TVK Maanadu: 2014లో జనసేన అనే పార్టీని స్థాపించి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు ఇచ్చిన మొదటి స్పీచ్ చాలా మందిని విపరీతంగా ఆకట్టుకుంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన కూడా పవన్ కళ్యాణ్ స్పీచ్ మాత్రం చాలా బ్యాలెన్స్ గా అప్పట్లో అనిపించింది.
అయితే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన వెంటనే పోటీ చేయలేదు. ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టానని చెబుతూ 2019లో పోటీలోకి దిగాడు. దురదృష్టవశాత్తు పవన్ కళ్యాణ్ నిలుచున్న రెండు ప్రాంతాలలో కూడా ఓడిపోయారు. ఆయన పార్టీ కేవలం ఒక సీటు మాత్రమే గెలవ గలిగింది. అయితే పవన్ కళ్యాణ్ ఏ రోజు కూడా తగ్గకుండా తన దూకుడును ప్రదర్శిస్తూనే వచ్చారు. మొత్తానికి 2024లో 21 సీట్లలో పోటీ చేస్తే 21 గెలిచారు. కానీ పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంతో కలవడం చాలా మందికి నచ్చలేదు.
అడవికి రాజు ఒక్కడే
ఒకవైపు తెలుగు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ మాదిరిగానే, తమిళ రాజకీయాల్లో విజయ్ కూడా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. విజయ్ తన పార్టీకి సంబంధించిన మీటింగ్ పెడితే భారీ స్థాయిలో జనాలు హాజరవుతున్నారు. ముఖ్యంగా విజయ్ మీటింగ్స్ కి వచ్చిన జనాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఈరోజు కూడా మధురై లో మహానాడు సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో విజయ్ మాట్లాడుతూ.. సింగిల్ గానే పోటీ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. అడవిలో రాజు ఒకడు మాత్రమే. అది సింగిల్ గా ఉన్నా కూడా జంగిల్ లో మాత్రం అదే కింగ్. ఇది నేను ఇస్తున్న డిస్క్రిప్షన్ కాదు. ఇది నా క్లియర్ డిక్లరేషన్ అంటే చెప్పారు. అయితే విజయ్ ఈ మాట చెప్పడం వెనక ఇన్ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ కు సెటైర్ వేశారా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి.
హిస్టరీ క్రియేట్ చేస్తాడా.?
తమిళ రాజకీయాల్లో విజయ్ స్పీచ్ ఇప్పుడు సంచలనంగా మారింది. విజయ్ సభలకు వస్తున్న జనం, అలానే విజయ్ మాట్లాడే మాటలు. ఇవన్నీ చూస్తుంటే కచ్చితంగా తమిళ రాజకీయాల్లో తనదైన ముద్రను విజయ వేస్తాడు అని అనిపిస్తుంది. ఇవన్నీ దాటుకొని విజయ్ తమిళనాడు రాష్ట్రానికి సీఎం అయిపోతే అది నెక్స్ట్ లెవెల్ అచీవ్మెంట్ అని చెప్పాలి. విజయ్ ఒక హిస్టరీ క్రియేట్ చేసినట్లే. సినిమాల్లో తన ప్రతిభను చూపించిన విజయ్ రాజకీయాల్లో తన వ్యూహాన్ని ఏ రేంజ్ లో అమలుపరుస్తాడు చూడాలి. రాజకీయాల్లో నిలబడాలి అంటే వ్యూహాలు రచించడం తెలియాలి.
Also Read: Telugu Film Industry: స్ట్రైక్ ఎండ్ అయితే సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ గా ఉన్న సినిమాలివే