E-Paper
Advertisement

ఇన్‌స్టాలో మీకు నచ్చినవే చూడండి.. ఫీడ్‌ను కంట్రోల్ చేసే సూపర్ ట్రిక్స్ ఇవే!

ఇన్‌స్టాలో మీకు నచ్చినవే చూడండి.. ఫీడ్‌ను కంట్రోల్ చేసే సూపర్ ట్రిక్స్ ఇవే!
Advertisement

Instagram Feed Settings: చాలా మంది ఇన్‌స్టా వాడుతున్నప్పుడు అల్గారిథమ్ చూపించే కంటెంట్‌ను చూస్తూ ఉండిపోతారు. దీని వల్ల టైమ్ వేస్ట్ అవ్వడమే కాకుండా.. కొన్నిసార్లు చికాకు తెప్పించే పోస్టులు కూడా స్క్రీన్ పైకి వస్తుంటాయి. కానీ..యూజర్ల మానసిక ప్రశాంతతను, కంటెంట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇన్‌స్టాగ్రామ్ అద్భుతమైన నియంత్రణ ఫీచర్లను తీసుకొచ్చింది. వీటి ద్వారా మీ హోమ్ ఫీడ్‌ను పర్సనల్ డైరీలా మీకు నచ్చిన అకౌంట్లతో మాత్రమే నింపేయవచ్చు. ఆ ట్రిక్స్ ఏంటో ఇప్పుడు స్టెప్-బై-స్టెప్ చూద్దాం.

1. ‘ఫేవరెట్స్’ ఫీచర్ వాడుకోండి :
మీరు ఇన్‌స్టా ఓపెన్ చేయగానే మీ క్లోజ్ ఫ్రెండ్స్ లేదా మీకు నచ్చిన ఇన్‌ఫ్లుయెన్సర్స్ పోస్టులు మాత్రమే కనిపించాలా? అయితే ఈ ట్రిక్ మీ కోసమే. ఇన్‌స్టాగ్రామ్ హోమ్ పేజీలో ఎడమవైపు పైన ఉన్న Instagram లోగోపై క్లిక్ చేయండి. అక్కడ మీకు ‘Following’, ‘Favorites’ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. మీరు ‘Favorites’ లో మీకు నచ్చిన అకౌంట్లను యాడ్ చేసుకుంటే, ఇన్‌స్టా ఓపెన్ చేసిన ప్రతిసారీ కేవలం వాళ్ల అప్‌డేట్స్ మాత్రమే ఫస్ట్‌లో కనిపిస్తాయి. మిగతా సోది కంటెంట్ ఏదీ మధ్యలో రాదు.

Advertisement

2. ‘నాట్ ఇంట్రెస్టెడ్’ బటన్ మ్యాజిక్ :
ఏదైనా ఒక రీల్ లేదా పోస్ట్ మీకు నచ్చకపోతే దాన్ని చూస్తూ వదిలేయకండి. ఎందుకంటే మీరు దాన్ని ఎంతసేపు చూస్తే అల్గారిథమ్ అలాంటి పోస్టులనే మళ్లీ మళ్లీ చూపిస్తుంది. మీకు నచ్చని పోస్ట్ కనిపించినప్పుడు, ఆ పోస్ట్ పక్కన ఉండే త్రీ డాట్స్ పై క్లిక్ చేసి “Not Interested” అని నొక్కండి. ఇలా చేయడం వల్ల “నాకు ఈ రకమైన కంటెంట్ వద్దు” అనే సిగ్నల్ అల్గారిథమ్‌కు వెళ్తుంది. దాంతో ఆ టైప్ పోస్టులు రావడం ఆగిపోతాయి.

Also Read: ఆపద వస్తే కాపాడేది మీ ఫోనే.. ఈ 5 ఆండ్రాయిడ్ సెట్టింగ్స్ ఇప్పుడే ఆన్ చేసుకోండి!

Advertisement

3. నచ్చని పదాలను బ్లాక్ చేయండి:
కొన్ని రకాల టాపిక్స్ (ఉదాహరణకు: పాలిటిక్స్, నెగెటివ్ న్యూస్, లేదా నిర్దిష్ట సెలబ్రిటీల గాసిప్స్) మీకు అస్సలు నచ్చకపోతే, ఆ పదాలనే బ్లాక్ లిస్ట్‌లో పెట్టేయవచ్చు. మీ ప్రొఫైల్ -> Settings and Activity లోకి వెళ్ళండి. అక్కడ “Suggested Content” ఆప్షన్ ఎంచుకోండి. అందులో “Specific words and phrases” లోకి వెళ్లి, మీకు నచ్చని పదాలను లేదా ఎమోజీలను టైప్ చేసి యాడ్ చేయండి. ఆ పదాలతో ఉండే ఏ పోస్ట్ లేదా రీల్ కూడా ఇకపై మీ ఫీడ్‌లో కనిపించదు.

4.  కంటెంట్‌కు బ్రేక్:
హింస, అశ్లీలత లేదా గొడవలకు సంబంధించిన కంటెంట్ ఫీడ్‌లో రాకుండా కంట్రోల్ చేయవచ్చు.’Suggested Content’ సెక్షన్ లోనే ఉండే “Sensitive Content” ఆప్షన్ పై క్లిక్ చేయండి. అక్కడ ‘Standard’ స్థానంలో “Less” అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి. దీని వల్ల ప్రశాంతంగా ఇన్‌స్టా స్క్రీన్ స్క్రోల్ చేసుకోవచ్చు.

సో ఫ్రెండ్స్.. ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్ మీకు చూపించే కంటెంట్‌కు బానిస అవ్వకండి. వెంటనే మీ ఫోన్ తీసి పైన చెప్పిన స్మార్ట్ సెట్టింగ్స్‌ను ఆన్ చేసుకోండి. మీ ఫీడ్‌పై పూర్తి కంట్రోల్ సాధించి, మీకు నచ్చిన నాలెడ్జ్ లేదా ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే పొందుతూ హ్యాపీగా ఇన్‌స్టా వాడండి.

Related News

BSNL మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. జస్ట్ రూ. 39కే 20GB డేటా.. రూ.1కే ఉచిత సిమ్!

రూ.35వేలలోపు 50 ఇంచుల టీవీ..ఇంట్లోనే థియేటర్ ఫీల్

రాత్రి వేళ గణపయ్య ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? ఈ టిప్స్‌తో క్లారిటీ అదుర్స్!

రొటేటింగ్ బెజెల్‌తో క్రేజీ స్మార్ట్ వాచ్..GOBOULT Saber విశేషాలివే

రూ.1000లోపు దబిడి దిబిడే..పార్టీ మోత మోగించే బ్లూటూత్ స్పీకర్!

మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్ హెడ్ సెట్..మార్కెట్లో రచ్చ చేస్తున్న మోడల్

రూ.2,399కే క్రేజీ ఫీచర్లు..నథింగ్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్

కొత్త ఫోన్ కొంటున్నారా? 128GB లేదా 256GB ఏది బెటర్?

Big Stories

Advertisement
×