Snapchat new privacy rules for teens: సోషల్ మీడియాలో పిల్లల భద్రత అనేది ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. సైబర్ బుల్లీయింగ్, ఫేక్ అకౌంట్ల వేధింపుల నుంచి చిన్న పిల్లలను కాపాడటానికి స్నాప్‌చాట్ సరి కొత్త ప్రైవసీ ఫీచర్లను అమల్లోకి తెచ్చింది. 16 ఏళ్లు , అంతకంటే తక్కువ వయస్సు ఉన్న యూజర్ల ప్రొఫైల్స్ ఇకపై పబ్లిక్‌గా ఎవరికీ కనిపించవు. అలాగే తెలియని వ్యక్తులు వీరికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపడం కూడా చాలా కష్టతరం కానుంది. ఈ అప్‌డేట్ తల్లిదండ్రులకు పెద్ద ఉపశమనం కలిగించనుంది.
1. అపరిచితుల మెసేజ్‌లకు బ్రేక్ :
కొత్త రూల్స్ ప్రకారం.. 16 ఏళ్లలోపు పిల్లలకు మ్యూచువల్ ఫ్రెండ్స్ (ఇద్దరికీ తెలిసిన స్నేహితులు) లేకపోతే.. ఏ అపరిచిత వ్యక్తి కూడా నేరుగా మెసేజ్ లేదా స్నాప్ పంపడానికి వీలుండదు. దీనివల్ల అపరిచితులు గ్రూపుల్లోనో లేదా సెర్చ్ బార్ ద్వారానే పిల్లల ప్రొఫైల్స్ వెతికి, వాళ్లను ఇబ్బంది పెట్టే అవకాశం పూర్తిగా తగ్గిపోతుంది.
2. ‘క్విక్ యాడ్’ పరిమితులు :
స్నాప్‌చాట్‌లో సాధారణంగా ‘Quick Add’ అనే ఫీచర్ ద్వారా ఒకరికొకరు తెలియకపోయినా ఫ్రెండ్స్ లిస్ట్‌లో సజెస్ట్ అవుతుంటారు. 16 ఏళ్లలోపు వారి ప్రొఫైల్స్ ఈ ‘క్విక్ యాడ్’ సెక్షన్‌లో అందరికీ కనిపించవు. కేవలం చాలా మంది కామన్ ఫ్రెండ్స్ ఉన్న వారికి మాత్రమే అది కూడా కఠినమైన ఫిల్టర్ల తర్వాతే ప్రొఫైల్ రికమండ్ అవుతుంది. దీని వల్ల ప్రొఫైల్ విజిబిలిటీ బాగా తగ్గుతుంది.
3. అనుమానాస్పద అకౌంట్లపై నిఘా:
పెద్ద వయస్సు ఉన్న వ్యక్తులు ఎవరైనా టీనేజర్ల అకౌంట్లను వెతకడానికి ప్రయత్నిస్తే.. స్నాప్‌చాట్ అల్గారిథమ్ వెంటనే అలర్ట్ అవుతుంది. ఒకవేళ ఏదైనా అకౌంట్ అనుమానాస్పదంగా అనిపిస్తే (ఉదాహరణకు తక్కువ టైంలో ఎక్కువ మంది పిల్లలకు రిక్వెస్ట్లు పంపడం లాంటివి చేస్తే).. ఆ అకౌంట్‌ను స్నాప్‌చాట్ ఆటోమేటిక్‌గా బ్లాక్ చేస్తుంది. అలాగే పిల్లలకు కూడా “ఈ వ్యక్తి మీకు తెలియదు, జాగ్రత్త” అని పాప్-అప్ వార్నింగ్ ఇస్తుంది.
4. లొకేషన్ షేరింగ్ సేఫ్టీ:
స్నాప్‌చాట్ మ్యాప్‌లో లొకేషన్ షేరింగ్ అనేది ఒక పెద్ద రిస్క్. అయితే కొత్త అప్‌డేట్ ప్రకారం, 16 ఏళ్లలోపు పిల్లల లొకేషన్ హిస్టరీని యాప్ ఆటోమేటిక్‌గా ‘ఘోస్ట్ మోడ్’లో చుతుంది. పిల్లలు తాము స్వయంగా లొకేషన్ ఆన్ చేసి, కేవలం తమ బెస్ట్ ఫ్రెండ్స్‌కు మాత్రమే పర్మిషన్ ఇస్తే తప్ప, వారి లొకేషన్ పబ్లిక్‌గా ఎవరికీ ట్రాక్ కాదు.
Also Read: ఇన్‌స్టాలో మీకు నచ్చినవే చూడండి.. ఫీడ్‌ను కంట్రోల్ చేసే సూపర్ ట్రిక్స్ ఇవే!
5. పేరెంటల్ కంట్రోల్ – ఫ్యామిలీ సెంటర్:
ఈ అప్‌డేట్‌తో పాటు స్నాప్‌చాట్ ‘ఫ్యామిలీ సెంటర్’ ఫీచర్‌ను మరింత పటిష్టం చేసింది. ని ద్వారా పేరెంట్స్ తమ పిల్లల అకౌంట్‌ను ట్రాక్ చేయవచ్చు. అంటే..ల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరెవరు వాళ్ల ఫ్రెండ్ లిస్ట్‌లో ఉన్నారు? అనే విషయాలను తల్లిదండ్రులు చూడొచ్చు (అయితే ప్రైవసీ రెస్పెక్ట్ ఇస్తూ మెసేజ్ చాట్స్ మాత్రం చదవలేరు).
స్నాప్‌చాట్ తీసుకొచ్చిన ఈ సరికొత్త సేఫ్టీ అప్‌డేట్ టీనేజర్లకు డిజిటల్ ప్రపంచంలో ఒక రక్షణ కవచం లాంటిది. మీ ఇంట్లో కూడా 16 ఏళ్లలోపు పిల్లలు స్నాప్‌చాట్ వాడుతుంటే, వెంటనే యాప్‌ను అప్‌డేట్ చేయించండి. ప్రైవసీ సెట్టింగ్స్ లోకి వెళ్లి ఈ కొత్త ఫీచర్లు ఎనేబుల్ అయ్యాయో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి