేసే అవకాశం వచ్చింది. ఒక దర్శకుడి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేయడం అంటే కేవలం షూటింగ్‌కు వెళ్లడం మాత్రమే కాదు. కథను ఎలా డెవలప్ చేయాలి, సన్నివేశాలను ఎలా ఆలోచించాలి, నటుల నుంచి పెర్ఫార్మెన్స్ ఎలా రాబట్టాలి, ఒక సీన్‌ను తెరపై ఎలా చూపించాలి.. ఇలా చాలా విషయాలు నేర్చుకోవాల్సి శ్రీకాంత్ సుకుమార్ దగ్గర పనిచేస్తూ నేర్చుకున్నాడట.

సుకుమార్‌తో కలిసి పనిచేసిన అనుభవం తర్వాత శ్రీకాంత్‌కు తనకంటూ ఒక కథ చెప్పాలన్న ఆలోచన వచ్చింది. అదే తర్వాత ‘దసరా’గా మారింది. నాని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా శ్రీకాంత్‌కు దర్శకుడిగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. తెలంగాణ పల్లెటూరి నేపథ్యం, మాస్ క్యారెక్టర్లు, రా అండ్ రస్టిక్ టేకింగ్‌తో శ్రీకాంత్ తనదైన ముద్ర వేశారు.

ఇక ‘దసరా’ తర్వాత మళ్లీ నానితోనే ‘ది ప్యారడైజ్’ చేసిన సంగతి తెల్సిందే.మొత్తానికి ఒకప్పుడు సుకుమార్ అపార్ట్‌మెంట్ కింద కూర్చుని అవకాశం కోసం ఎదురుచూసిన వ్యక్తి.. ఇప్పుడు తన సినిమాల కోసం స్టార్ హీరోలు ఎదురుచూసే స్థాయికి చేరుకున్నారన్న మాట.

ALSO READ:శేఖర్ మాస్టర్ స్టెప్పులకు అంత రేటా? చిన్న హీరోల రెమ్యునరేషన్‌కన్నా ఎక్కువే!

Tags

Related News

తారక్, బాలయ్య రంగంలోకి దిగినా.. డోంట్ ట్రబుల్‌కి ట్రబుల్ తప్పలేదా?

‘వారణాసి’ రుద్ర పాత్ర పై రాజమౌళి కామెంట్… ఇది అసలు ఊహించలేదంటూ!

ప్యారడైజ్‌ను మోస్తున్న తెలంగాణ..నైజాం నానిని వదల్లేదుగా!

భాగ్యశ్రీ బోర్సే కొత్త లుక్..అందాల ఆరబోతతో అదరగొట్టేసిందిగా!

మీసం మెలేస్తూ తొడకొట్టిన రష్మిక…వైరల్ అవుతున్న క్యూట్ వీడియో!

శేఖర్ మాస్టర్ స్టెప్పులకు అంత రేటా? చిన్న హీరోల రెమ్యునరేషన్‌కన్నా ఎక్కువే!

SIRపై ప్రకాశ్ రాజ్ ఫైర్ .. 13 కోట్ల ఓట్ల లెక్కేంటి?

Big Stories

Advertisement
×