E-Paper
Advertisement

PM KUSUM Scheme: 25 ఏళ్ల పాటు రైతులకు ఆదాయం.. కేంద్ర ప్రభుత్వ సూపర్ స్కీమ్ వివరాలివే

PM KUSUM Scheme: 25 ఏళ్ల పాటు రైతులకు ఆదాయం..  కేంద్ర ప్రభుత్వ సూపర్ స్కీమ్ వివరాలివే
Advertisement

PM KUSUM Scheme: రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. వీటిల్లో ప్రధాన మంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ పథకం ఒకటి. దీని కింద 60 శాతం సబ్సిడీతో రైతులు సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చు. 25 ఏళ్ల పాటు ఆదాయం పొందవచ్చు. రైతులు తమ బంజరు భూములు లేదా సాగుకు పనికిరాని భూముల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చు.

పీఎం కుసుమ్ పథకం కింద సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ గా 60 శాతం సబ్సిడీని అందిస్తాయి. మిగిలిన మొత్తంలో 30 శాతం బ్యాంకుల నుంచి రుణంగా పొందవచ్చు. రైతుల 10 శాతం పెట్టుబడి పెడితే సరిపోతుంది. ఒక మెగావాట్ కెపాసిటీ సోలార్ ప్లాంట్ నుంచి రోజుకు 4,500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్ ను డిస్కమ్ లు కొనుగోలు చేస్తాయి. ఒక యూనిట్‌కు రూ. 3.13 చొప్పున ప్రభుత్వం రైతుకు చెల్లిస్తుంది. అంటే రోజుకు రూ.14 వేల వరకు ఆదాయం పొందవచ్చు. ఇలా 25 ఏళ్ల పాటు విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది.

పీఎం కుసుమ్ స్కీమ్ అర్హులు ఎవరంటే?

  • రైతు లేదా రైతుల గ్రూప్ లేదా రైతు సంఘాలు
  • సహకార సంఘాలు
  • నీటి వినియోగదారుల సంఘాలు
  • గ్రామ పంచాయతీ

ఎలా అప్లై చేసుకోవాలి?

Advertisement

పీఎం కుసుమ్ స్కీమ్ కోసం ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

Step1: పీఎం కుసుమ్ అధికారిక పోర్టల్‌కి వెళ్లి రిజిస్ట్రేషన్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

Advertisement

Step2: స్క్రీన్‌పై కనిపించే రిజిస్ట్రేషన్ ఫామ్‌ లో అవసరమైన అన్ని వివరాలను నింపండి.

Step3: డిక్లరేషన్ బాక్స్‌ను టిక్ చేసి, “సబ్మిట్”పై క్లిక్ చేయండి.

Step4: రిజిస్ట్రేషన్ తర్వాత సోలార్ అగ్రికల్చరల్ పంప్‌సెట్ సబ్సిడీ స్కీమ్ కోసం “లాగిన్”పై క్లిక్ చేయండి.

Step5: ఆన్‌లైన్ అప్లికేషన్ లో సమాచారంతో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి.

Also Read: ఇదెక్కడి ఘోరం.. లక్షకు 74 లక్షల వడ్డీ, అప్పు తీర్చేందుకు కిడ్నీ అమ్మిన అన్నదాత

అవసరమయ్యే పత్రాలివే

  • ఆధార్ కార్డ్
  • ల్యాండ్ డాక్యుమెంట్
  • బ్యాంక్ పాస్‌బుక్
  • డిక్లరేషన్ ఫామ్
  • మొబైల్ నంబర్
  • పాస్‌పోర్ట్ సైజు ఫొటో

Related News

మెట్లపై నుంచి జారిపడి చనిపోయిన గ్లోబల్ టెర్రరిస్ట్

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

Big Stories

Advertisement
×