E-Paper
Advertisement

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఫ్రీ ఇసుక నో..?

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఫ్రీ ఇసుక నో..?
Advertisement

Indiramma Houses: స్వేచ్చ బ్యూరో: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా అందించాల్సిన ఇసుక లబ్ధిదారులకు అందని ద్రాక్షగా మారింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘మన ఊరు–మన ఇసుక’ విధానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఇసుక బుకింగ్‌ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీంతో ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టిన లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారికంగా బుకింగ్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తే ఒక ట్రాక్టర్‌కు నిర్ణయించిన 3 క్యూబిక్‌ మీటర్ల ఇసుకకు బదులు ఆన్‌లైన్‌ వ్యవస్థలో 24 క్యూబిక్‌ మీటర్లుగా చూపిస్తుండటంతో బుకింగ్‌ ప్రక్రియ నిలిచిపోయింది. అధికారులు సాంకేతిక సమస్యను పరిష్కరించక పోవడంతో లబ్దిదారులపై అదనపుభారం పడుతుంది. ప్రైవేటుగా ఇసుకను బుక్ చేసుకుంటుండటంతో నిర్మాణ వ్యయంపెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

3 క్యూబిక్‌ మీటర్లకు.. 24 క్యూబిక్‌ మీటర్లుగా..

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అవసరమైన ఇసుకను ‘మన ఊరు–మన ఇసుక’ విధానం ద్వారా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ట్రాక్టర్ ఇసుకను ఉచితంగా అందజేస్తున్నప్పటికీ ట్రాక్టర్ కిరాయి మాత్రం 1800లుగా నిర్ణయించింది. దీంతో లబ్ధిదారులు ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకుని ఇసుకను పొందుతున్నారు. అయితే సాంకేతిక సమస్యలు తలెత్తడంతో బుకింగ్‌ చేసుకునే అవకాశం లేకుండా పోయిందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ట్రాక్టర్‌కు 3 క్యూబిక్‌ మీటర్ల ఇసుక బుకింగ్‌ చేసుకునేలా నిబంధన ఉన్నప్పటికీ.. ఆన్‌లైన్‌ వ్యవస్థలో 24 క్యూబిక్‌ మీటర్లుగా పరిమాణం ప్రత్యక్షమవుతున్నది. అంటే ఒకటికి బదులుగా 8 ట్రాక్టర్లు ఇసుక చూపుతుంది. దీంతో అధికారులు బుకింగ్‌ ప్రక్రియను నిలిపివేశారు. సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు స్పందించకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.

లబ్దిదారులపై వేల అదనపుభారం

Advertisement

ఇసుక బుకింగ్‌ సమస్య నిన్నమొన్నటిది కాదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. నెల రోజులకుపైగా అధికారికంగా ఇసుక బుకింగ్‌ చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణానికి ఇసుక అత్యవసరం కావడంతో పనులు నిలిచిపోకుండా ఉండేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు మార్కెట్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. ట్రాక్టర్ ఇసుకను 2500 బుక్ చేసుకుంటున్నారు. దీంతో 700రూపాయలు అదనంతో పాటు బుక్ చేసిన వ్యక్తికి సైతం మరో 100రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒక్కో ట్రాక్టర్ కు 800 రూపాయలు అదనపు భారం పడుతుంది. ఒక్కో ఇందిరమ్మ లబ్దిదారులు 10 ట్రాక్టర్లు బుక్ చేసుకుంటే సుమారు 8వేల అదనపు భారం పడుతుంది. ఇల్లు పూర్తయ్యే వరకు పలుమార్లు ఇసుక అవసరం కావడంతో అదనపు వ్యయం వేల రూపాయలకు చేరుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also read: CNG నింపుతుండగా భారీ పేలుడు.. కారు యజమానులు ఈ 3 విషయాల్లో జాగ్రత్త!

టోల్‌ఫ్రీకి ఫోన్‌ చేసినా.. స్పందన లేదు

Advertisement

సాంకేతిక సమస్య ఎదురవుతున్న నేపథ్యంలో లబ్ధిదారులు సమస్య పరిష్కారం కోసం టోల్‌ఫ్రీ నంబరును ఆశ్రయిస్తున్నారు. అయితే పలుమార్లు ఫోన్‌ చేసినా స్పందన లభించడం లేదని వారు వాపోతున్నారు. సమస్యను ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సమయాల్లో పరిష్కారం అవుతుందని, మరోసారి వెబ్ సైట్ చెక్ చేసుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇసుక సమస్య మరింత జఠిలమవుతోంది.

పనులు నిలిచే పరిస్థితి..

ఇసుక సరఫరా సక్రమంగా లేకపోవడంతో పునాదులు, గోడలు, స్లాబ్‌ తదితర నిర్మాణ దశల్లో ఉన్న ఇళ్ల పనులు ఆలస్యం అవుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయం, ఇతర నిర్మాణ సామగ్రి అందుబాటులో ఉన్నా.. ఇసుక కొరతతో పనులు ముందుకు సాగడం లేదని లబ్ధిదారులు చెబుతున్నారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో ప్రైవేటుగా బుక్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఇల్లు నిర్మాణానికి సిమెంట్‌, స్టీల్‌, కూలీల ఖర్చులు భరిస్తున్న సమయంలో ఇసుక కోసం అదనపు మొత్తం చెల్లించడం తమకు భారంగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాంకేతిక సమస్యను పరిష్కరించాలి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఇసుక బుకింగ్‌లో సాంకేతిక ఇబ్బందులు కొనసాగితే లక్ష్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌లో కనిపిస్తున్న ఇసుక పరిమాణాన్ని సరిచేసి, ఒక ట్రాక్టర్‌కు నిర్దేశించిన పరిమాణంలో సులభంగా బుకింగ్‌ చేసుకునేలా వ్యవస్థను మార్చాలని లబ్ధిదారులు కోరుతున్నారు. టోల్‌ఫ్రీ నంబర్‌ ద్వారా ఫిర్యాదులు స్వీకరించి, సమస్యలను వెంటనే పరిష్కరించేలా ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఇసుక బుకింగ్‌ సమస్యను సత్వరం పరిష్కరించి.. ప్రైవేటు మార్కెట్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితి లేకుండా చూడాలని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేకుంటే మరిన్ని కష్టాలు లబ్దిదారులను వెంటాడనున్నాయి.

Also read: ‘పల్లె పల్లెకు పొన్నం’ గ్రాండ్ సక్సెస్.. త్వరలో మరో పర్యటనకు పొన్నం షెడ్యూల్!

Tags

Related News

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..?

కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల రచ్చ.. ఈ 3 స్థానాల కోసం భారీగా అప్లికేషన్లు!

‘పల్లె పల్లెకు పొన్నం’ గ్రాండ్ సక్సెస్.. త్వరలో మరో పర్యటనకు పొన్నం షెడ్యూల్!

విశ్వాసం కోల్పోయిన ఎన్నికల సంఘం.. జనాల్లోకి బలంగా వెళ్లిన ఎస్‌ఐఆర్‌ అక్రమాలు..! మోడీ సర్కార్‌కు గుదిబండగా మారిన సీఈసీ జ్ఞానేశ్వర్‌..!

ఇదే నినాదంతో ఎన్నికలకు పోయే దమ్ముందా? కేటీఆర్‌ను లేపాలని చూస్తే.. పార్టీకి మరింత నష్టమే..! వివాదస్పదమవుతున్న రసమయి కామెంట్స్‌..!

విద్వేషపూరిత పాలన, ప్రసంగాలు వద్దు.. కక్షపూరిత వైఖరి విడనాడాలని సూచన..! అదును చూసి కేసీఆర్ హితోపదేశం..!

అమెరికా వీసా మీ చేతిలో ఉందా.. అయితే పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి!

Big Stories

Advertisement
×