Pawan Kalyan : టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సినీ హీరోగా.. ప్రజా నాయకుడిగా, జన సైనికుడిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఒకవైపు ఏపీ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన ఆయన ప్రజల మంచి చెడులను దగ్గరుండి చూసుకుంటున్నాడు. మరోవైపు హీరోగా ముందుగా సైన్ చేసిన సినిమాలను పూర్తి చేస్తున్నాడు. నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. యువతకు ఇది ఒక పండుగ రోజునే చెప్పాలి. ఆయన పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు, అభిమానులు రాజకీయ నేతలు ఆయన పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కు పవర్ స్టార్ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
చిరు ట్వీట్ కు పవన్ ఎమోషనల్ రిప్లై..
తమ్ముడు ప్రజా నాయకుడుగా ఎప్పటికీ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా అని చిరంజీవి ట్వీట్ చేశారు. దానికి స్పందించిన పవన్ కళ్యాణ్ రిప్లై ఇచ్చాడు…నా జీవితానికి మార్గదర్శి, తండ్రి సమానులైన అన్నయ్య, పద్మ విభూషణ్ శ్రీ @KChiruTweets గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులు, ప్రేమాభిమానాలు, పుట్టినరోజు శుభాకాంక్షలు ఎంతో ఆనందం కలిగించాయి. సమాజానికి ఏదైనా చేయాలని, మీరు నేర్పిన సేవా గుణమే ఈరోజు @JanaSenaParty ద్వారా ప్రజలకు సేవ చేసేందుకు స్ఫూర్తినిచ్చింది. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎల్లప్పుడూ నాతో పాటుగా కోట్లాది మందికి మార్గదర్శకుడిగా నిలవాలని కాంక్షిస్తున్నాను… అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ గా మారాయి. అన్నాదమ్ముల అనుబంధం చాలా గొప్పది. ఈరోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? మీకు మిరే సాటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు..
Also Read :రెమ్యూనరేషన్ లో పవన్ కళ్యాణ్ నయా రికార్డ్.. ఏ మూవీకి ఎంతంటే..?
పవన్ బర్త్ డే స్పెషల్ సర్ ప్రైజ్ లు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల నుంచి నేడు పుట్టినరోజు సందర్భంగా అప్డేట్స్ వచ్చేశాయి. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ మూవీ నుంచి పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ తాజా పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ బ్లాక్ డాడ్జ్ కార్‌పై కూల్‌గా కూర్చున్న స్టైల్ అటిట్యూడ్‌తో దర్శనమిచ్చారు.. ఆయన రఫ్ బియర్డ్, డార్క్ షర్ట్, స్టైలిష్ లుక్స్‌లో ఆయన మాస్ ప్రెజెన్స్ హైలైట్‌గా నిలిచింది.. వెనుక ముంబై బ్యాగ్రౌండ్ సంబంధించిన ఒక బిల్డింగు ఆ ఫోటోలో కనిపిస్తుంది.. వీధుల్లో రక్తం అగ్ని పండుగగా మారుతుంది అనేది ఫుల్ ఫైర్‌నే సూచిస్తోంది. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.. ఈ మూవీలో ప్రియా అరుణ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్ వంటి నటులు కీలక పాత్రలు చేస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది..ప్రస్తుతం మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు.
నా జీవితానికి మార్గదర్శి, తండ్రి సమానులైన అన్నయ్య, పద్మ విభూషణ్ శ్రీ @KChiruTweets గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులు, ప్రేమాభిమానాలు, పుట్టినరోజు శుభాకాంక్షలు ఎంతో ఆనందం కలిగించాయి. సమాజానికి ఏదైనా చేయాలని, మీరు నేర్పిన సేవా గుణమే ఈరోజు @JanaSenaParty… https://t.co/VYRpPj5ZKu
— Pawan Kalyan (@PawanKalyan) September 2, 2025