Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ప్రస్తుతం రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన రణబాలి(Ranabaali) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) రష్మిక మందన్న (Rashmika Mandanna)ఈ సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు వారి వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ నటించిన లైగర్(Liger) సినిమా గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
విజయ్ దేవరకొండ బాక్సింగ్ నేపథ్యంలో డేరింగ్ అండ్ డాష్ అండ్ డైరెక్టర్ పూరి పూరి జగన్నాథ్ (Puri Jagannadh)దర్శకత్వంలో నటించిన పాన్ ఇండియా చిత్రం లైగర్. పూరి, చార్మికౌర్, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 25 ,2022వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కూడా కీలక పాత్రలో నటించారు. ఇలా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
ఈ సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరుపుకుంది. కానీ విడుదలైన తర్వాత ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో సుమారు 55 కోట్ల రూపాయల వరకు నష్టాలు వచ్చాయని తెలుస్తోంది. ఈ సినిమా నష్టాలు కారణంగా డిస్ట్రిబ్యూటర్స్ తమకు న్యాయం చేయాలి అంటూ ఏకంగా ఫిలిం ఛాంబర్ వద్ద ధర్నాలు చేసిన సంగతి తెలిసిందే. తన కెరియర్ లో డిజాస్టర్ గా మిగిలిపోయిన లైగర్ సినిమా గురించి మొదటిసారి విజయ్ దేవరకొండ స్పందించారు. ప్రస్తుతం ఈయన రణబాలి సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ..
లైగర్ సినిమా కోసం నేను చాలా కష్టపడ్డాను నా బాడీని నా లైఫ్ స్టైల్ ను పూర్తిగా మార్చుకున్నాను. సిక్స్ ప్యాక్ బాడీని కాపాడుకోవడం కోసం రోజుకు తాను కేవలం 200 మిల్లీలీటర్ల నీటిని తీసుకునేవాడిని. ఈ సినిమా షూటింగ్ ముందు చివరి 10 గంటల పాటు నీళ్లకు బదులుగా తాను ఐస్ క్యూబ్ చీకుతూ తన దాహాన్ని తీర్చుకోవాల్సి వచ్చిందని ఈయన తెలిపారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రతిక్షణం తన మనసులో నీళ్ల ఆలోచన మెదులుతూ ఉండేదని, ఆ సమయంలో నేను పనిచేయలేను అనే భావన కూడా నాలో ఉండేదని విజయ్ దేవరకొండ తెలిపారు. ఇలా ఈ సినిమా కోసం తాను ఎంతో కష్టపడినప్పటికీ ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం లేకుండా ఈ సినిమా డిజాస్టర్ కావడం అనేది చాలా బాధగా అనిపించిందని విజయ్ దేవరకొండ లైగర్ డిజాస్టర్ గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read: ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత!