E-Paper
Advertisement

ఒకటి కాదు ఏకంగా నాలుగు డస్టర్లు వచ్చేస్తున్నాయ్.. రెనాల్ట్ ప్లాన్ మామూలుగా లేదుగా!

ఒకటి కాదు ఏకంగా నాలుగు డస్టర్లు వచ్చేస్తున్నాయ్.. రెనాల్ట్ ప్లాన్ మామూలుగా లేదుగా!
Advertisement

Renault Expands Duster Line-Up: భారత మార్కెట్లో డస్టర్ లైనప్ ను మరింత బలోపేతం చేసేందుకు రెనాల్ట్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే న్యూ జనరేషన్ డస్టర్ కు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండగా, రాబోయే నెలల్లో ఈ మోడల్ ఆధారంగా నాలుగు కొత్త వేరియంట్లను తీసుకురావాలని రెనాల్ట్ భావిస్తోంది. ఇందులో కొత్త ఆటోమేటిక్ వేరియంట్, హైబ్రిడ్ మోడల్, 7-సీటర్ వెర్షన్, అలాగే మినీ డస్టర్ SUV ఉన్నాయి.

కొత్త ఆటోమేటిక్ వేరియంట్

ప్రస్తుతం డస్టర్‌ లోని ఎక్కువ టర్బో పెట్రోల్ వేరియంట్లు ఆటోమేటిక్ గేర్‌ బాక్స్‌ తో అందుబాటులో ఉన్నాయి. అయితే, త్వరలోనే మరింత సరసమైన ధరలో కొత్త ఎంట్రీ లెవల్ ఆటోమేటిక్ వేరియంట్‌ ను మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ఆటోమేటిక్ SUV కొనాలనుకునే వారికి డస్టర్ మరింత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. చిన్న ఇంజన్ వేరియంట్లకు కూడా కొత్త ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్ ఎంపికలను అందించే అవకాశముందని ఆటో ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

దీపావళికి డస్టర్ హైబ్రిడ్

Advertisement

హైబ్రిడ్ వెహికల్స్ డిమాండ్‌ ను దృష్టిలో ఉంచుకుని రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్‌ ను ఈ ఏడాది దీపావళి సీజన్‌ లో విడుదల చేయాలని భావిస్తోంది. ఇందులో పెట్రోల్ ఇంజన్‌ తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, బ్యాటరీ ప్యాక్‌ ను ఉపయోగించనున్నారు. ఈ హైబ్రిడ్ సిస్టమ్ హై పర్ఫార్మెన్స్ తో పాటు మెరుగైన మైలేజ్‌ ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. పెట్రోల్, ఎలక్ట్రిక్ పవర్ ను కలిపి ఉపయోగించడం వల్ల ఫ్యూయల్ వ్యయం తగ్గే అవకాశం ఉంటుంది.

2027లో 7 సీటర్ డస్టర్

భారతీయ కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని డస్టర్ 7 సీటర్ వెర్షన్‌ ను కూడా రెనాల్ట్ డెవలప్ చేస్తోంది. ఈ SUV 2027లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.  ప్రస్తుతం ఉన్న 5 సీటర్ డస్టర్‌ తో పోలిస్తే, మరింత పొడవుగా, విశాలంగా ఉంటుంది. అదనపు సీట్ల కోసం వెనుక భాగాన్ని పెద్దదిగా రూపొందించనున్నారు. ఇంజన్, హైబ్రిడ్ టెక్నాలజీ, ఫీచర్లలో మాత్రం సాధారణ డస్టర్‌ తో చాలా అంశాలు పంచుకోనుంది. ఈ మోడల్  టాటా సఫారీ, మహీంద్రా XUV 7XO, MG హెక్టర్ ప్లస్ లాంటి SUVలకు పోటీగా నిలవనుంది.

మినీ డస్టర్ వచ్చేస్తోంది!

Advertisement

రెనాల్ట్ మరో కీలక ప్రాజెక్ట్‌ గా 4 మీటర్ల లోపు కొత్త కాంపాక్ట్ SUVను అభివృద్ధి చేస్తోంది. దీనిని ప్రస్తుతం ‘మినీ డస్టర్’గా పిలుస్తున్నారు. ఈ కొత్త మోడల్ దృఢమైన SUV స్టైలింగ్‌ తో పాటు ఆధునిక ఫీచర్లను కలిగి ఉండనుంది. పెట్రోల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ పవర్‌ ట్రెయిన్ ఎంపికలతో దీన్ని అందించే అవకాశం ఉంది. దీనికోసం కంపెనీ కొత్త టర్బో పెట్రోల్ ఇంజన్‌ ను కూడా అభివృద్ధి తెలుస్తోంది. ఉత్పత్తి దశకు చేరుకున్న తర్వాత ఈ మోడల్‌ను 2027 చివరి నాటికి భారత మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మొత్తంగా, డస్టర్ బ్రాండ్‌ ను మరింత బలోపేతం చేయడానికి రెనాల్ట్ రాబోయే రెండేళ్లలో పలు కొత్త మోడళ్లను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. హైబ్రిడ్, 7-సీటర్, మినీ SUVలతో ఇండియన్ SUV మార్కెట్లో మరింత సత్తా చాటాలని భావిస్తోంది.

Read Also: హైబ్రిడ్ కార్లపై మారుతి సూపర్ ఆఫర్లు.. ఏకంగా రూ. 2.15 లక్షల తగ్గింపు!

Related News

బైక్‌పై వెళ్తూ పాటలు వింటున్నారా? అయితే మీ డ్రైవింగ్ లైసెన్స్ గోవిందా!

హ్యుందాయ్‌కు బిగ్ షాక్.. ఏప్రిల్-జూన్‌లో కుప్పకూలిన లాభాలు.. ఎగుమతులు సైతం డౌన్!

కారు పార్కింగ్ తిప్పలకు చెక్.. రూ.2,000 లోపే టాప్-5 రివర్స్ కెమెరాలు!

కొత్త ఈ-స్కూటర్ కావాలా? మార్కెట్‌ను షేక్ ఆడించే మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

నీటిలోనూ దూసుకెళ్లే.. బెస్ట్ ‘హై గ్రౌండ్ క్లియరెన్స్’ కార్లు.. వర్షాకాలం అస్సలు తగ్గేదేలే!

ఇంధన ధరలతో విసిగిపోయారా? మైలేజ్‌తో కేక పుట్టిస్తున్న.. ఈ CNG కార్లు మీకోసమే!

New Car Buying Tips: కారు కొనాలనుకుంటున్నారా? ముందుగా ఈ 5 విషయాలు చెక్ చేయండి!

ఫెస్టివల్ సీజన్‌ లో మారుతి మాస్టర్ ప్లాన్.. బాలెనో, ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్‌లు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×