Actor Shivaji: శివాజీ తెలుగులో ఎన్నో అద్భుతమైన విభిన్నమైన సినిమాలలో హీరోగా నటిస్తూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు.. గుంటూరుకు చెందిన శివాజీ (Shivaji) నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు అయితే కెరియర్ మొదట్లో ఈయన బుల్లితెర వ్యాఖ్యాతగా పనిచేశారు అనంతరం పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించే అవకాశం అందుకున్నారు. అనంతరం హీరోగా అవకాశాలు అందుకున్న శివాజీ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఈయన రాజకీయాలలో(Politics)కి కూడా అడుగుపెట్టారు. ఒకానొక సమయంలో “ఆపరేషన్ గరుడ”(Operation Garuda) అంటూ సంచలనాలను సృష్టించిన విషయం తెలిసిందే.
ఎమ్మెల్యే అభ్యర్థిగా శివాజీ?
ఇలా కొంతకాలం పాటు రాజకీయాలలో హల్చల్ చేసిన శివాజీ పూర్తిగా రాజకీయాలకు సినిమా ఇండస్ట్రీకి కూడా దూరమయ్యారు. ఇక అనుకోకుండా ఈయన బిగ్ బాస్ (Bigg Boss) కార్యక్రమంలోకి అడుగుపెట్టడం ఈ కార్యక్రమం ద్వారా మంచి సక్సెస్ అందుకొని తిరిగి కెరియర్ పరంగా బిజీ అవడం జరుగుతుంది. ఇప్పటికీ శివాజీ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయ అంశాలపై కూడా స్పందిస్తూ ఉంటారు. ఇక ఈయన గతంలో ప్రత్యేక హోదా కోసం కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వానికి కూడా మద్దతు తెలిపారు.
పలుకుబడి ఉంటే కాదు.. డబ్బు ఉండాలి..
ఇలా కూటమి ప్రభుత్వానికి మద్దతు నిలిచిన శివాజీ గత ఎన్నికలలో ఎమ్మెల్యేగా(MLA) పోటీ చేసే అవకాశం వచ్చిన పోటీ చేయలేకపోయారు అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా పొలిటికల్ విషయాల గురించి ప్రస్తావన రావడంతో తాను గత ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ వచ్చిన వదులుకున్నానని తెలిపారు. ఎన్నికలలో పోటీ చేయాలి అంటే పేరు పలుకుబడి మాత్రమే కాదు డబ్బు కూడా ఉండాలని శివాజీ తెలిపారు. ఇలా ఎమ్మెల్యేగా పోటీ చేసే అంత డబ్బు నా దగ్గర లేకపోవడం వల్లే నేను ఎమ్మెల్యేగా ఎన్నికలలో నిలబడలేదని తెలిపారు.
మంగపతిగా అదరగొట్టిన శివాజీ..
ఒకవేళ ఎన్నికలలో కనక పోటీ చేసే ఉంటే గెలిచేవారా? అనే ప్రశ్న కూడా ఎదురయింది. కచ్చితంగా తాను ఎమ్మెల్యేగా గెలిచే వాడినని శివాజీ తెలిపారు. రాజకీయాల పట్ల శివాజీ ఆసక్తి చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఎన్నికలలో పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇక శివాజీ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లు అంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే 90s అనే వెబ్ సిరీస్ హిట్ కొట్టిన ఈయన తాజాగా కోర్టు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో మంగపతి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నారు. ఇక శివాజీ నటుడిగా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేశారు ఈయన నితిన్, ఆర్యన్ రాజేష్, విజయ్ సేతుపతి వంటి హీరోలకు డబ్బింగ్ కూడా చెప్పారు.
Also Read: అడివి శేష్ డ్రీమ్ ప్రాజెక్ట్ అదేనా… పాన్ ఇండియా డైరెక్టర్ కే పోటీ … సాధ్యమయ్యే పనేనా?