Vijay Devarakonda: సినీ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)ప్రస్తుతం కింగ్ డం (King Dom)ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా జులై 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇప్పటికే ట్రైలర్ లాంచ్ కార్యక్రమంతో పాటు ప్రీ రిలీజ్ వేడుకను కూడా ఇటీవల హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా మరికొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మాత నాగవంశీ(Nagavamsi)తో పాటు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే (Bhagya Shri Borse)హీరో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు.
తరచూ వివాదాలలో విజయ్..
ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా మీడియా వారి నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలను తెలియజేశారు. ఇకపోతే విజయ్ దేవరకొండ ఏ కార్యక్రమానికి వచ్చిన తన మాట తీరుతో వివాదాలలో నిలుస్తూ ఉంటారు. ఇలా విజయ్ దేవరకొండ వేదిక పైకి వచ్చారు అంటే ఏం మాట్లాడుతారోనని ఎంతో మది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు ఇలా గతంలో ఈయన అగ్రెసివ్ గా మాట్లాడుతూ ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. తాజాగా ఇదే విషయంపై విజయ్ దేవరకొండకు ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఎవరికోసమో మారను..
గతంలో మీరు చాలా అగ్రెసివ్ గా మాట్లాడేవారు కానీ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో కూడా చాలా కూల్ గా మాట్లాడారు. ఇక ఈరోజు కూడా ఏదో స్కూల్ కెళ్ళిన పిల్లాడిలాగా చాలా సైలెంట్ గా మాట్లాడుతున్నారు. ఇలా సైలెంట్ అవ్వడానికి గల కారణం ఏంటి అంటూ ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు విజయ్ దేవరకొండ సమాధానం చెబుతూ.. నేను అప్పటికి ఇప్పటికీ ఏమాత్రం మారలేదని, తనకు మనసులో ఏది అనిపిస్తే బయటకు అలాగే మాట్లాడతానని తెలిపారు. ఇప్పుడు ఇలాగే అనిపిస్తుందేమో.. గతంలో కూడా నేను నా మనసులో అనిపించిందే బయటకు చెప్పాను తాను ఎవరికోసమో మారని తెలిపారు. ఇక కెరియర్ మొదట్లో తాను అలా మాట్లాడాను అనిపిస్తే అది కేవలం నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసమేనని తెలిపారు.
భయం కారణంగా…
ఇలా కెరియర్ మొదట్లో తాను ఒక భయం కారణంగా అగ్రెసివ్ గా మాట్లాడిన ఇప్పుడు చాలా సాఫ్ట్ అయ్యాను. కెరీర్ మొదట్లో ఉన్న భయం ఇప్పుడు లేదని, ప్రస్తుతం మీ అందరి ప్రేమ నాలో ఉందని అందుకే ఇలా సాఫ్ట్ అయ్యాను అంటూ విజయ్ దేవరకొండ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక కింగ్ డం సనిమా విషయాకి వస్తే ఈ సినిమా స్పై యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో బ్రదర్ సెంటిమెంట్ కూడా ఉండబోతుందని తెలుస్తోంది. ఇటీవల సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ సినిమా పట్ల మంచి అంచనాలనే పెంచేసింది. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్యశ్రీ హీరోయిన్ గా నటించిన ఈయనకు అన్నయ్య పాత్రలో సత్యదేవ్ నటించారు. ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా మరికొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Also Read: Nagavamsi: నీకెంత కావాలో చెప్పు… కలెక్షన్స్ పోస్టర్లపై నాగ వంశీ కామెంట్స్!