Vijay Deverakonda:సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం అనేది కచ్చితంగా ఉంటుంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరో హీరోయిన్లకు ఎలాంటి స్వేచ్ఛ ఉండదని , ఇప్పటికే ఎంతోమంది తమ అభిప్రాయాలుగా పంచుకున్నారు. కానీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీకి వచ్చిన హీరో హీరోయిన్లకు మాత్రం మంచి అవకాశాలు రావడంతో పాటు వారికి ఫ్రీడమ్ కూడా ఉంటుంది. అయితే ఇండస్ట్రీలో ఉండే నెపోటిజం కారణంగా ఎంతో మంది హీరో హీరోయిన్లు తమకు వచ్చిన అవకాశాలను కోల్పోవాల్సి వస్తుంది. మొదట ఈ బ్యాక్ గ్రౌండ్ లేని హీరో హీరోయిన్లను తీసుకొని మంచి సినిమాలైతే వారిని అందులో నుండి తప్పించి.. స్టార్ హీరో హీరోయిన్ల కూతుర్లను, కొడుకులను పెట్టి సినిమాలు తీసేలా దర్శక నిర్మాతలకు చెప్పే బ్యాక్గ్రౌండ్ ఉన్న సెలెబ్రెటీలు ఎంతోమంది ఉన్నారు.అలా నెపోటిజం కారణంగా చాలామంది హీరో హీరోయిన్లు ఎన్నోసార్లు బాధపడ్డ సందర్భాలు అనేకం ఉన్నాయి.
నెపోటిజంపై విజయ్ దేవరకొండ కామెంట్స్..
అయితే తాజాగా నెపోటిజం గురించి షాకింగ్ విషయాన్ని చెప్పారు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda).. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న హీరోలలో విజయ్ దేవరకొండ కూడా ఒకరు. ప్రస్తుతం ఈయన నటించిన సినిమాలు హిట్ కాకపోయినప్పటికీ విజయ్ దేవరకొండకు ఒక బ్రాండ్ అయితే ఇండస్ట్రీలో ఏర్పడింది.
నెపోకిడ్ రేంజ్ కి నేను కూడా ఎదిగాను..
అయితే అలాంటి విజయ్ దేవరకొండ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నెపోటిజం కారణంగా చాలామంది నష్టపోతారు.అయితే ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉండే హీరోలకు ఏదైనా చేసే స్వేచ్ఛ ఉంటుంది. కానీ బ్యాక్ గ్రౌండ్ లేని వారికి అలా ఉండదు. ఇప్పటికి కూడా కొంతమంది దర్శక నిర్మాతలు కథ విషయంలో నన్ను వ్యతిరేకిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడిప్పుడే నేను నెపో కిడ్ రేంజ్ కి ఎదిగాను. ఎందుకంటే నాకు నచ్చని కథను మొహం మీదే నచ్చలేదు అని రిజెక్ట్ చేసే స్థాయికి వచ్చేసాను.నచ్చకపోతే సినిమా చేయడం లేదు. నేను ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కష్టపడి గుర్తింపు తెచ్చుకొని, ఏదైనా కథ నచ్చకపోతే మొహం మీదే చెప్పాలి అనే స్థాయికి ఎదిగాను. సినిమా ఇండస్ట్రీలో పెద్ద బ్యాక్ గ్రౌండ్ నుండి రాకపోతే కథ విషయంలో స్వేచ్ఛ అనేది నీకు ఉండదు.
ఇండస్ట్రీలో ఎదగాలంటే సపోర్ట్ ఉండాల్సిందే..
సపోర్ట్ లేకపోతే ఇండస్ట్రీలో ఎదగలేరు. బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలకు ఎన్నో సౌలభ్యాలు ఉంటాయి.వారికి కథ నచ్చకపోతే వాళ్ళ తండ్రులు కలగజేసుకొని నీకోసం వేరే స్టోరీని చూస్తా.. ఈ సినిమా రిజెక్ట్ చేయి అని చెబుతారు. అలాగే దర్శకనిర్మాతలకు కూడా ఈ స్టోరీ బాలేదు. వేరే కథ రెడీ చేయండని చెప్పే ఫ్రీడం ఉంటుంది. అలాగే స్క్రిప్ట్ మార్చమని చెప్పే ధైర్యం కూడా ఉంటుంది. అవసరమైతే కొంచెం గ్యాప్ తీసుకొని మరీ వేరే రైటర్లను మార్చి స్క్రిప్ట్ సరి చేయు అని చెప్పే ధైర్యం వాళ్లకు ఉంటుంది. ఎందుకంటే వారి వెనక పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉంటుంది. అయితే దర్శక నిర్మాతల మొహం మీద ఇలాంటి మాటలు చెప్పే ధైర్యం అందరికీ ఉండదు. కేవలం అది బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలకు మాత్రమే ఉంటుంది. ఇక ఇన్ని రోజులు నేను సినిమాల్లో కష్టపడినందుకు ఇప్పుడిప్పుడే నేను ఆ రేంజ్ కి ఎదిగాను.
నేను కూడా ఇండస్ట్రీలో వ్యతిరేకత ఎదుర్కొంటున్నాను..
అయితే ఇప్పుడు కూడా కొంతమంది ప్రొడ్యూసర్ల నుండి డైరెక్టర్ల నుండి నాకు వ్యతిరేకత వస్తుంది. కానీ నేను మాత్రం నాకు నచ్చింది చేస్తున్నాను.నాకు ఇండస్ట్రీలో ట్యాగ్ లు అవసరం లేదు. ప్రేక్షకులకు నా పేరు గుర్తుంటే చాలు.అయితే ఈ ట్యాగ్ లు లేకుండా ఎన్ని రోజులు ఉంటానని కూడా నాకు తెలియదు అంటూ నెపోటిజంపై షాకింగ్ కామెంట్లు చేశారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ..
విజయ్ దేవరకొండ సినిమాలు..
ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే.. ఫ్యామిలీ స్టార్ (Family Star) మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా ఆడింది. ప్రస్తుతం ఈయన నటిస్తున్న కింగ్ డం మూవీ(Kingdom Movie) జూలై 31న విడుదలకు సిద్ధమైంది. గౌతమ్ తిన్ననూరి (Gautham Thinnanuri) డైరెక్షన్లో వస్తున్న కింగ్డమ్ మూవీలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే (Bhagya Sri Borse)నటించింది.
also read:Allu Arjun – Will Smith: అల్లు అర్జున్‌కు విలన్‌గా హాలీవుడ్ స్టార్ హీరో.. ఇక భీకర యుద్దమే!
"I don't have the privilege to tell a director that I'm not impressed with a flawed script, since I don't have any backing or industry support.
But I know an actor whose influential father lets him speak up, and even brings 2–3 writers to fix it."
– #VijayDeverakonda | #Kingdom pic.twitter.com/0k14gvNuRC
— Movies4u Official (@Movies4u_Officl) July 8, 2025