ప్రయాణీకులను ఆకట్టుకునేందుకు పలు విమానయాన సంస్థలు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అలాగే వియత్ జెట్ సైతం అదిరిపో ఆఫర్ అనౌన్స్ చేసింది. ఆహ్లాదకరమైన వీకెండ్ కోసం ఈ వియత్నాం విమానయాన సంస్థ, సరసమైన ధరల్లో టికెట్లు పొందే అవకాశం కల్పిస్తోంది. ఇండియా నుంచి వియత్నాంకు కనీవినీ ఎరుగని తక్కువ ధరలో ప్రయాణ అనుభవాన్ని అందించబోతోంది. వియత్ జెట్ ఎయిర్ ప్రత్యేక ప్రమోషనల్ ఆఫర్ ప్రయాణీకులు ఎకో క్లాస్ టికెట్లను జస్ట్ రూ. 11కు (పన్నులు మరియు రుసుములు మినహాయించి)బుక్ చేసుకోవచ్చని ప్రకటించింది. ముంబై, ఢిల్లీ, కొచ్చి, అహ్మదాబాద్ లాంటి ప్రధాన భారతీయ నగరాలతో సహా హో చి మిన్ సిటీ, హనోయ్, డా నాంగ్ వంటి వియత్నామీస్ గమ్యస్థానాలకు అనుసంధానించే అన్ని మార్గాలకు ఈ సేల్ వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది.
ఎలా? ఎప్పుడు బుక్ చేసుకోవాలి?
రూ. 11 విమాన టికెట్లు ప్రతి శుక్రవారం బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 31, 2025 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ ఆఫర్ కింద సీట్లు పరిమితంగా ఉంటాయి. త్వరగా అమ్ముడుపోవచ్చు. ప్రయాణీకులు Vietjet Air అధికారిక వెబ్‌సైట్, http://www.vietjetair.com లేదంటే మొబైల్ యాప్ ద్వారా తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
ఆఫర్ ఎప్పటి వరకు చెల్లుతుంది?
ప్రయాణీకులు ఈ ఆఫర్ కింద ఇప్పటి నుంచి డిసెంబర్ 31, 2025 వరకు ప్రయాణించవచ్చు. అయితే, మార్కెట్ డిమాండ్ ప్రకారం, పబ్లిక్ హాలీడేస్, పీక్ సీజన్ లతో సహా బ్లాక్ అవుట్ డేట్లు వర్తిస్తాయి. ప్రత్యేక రుసుముతో ప్రయాణ ప్రణాళిక మార్పులు అనుమతించబడతాయని ఎయిర్ లైన్స్ తన అధికారిక ప్రకటనలో తెలిపింది.
Read Also: వందే భారత్ లో విండో సీట్ కోసం ఇన్ని నాటకాలా? మీకు ఇలా జరిగిందా?
షరతులు వర్తిస్తాయి!
⦿ ఈ సేల్ ప్రతి శుక్రవారం డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది.
⦿ ప్రయాణ ప్రణాళికలో ఏదైనా మార్పు చేసుకుంటే అదనపు ఛార్జీలను చెల్లించాలి. సో, మీ మొదటి ప్రయాణ ప్రణాళికను జాగ్రత్తగా సమర్పించండి.
⦿ మీరు టికెట్ రద్దు చేసుకుంటే, భవిష్యత్తులో బుకింగ్‌ల కోసం రీఫండ్ ట్రావెల్ వాలెట్ కు జమ చేయబడుతుంది. అసలు చెల్లింపు ఖాతాకు జమ చేయబడదు.
⦿ డిసెంబర్ వరకు సమయం ఉన్నప్పటికీ, టిక్కెట్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్నందున ముందుగానే టికెట్లను బుక్ చేసుకోవడం మంచిది.
ఈ నెలలో హైదరాబాద్, బెంగళూరు నుంచి హో చి మిన్ నగరానికి రెండు ప్రత్యక్ష సేవలను ప్రారంభించాలని వియట్ జెట్ ఆలోచిస్తోంది. ఈ చేర్పులతో, ఎయిర్ లైన్ 10 భారతీయ మార్గాల్లో వారానికి 78 విమానాలను అందుబాటులోకి తీసుకురానుంది. ‘వియట్ జెట్’ గత 13 గంటల్లో గూగుల్ ట్రెండ్స్ లో 10 వేల కంటే ఎక్కువ సెర్చ్ వాల్యూమ్ ను కలిగి ఉంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా రూ. 11తో వియత్నాంలో టూర్ ఎంజాయ్ చేసేయండి.
Read Also: షాకింగ్ న్యూస్.. జులై 1 నుంచి పెరగనున్న రైల్వే టికెట్ ధరలు!