BigTV English

King Dom Release Date: కింగ్ డం రిలీజ్ డేట్ లాక్…మాట నిలబెట్టుకున్న వంశీ!

King Dom Release Date: కింగ్ డం రిలీజ్ డేట్ లాక్…మాట నిలబెట్టుకున్న వంశీ!

King Dom Release Date: టాలీవుడ్ నిర్మాణ సంస్థలలో ఒకటైన సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ద్వారా నిత్యం ఎన్నో విభిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి సక్సెస్ సినిమాలను అందిస్తున్నారు. ఇక త్వరలోనే నాగ వంశీ (Nagavamshi)నిర్మాణంలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)హీరోగా నటించిన కింగ్ డం (King Dom)అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నిజానికి ఈ సినిమా జూన్ నెలలోనే విడుదల కావాల్సి ఉండగా కొంత షూటింగ్ పెండింగ్ పడిన నేపథ్యంలో ఈ సినిమాని జూలై నెలలో విడుదల చేయాలని భావించారు. అయితే జూలై నెలలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో మరోసారి నాగవంశీ ఈ సినిమాని వాయిదా వేసుకున్నారు.


పవన్ సినిమాకు లైన్ క్లియర్..

మొదటినుంచి కూడా పవన్ కళ్యాణ్ సినిమాకు నాగ వంశీ పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమా విడుదలకు తన సినిమా ఏ మాత్రం అడ్డంకిగా ఉండకూడదని ఈయన భావిస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ సినిమా జులై 24వ తేదీ రాబోతున్న నేపథ్యంలో నాగ వంశీ కూడా తన సినిమాని మరోసారి వాయిదా వేసుకుంటూ ఆగస్టు 1వ తేదీ విడుదల చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. ఇటీవల సోషల్ మీడియాలో 24వ తేదీ పవన్ హరిహర వీరమల్లు విడుదల అయితే 25వ తేదీ నాగవంశీ కింగ్ డమ్ విడుదలవుతుంది అంటూ వార్తలు రావడంతో ఆ వార్తలను కొట్టి పారేశారు.


మాట తప్పని నాగ వంశీ…

ప్రస్తుతం మాత్రం విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా ఆగస్టు ఒకటో తేదీ విడుదల చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి (Gautham Thinnanuru)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించబోతున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి టీజర్ తో పాటు సాంగ్ అప్డేట్స్ కూడా రాబోతున్నాయని ఇటీవల నాగ వంశీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా ఆగస్టు ఒకటో తేదీ రాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కింగ్ డం పైనే ఆశలు…

ఇక ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా నాగ వంశీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా వస్తే తాను వెనక్కి తప్పుకుంటానని చెప్పారు. చెప్పిన విధంగానే ఈయన మాటపై నిలబడ్డారంటూ ప్రశంసిస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే ఇదేనా ఇటీవల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న పెద్దగా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు ఈయన అర్జున్ రెడ్డి, గీతగోవిందం తర్వాత అదే స్థాయి సక్సెస్ మాత్రమే ఇప్పటివరకు అందుకోలేదు. ఇటీవల ఖుషి ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పర్వాలేదు అనిపించుకున్నారు తప్ప మంచి సక్సెస్ మాత్రం అందుకోలేదు. ఇక విజయ్ దేవరకొండ అభిమానులు కూడా ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా ద్వారా విజయ్ దేవరకొండ తిరిగి అర్జున్ రెడ్డి తరహాలో హిట్ అందుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: ఎమ్మెల్యేగా అందుకే పోటీ చేయలేదు.. పొలిటికల్ ఎంట్రీ పై శివాజీ కామెంట్స్!

Related News

Samantha : డైరెక్టర్ గా సమంత.. హీరోయిన్ గా ఇక చేయనట్లేనా..?

Tvk Maanadu: విజయ్ మానాడు సభ పై రజనీకాంత్ రియాక్షన్, హీటెక్కుతున్న తమిళ రాజకీయాలు

Tollywood strike: షూటింగ్స్ అయితే మొదలయ్యాయి, కానీ మరో చిక్కొచ్చి పడింది

SSMB29 : SSMB29 రిలీజ్ డేట్ ఫిక్స్, మహేష్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి

OG Movie: షూటింగ్ డిలే… పవన్ కళ్యాణ్ మూవీ వాయిదా?

SSMB29: దట్టమైన అడవుల్లో, క్రూర మృగాల మధ్య షూటింగ్ చేస్తున్న రాజమౌళి

Big Stories

×