BigTV English

Vetrimaran: డైరెక్టర్ సంచలన నిర్ణయం.. ఇదే చివరి సినిమా అంటూ!

Vetrimaran: డైరెక్టర్ సంచలన నిర్ణయం.. ఇదే చివరి సినిమా అంటూ!

Vetrimaran: సినీ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సందర్భాలలో తప్పని పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. నిర్ణయాలు కఠినమైనవే అయినప్పటికీ జీవితం బాగుపడుతుంది అంటే చేయక తప్పదు. ఈ క్రమంలోనే కోలీవుడ్ డైరెక్టర్ తీసుకున్న నిర్ణయానికి అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి దర్శకుడు వెట్రిమారన్ (Vetrimaran ) తీసుకున్న ఆ నిర్ణయం ఏమిటి? ఎందుకు ఆయన అదే చివరి సినిమా అంటూ ప్రకటించారు? అసలు ఏం జరిగింది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..


అదే నా చివరి సినిమా – వెట్రిమారన్

2007లో ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) హీరోగా నటించిన ‘పొల్లాధవన్’ అనే చిత్రం ద్వారా దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు వెట్రిమారన్. మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకోవడంతో దర్శకుడిగా సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత ఆడుకాలం, వడ చెన్నై, విదుతి భాగం, అసురన్, విదుతి భాగం ఒండ్రు, విదుతి భాగం ఈతు వంటి చిత్రాలతో దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న ఈయన.. ప్రస్తుతం హీరో శింబు(Simbu) తో కలిసి ఒక సినిమా చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. దర్శకుడుగా కొనసాగుతూనే నిర్మాతగా కూడా మారారు. అలా 2012లో “క్రాస్ రూట్స్ ఫిలిం కంపెనీ” అనే ఒక నిర్మాణ సంస్థను స్థాపించి, ఈ నిర్మాణ సంస్థ ద్వారా కాకాముట్టై, ఇనారి కోడి, అన్నంకు జై, వడ చెన్నై తో పాటూ మరికొన్ని చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం ఈ బ్యానర్ ద్వారా ‘బ్యాడ్ గర్ల్’ సినిమాని కూడా ఆయన నిర్మిస్తున్నారు. అంతా బాగుంది అనుకునే సమయంలో సడన్ గా ఈ సినిమా విడుదల కోసం సెన్సార్ బోర్డుతో పోరాడాల్సి వచ్చిందట. ఇక చేసేదేమీ లేక తన నిర్మాణ సంస్థను మూసివేస్తున్నట్లు ప్రకటించారు.


దర్శకుడిగా ఉండడం ఈజీ.. కానీ నిర్మాతగా సాధ్యం కాదు..

ఈ మేరకు.. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన అక్కడ నిర్మాతగా ఉండడంపై ఊహించని కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.. వెర్రిమారన్ మాట్లాడుతూ.. “సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా కొనసాగడం చాలా సులభం. కానీ నిర్మాతగా సక్సెస్ అవడం అనేది అంత సులభం కాదు. దర్శకుడిగా ఉంటే మనం మన పని చేసుకోవడం మాత్రమే.. కానీ నిర్మాత అయితే మాత్రం ప్రతి విషయం గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా నటీనటుల గురించి తెలుసుకోవాలి. సినిమా మొదలైన రోజు నుంచి థియేటర్లలోకి వచ్చేవరకు అన్ని భరించాలి. చివరికి నష్టమైనా.. లాభమైనా.. తట్టుకొని నిలబడాలి.

అందుకే నా నిర్మాణ సంస్థను మూసేస్తున్నాను..

పైగా ఆండ్రియా నటించిన ‘మానుషి’ చిత్రం రివైజింగ్ కమిటీ నుండి కోర్ట్ వరకు వెళ్ళింది. అటు ‘బ్యాడ్ గర్ల్’ కూడా ఇప్పుడు అనేక పోరాటాలతో కోర్టు వరకు వెళ్ళింది..ఇలా వరుసగా నా చిత్రాలు కోర్టుకు వెళుతుండడం నేను తట్టుకోలేకపోతున్నాను. చిన్న నిర్మాతగా మనుగడ సాగించడం మరింత కష్టంగా మారింది. అందుకే నేను నా నిర్మాణ సంస్థను మోసేస్తున్నాను” అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వెట్రిమారన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికైతే ఈయన నిర్మాణ సంస్థ ద్వారా నిర్మించే చివరి చిత్రం బ్యాడ్ గర్ల్ అని తెలుస్తోంది.

ALSO READ:Bollywood: కీలక పదవి అందుకున్న ప్రభాస్ బ్యూటీ..ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్!

Related News

Ranya Rao: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటికి డీఆర్ఐ భారీ షాక్..ఏకంగా 102 కోట్లు ఫైన్.. మిగతా వారికి?

Kishkindapuri Censor: కిష్కంధపురి సెన్సార్… అంతలా ఏం ఉందయ్యా… ఆ సర్టిఫికేట్ ఇచ్చారు

HBD Pawan Kalyan: ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సెట్‌ ఫోటో లీక్‌ చేసిన రాశీ ఖన్నా.. పిక్‌ వైరల్‌

Samantha: రాజ్ తో రిలేషన్ కన్ఫర్మ్ చేసిన సమంత.. వీడియో వైరల్!

OG Glimpse: హైప్‌ పెంచుతున్న ‘ఓజీ’ గ్లింప్స్‌.. పవన్‌ లుక్‌కి గూస్‌బంప్సే.. చూశారా?

HHVM 2: వీరమల్లు పార్ట్ 2లో క్రిష్ సీన్స్… బిగ్ ట్విస్ట్ ఇచ్చిన డైరెక్టర్!

Big Stories

×