ART theatre: హీరోలు ఒక వైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు బిజినెస్ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఇంకొంతమంది రాజకీయాలలో చలామణి అవుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈమధ్య మరీ ఎక్కువగా థియేటర్ బిజినెస్ లోకి అడుగుపెడుతున్నారు హీరోలు. అందులో భాగంగానే.. అల్లు అర్జున్(Allu Arjun), మహేష్ బాబు(Mahesh Babu) వంటి స్టార్ హీరోలను మొదలుకొని యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) వరకు ఇలా చాలామంది థియేటర్ బిజినెస్ రంగంలోకి అడుగులు వేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వీరి బాటలోకి మాస్ మహారాజా రవితేజ (Raviteja)కూడా వచ్చి చేరారు.
మల్టీప్లెక్స్ థియేటర్ ప్రారంభించిన రవితేజ..
ఇప్పటికే పలువురు స్టార్ హీరోలతో కలిసి థియేటర్ మల్టీప్లెక్స్ లను ప్రారంభించిన ఏషియన్ సినిమాస్ ఇప్పుడు రవితేజతో కూడా చేతులు కలిపింది. ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో హైదరాబాదులోని వనస్థలిపురంలో ఆరు స్క్రీన్ లతో కూడిన లగ్జరీ మల్టీప్లెక్స్ థియేటర్ ను రవితేజ ప్రారంభించారు. ART (ఏషియన్ రవితేజ) పేరుతో ప్రారంభించబడిన ఈ థియేటర్ జూలై 31వ తేదీన ప్రారంభం కానుంది.60 అడుగుల భారీ స్క్రీన్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టంతో ఈస్ట్ హైదరాబాదులోనే అత్యంత విలాసవంతమైన థియేటర్ గా ఇది నిలవనుంది అని సమాచారం
రవితేజ థియేటర్లో మొదటి సినిమా ప్రదర్శన ఆ హీరోదే..
ఇకపోతే ఈ థియేటర్లో మొదటి సినిమాగా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తాజాగా నటిస్తున్న కింగ్డమ్ (Kingdom) సినిమాను ప్రదర్శించనున్నారు. గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో భాగ్యశ్రీ బోర్సే (Bhagya Sri borse) హీరోయిన్ గా సత్యదేవ్ (Sathyadev) కీలక పాత్రలో.. వీపీ వెంకటేష్ (VP Venkatesh) విలన్ గా రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.. ముఖ్యంగా శ్రీలంకలో జరిగే యాక్షన్ హైడ్రామాగా రాబోతున్న ఈ సినిమా జూలై 31న విడుదల కాబోతోంది. ఇప్పుడు ఈ సినిమాని రవితేజ కొత్త థియేటర్లో ప్రదర్శించబోతున్నారు. మొత్తానికైతే రవితేజ మొదలుపెట్టిన ఈ బిజినెస్ రంగంలో విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ ప్రదర్శించబోతున్నారు అని తెలిసి రౌడీ హీరో అభిమానులు ఆనందంతో ఎగిరి గంతేస్తున్నారు. ఇక ఈ థియేటర్ మరింత వేగంగా.. నిత్యం హౌస్ ఫుల్ బోర్డులతో కలకలలాడుతూ సక్సెస్ బాట పట్టాలి అని కోరుకుంటున్నారు.
రవితేజ సినిమాలు..
మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ‘మాస్ జాతర’ అనే సినిమాలో నటిస్తున్నారు. భాను భోగవరపు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఆగస్టు 27వ తేదీన విడుదల కాబోతోంది. వినాయక చవితి సందర్భంగా రాబోతున్న ఈ సినిమాలో శ్రీ లీలా (Sree Leela) హీరోయిన్గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత డైరెక్టర్ కిషోర్ దర్శకత్వంలో ఆర్టి76 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది.
ART cinemas – Vanasthalipuram
6 screens opening on 31st July 2025. #MovieTheaters #Vanasthalipuram #ARTCinemas #RaviTeja @RaviTeja_offl pic.twitter.com/xQm8XeiExm— BIG TV Cinema (@BigtvCinema) July 28, 2025
Also read: Nirupam Paritala: నిరుపమ్‌కి ‘పరిటాల’ బంధువా? డాక్టర్ బాబు షాకింగ్ ఆన్సర్.?