Vijay Sethupathi : ఒకప్పుడు స్టార్ డైరెక్టర్లు ప్రస్తావన వస్తే ఖచ్చితంగా వినిపించే పేరు పూరి జగన్నాథ్. రీసెంట్ టైమ్స్ లో పూరి హిట్ సినిమా చేసి చాలా రోజులైంది. కానీ ఒకప్పుడు పూరి సినిమా అంటేనే నెక్స్ట్ లెవెల్ లో ఉండేది. హీరోకి పూరి రాసిన క్యారెక్టర్రైజేషన్ కు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ విషయాన్ని రాజమౌళి వంటి దర్శకులు కూడా స్టేజ్ పైన చెప్పారు.
ఇక ప్రస్తుతం పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి హీరోగా సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ సేతుపతి తో పాటు భారీ స్టార్ కాస్ట్ ఉంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనేది చాలామంది నమ్మకం. ఇక ఈ విషయం పైన ఎట్టకేలకు విజయ్ సేతుపతి కూడా స్పందించి మాట్లాడారు.
పూరి జగన్నాథ్ ఒక లెజెండ్
పూరి జగన్నాథ్ ఒక లెజెండ్. ఆయనతో పనిచేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆయనతో పనిచేయడం ప్రతిరోజు ఎంజాయ్ చేస్తున్నాను. ఆయన డైలాగులు రాసే విధానం, ఆయన డైలాగులు ఎగ్జిక్యూట్ చేసే విధానం, అలానే అతని టైమింగ్ నాకు విపరీతమైన ఇష్టం. సినిమా కూడా చాలా బాగా వస్తుంది. అంటూ విజయ్ సేతుపతి మాట్లాడారు. విజయ్ సేతుపతి మాటలు వింటుంటే ఖచ్చితంగా ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద కం బ్యాక్ ఇస్తాడేమో అనిపిస్తుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఇప్పటివరకు పూరి జగన్నాథ్ కెరీర్ లో హిట్ సినిమా పడలేదు. బహుశా హిట్ సినిమా లోటును ఈ సినిమా తీరుస్తుందేమో చూడాలి.
వర్కింగ్ టైటిల్ అదే
ఈ సినిమాకి సంబంధించి భవతి భిక్షాందేహి అనే వర్కింగ్ టైటిల్ అనుకుంటున్నారు. దీని గురించి అధికారక ప్రకటన ఇంకా రాలేదు. ఇక పూరి ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సక్సెస్ అయితే పూరి మళ్లీ స్టార్ హీరోతో సినిమా చేయడం ఖాయం. ఇక పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్స్ లో జనగణమన సినిమా కూడా ఒకటే. ఈ సినిమా అప్పట్లో మహేష్ బాబుతో అనౌన్స్ చేశారు. కొన్ని రోజుల తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా కంప్లీట్ చేద్దామని ఒక షెడ్యూల్ కూడా చేశారు. కానీ ఈ సినిమా ఇప్పట్లో మళ్లీ మొదలు అవుతుందా అంటే, అది విజయ్ సేతుపతితో చేస్తున్న సినిమా ఫలితం మీద ఆధారపడి ఉంటుంది.
Also Read: Nandamuri Balakrishna : నా పేరు మీద మోసం జరుగుతుంది జాగ్రత్త, ప్రజలను హెచ్చరిస్తున్న బాలయ్య