BigTV English
Advertisement

Mayday Call: టేకాఫ్ అయిన కాసేపటికే మేడే కాల్.. 2:30 గంటలు గాల్లోనే విమానం.. ప్రయాణికులంతా ఒక్కసారిగా?

Mayday Call: టేకాఫ్ అయిన కాసేపటికే మేడే కాల్.. 2:30 గంటలు గాల్లోనే విమానం.. ప్రయాణికులంతా ఒక్కసారిగా?

Mayday Call: ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇది ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది భారత్, అమెరికా, బంగ్లాదేశ్, దక్షిణ కొరియాలో ఎక్కడో ఓ చోట విమాన ప్రమాదం జరిగి ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. భారత్ లో ఆహ్మదాబాద్ విమానం కూలి 250 మందికి పైగా మృతిచెందారు. బంగ్లాదేశ్‌లో సైనిక విమానం కూలి 19 మంది మరణించారు.. ప్రపంచ వ్యాప్తంగా తరుచుగా విమాన ప్రమాదాలు జరుగుతుండడంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా మనదేశంలో ప్రయాణికులు విమాన సంస్థలు, నియంత్రణ సంస్థలపై నమ్మకం కోల్పోతున్నారు. భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న విమానయాన రంగంలో భద్రతా ప్రమాణాలు, నిర్వహణపై ప్రశ్నలు వర్షం కురుస్తున్నాయి. ఈ ప్రమాదాలు ప్రయాణికుల్లో భయాందోళనలను పెంచడమే కాక, విమాన పరిశ్రమలో కఠిన భద్రతా చర్యల అవసరాన్ని తెలియజేస్తున్నాయి. అయితే.. తాజాగా వాషింగ్టన్ లో పెను ప్రమాదం తప్పింది.


వాషింగ్టన్‌లోని డల్లెస్ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం ఇంజన్ వైఫల్యం కారణంగా ‘మేడే’ పిలుపు ప్రకటించింది. జర్మనీలోని మ్యూనిచ్‌కు బయలుదేరిన ఈ విమానం, ఫ్లైట్ UA108,  టేకాఫ్ అయిన తర్వాత ఇంజన్ లో సమస్య తలెత్తింది. 5,000 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు పైలట్‌లు అత్యవసర పరిస్థితిని ప్రకటించి.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్‌తో సన్నిహితంగా సమన్వయం చేసుకుని సురక్షిత ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నం చేశారు. దాదాపు 2:30 గంటలు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది.

పైలట్‌లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడానికి 6,000 అడుగుల ఎత్తులో హోల్డింగ్ ప్యాటర్న్‌లో తిప్పారు. ఈ సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ఇతర విమానాలతో ప్రమాదం తలెత్తకుండా కీలక సూచనలు చేశారు. విమానం బరువు తగ్గించడానికి ఇంధనం పూర్తీగా అయిపోయేలా ఏటీసీ నుంచి పైలట్లు అనుమతి కోరారు. పైలట్‌లు ఇంధన డంపింగ్ పూర్తయిన తర్వాత.. రన్‌వే 19 సెంటర్‌లో ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ (ఐఎల్ఎస్) ద్వారా ల్యాండ్ చేయడానికి అనుమతి తీసుకున్నారు. ఇంజిన్ వైఫల్యం కారణంగా విమానం ముందుకు కదలలేకపోయింది. కాబట్టి ల్యాండింగ్ తర్వాత దానిని రన్‌వే నుంచి పక్కకు మార్చాల్సి వచ్చింది.


ALSO READ: AIIMS Jobs: ఎయిమ్స్‌లో 3501 ఉద్యోగాలు.. పదో తరగతి పాసైతే మీదే ఉద్యోగం, కాకపోతే 2 రోజులే..?

ప్రస్తుతం ఈ విమానం వాషింగ్టన్ డల్లెస్ విమానాశ్రయంలో ఉంది. ఈ  సంఘటన సమయంలో ఎటువంటి గాయాలు కాలేదు. అందరూ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన ఇటీవల అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌కు జరిగిన సంఘటనను పోలి ఉంది, ఇది కూడా టేకాఫ్ తర్వాత తీవ్రమైన ఇంజన్ సమస్యను ఎదుర్కొంది. ఈ సంఘటనలో పైలట్‌లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ సమన్వయం, వేగవంతమైన చర్యలు విమానంలోని ప్రయాణికుల సురక్షితంగా బయటపడ్డారు.

ALSO READ: HYDRA: హైడ్రాకు థాంక్స్ చెప్పిన పిల్లలు.. కబ్జాగాళ్లకు భలే బుద్ధి చెప్పారు!

Related News

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Big Stories

×