Test Tube Baby Center: పాపాలు పూర్తి అయితే ఏం జరుగుతోంది? సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో అదే జరిగింది. సరోగసీ ముసుగులో బిచ్చగాళ్ల నుంచి వీర్యం సేకరించడం చేపట్టింది. వారికి ఏకాంత వీడియోలు చూపించి రెచ్చగొట్టి కావాల్సిన వీర్యాన్ని తీసుకునేది. సృష్టి గురించి కేవలం చెప్పుకోవడానికి మాత్రమే. తెర వెనుక తెలియని దారుణాలు చాలానే ఉన్నాయట.
వీర్యం.. అండాల సేకరణ పేరుతో హైదరాబాద్ సిటీలో జరిగిన.. జరుగుతున్న వికృత దందాలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సంతానం లేనివారు దాతల నుంచి వీర్యం, అండాలు కోరుకుంటారు. ఆయా దాతలు బాగా చదువు, తెలివితేటలు ఉన్నవారై ఉండాలి. కానీ ప్రజల పిచ్చిని తమకు అనుకూలంగా మార్చుకోవడం మొదలుపెట్టింది సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్.
ఈ దందా నడిపేవారు బిచ్చగాళ్లు, కూలీల వీర్యం, అండాలు సేకరించడం మొదలు పెట్టారు. ఇండియన్ స్పెర్మ్ టెక్ క్రయోసిస్టమ్ క్లినిక్ పేరుతో సికింద్రాబాద్‌లో ఈ యవ్వారాన్ని నడుపుతున్న ఏడుగుర్ని అరెస్టు చేశారు. లోతుగా దర్యాప్తు చేసినకొద్దీ షాకయ్యే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సృష్టి క్లినిక్ నుంచి పెద్ద సంఖ్యలో IVF సరోగసీ రికార్డులు సీజ్ చేశారు.
ఆ క్లినిక్ యజమాని తన వద్ద కొంతమందిని ఏజెంట్లుగా టెక్నీషియన్లను నియమించుకున్నాడు. వాళ్లంతా బిచ్చగాళ్లకు,కూలీలకు డబ్బు ఆశ చూపి వారి నుంచి వీర్యం, అండాలను సేకరించడం మొదలుపెట్టారు. వారి నుంచి తక్కువ డబ్బులకు వీర్యం, అండాలు సేకరించినట్టు తేలింది.
ALSO READ: హైదరాబాద్‌లో భూముల వేలం.. ఎకరం రూ.104 కోట్లు!
అసిస్టెడ్ రీ ప్రొడక్టివ్ టెక్నాలజీ ప్రకారం ఆరోగ్యవంతులైన వారి నుంచి ముఖ్యంగా 21 నుంచి 55 ఏళ్ల లోపు వారి నుంచి వీర్యం సేకరించాలి. అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత జన్యుపరమైన వ్యాధులు లేవని నిర్ధారించుకుంటారు. ఆ తర్వాత వారి నుంచి వీర్యం సేకరించాలి.
అయితే ఒక దాత నుంచి 25 సార్లు వీర్యాన్ని సేకరించాలి. మహిళకు ఒకసారి గర్భధారణకు ఉపయోగించాలి. స్పెర్మ్ క్లినిక్‌లు ఆయా నిబంధనలు తుంగలో తొక్కాయి. ఒక వ్యక్తి నుంచి వారానికొకసారి వీర్యం సేకరిస్తున్నాయి.
కొందరు ఏజెంట్లు.. బిచ్చగాళ్లు, కూలీలను సంప్రదించి తాము చెప్పినట్లు చేస్తే మందుతోపాటు బిర్యానీ ఇప్పిస్తామని ఆశ చూపించినట్టు తేలింది. లేకుంటే 500 లేదా -1000 రూపాయలను చేతిలో పెట్టి పంపినట్టు తెలుస్తోంది. అయితే కొందరి మహిళలకు రూ.20 వేల వరకు చెల్లించేవారని తెలిసింది.
నిందితులను మరోసారి కస్టడీకి తీసుకొని విచారించాలని భావిస్తున్నారు పోలీసులు. వీర్యం సేకరణ విషయంలో మరో అస్త్రాన్ని సైతం ప్రయోగించేవారట నిర్వాహకులు. దాతలకు ఏకాంత వీడియోలను చూపించి వారిలో లైంగిక కోరికలను పెంచి ఆ విధంగా వీర్యాన్ని సేకరించినట్టు తెలుస్తోంది.
బిచ్చగాళ్ల నుంచి వీర్యం సేకరణ
సరోగసీ ముసుగులో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ దారుణాలు
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన విషయాలు
సికింద్రాబాద్ చుట్టుపక్కల ఉండే బిచ్చగాళ్లకు బీరు, బిర్యానీ ఇచ్చి వీర్యం సేకరించిన నిర్వాహకులు
పోర్న్ వీడియోలు చూపించి వీర్యం సేకరణ… https://t.co/K6lnUcwrgR pic.twitter.com/rTe0b9BLD9
— BIG TV Breaking News (@bigtvtelugu) July 29, 2025