Peanut Butter: పీనట్ బటర్.. అంటే వేరుశనగ వెన్న. ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి ఇష్టమైన ఆహారం ఇది. పీనట్ బటర్ రుచికరంగా ఉండటమే కాదు.. ఇది పోషకాలతో నిండిన ఒక అద్భుతమైన ఆహారం. వ్యాయామం చేసేవారు, పిల్లలు, కూడా దీనిని స్నాక్‌గా లేదా అల్పాహారంలో భాగంగా తీసుకుంటారు. పీనట్ బటర్‌లో విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల కలిగే 10 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రోటీన్ పుష్కలం:
పీనట్ బటర్‌లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది కండరాల పెరుగుదల, మరమ్మత్తుకు చాలా అవసరం. ఒక టేబుల్ స్పూన్ పీనట్ బటర్‌లో సుమారు 3.5 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది శాఖాహారులకు మంచి ప్రోటీన్‌గా ఉపయోగపడుతుంది.
గుండె ఆరోగ్యానికి మంచిది:
ఇందులో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది:
పీనట్ బటర్‌లో ప్రోటీన్ , ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన పెరుగుతుంది. ఇది అతిగా తినడాన్ని నివారించి.. బరువు తగ్గడానికి లేదా బరువును నియంత్రించడానికి సహాయపడుతుంది.
శక్తిని అందిస్తుంది:
అధిక కేలరీలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండటం వల్ల పీనట్ బటర్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. వ్యాయామం తర్వాత తీసుకోవడానికి ఇది ఒక గొప్ప ఎంపిక.
మధుమేహ నియంత్రణ:
పీనట్ బటర్‌లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెంచుతుంది. ఇందులో ఉండే ఫైబర్ , ఆరోగ్యకరమైన కొవ్వులు రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయపడతాయి. ముఖ్యంగా టైప్ 2 మధుమేహం ఉన్నవారికి.
ఫైబర్ పుష్కలం:
ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుందిజ ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు ఫైబర్ చాలా అవసరం.
యాంటీఆక్సిడెంట్లు:
పీనట్ బటర్‌లో రెస్వెరాట్రాల్, పారా-కూమారిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కణాలను రక్షించి.. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
Also Read: స్వీట్‌కార్న్ తింటే.. ఎన్ని లాభాలో తెలుసా ?
విటమిన్లు, ఖనిజాలు:
ఇందులో విటమిన్ ఇ, బి3 (నియాసిన్), బి6, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఐరన్ వంటి ముఖ్యమైన విటమిన్లు , ఖనిజాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి.. ఎముకలను బలంగా ఉంచి, శరీర విధులు సక్రమంగా పనిచేయడానికి సహాయపడతాయి.
ఎముకల ఆరోగ్యం:
పీనట్ బటర్‌లో ఉండే మెగ్నీషియం, ఫాస్పరస్ ఎముకల బలానికి, ఆరోగ్యానికి అవసరం. ఇది ఆస్టియోపొరోసిస్ వంటి ఎముకల సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.
నరాల ఆరోగ్యం:
ఇందులో ఉండే విటమిన్ బి3 (నియాసిన్) విటమిన్ బి6 నరాల పనితీరును మెరుగుపరిచి.. మెదడు ఆరోగ్యానికి తోడ్పడతాయి. నరాల సంబంధిత సమస్యలు ఉన్న వారు పీనట్ బటర్ తినడం వల్ల కూడా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.