BigTV English

Viral video: భూమ్మీద నీకింకా నూకలున్నయ్ బ్రో.. అందుకే రెప్పపాటు సమయంలో చచ్చిబతికావ్

Viral video: భూమ్మీద నీకింకా నూకలున్నయ్ బ్రో.. అందుకే రెప్పపాటు సమయంలో చచ్చిబతికావ్

Viral video: కేరళ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని కన్నూర్ లో జరిగిన షాకింగ్ రోడ్డు ప్రమాదం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రెండు కార్ల మధ్య స్కూటీ చిక్కుకుని.. బైకర్ క్షణాల్లో ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రాణాలు పోయి మళ్లీ వచ్చినంత పని అయ్యింది. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే అది తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటనక సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


కన్నూర్ లోని ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీ పై ఓ వ్యక్తి నెమ్మదిగా వెళ్తున్నాడు. అతనికి ముందు ఓ కారు.. వెనుకాలా మరో కారు రోడ్డుపై ప్రయాణిస్తున్నాయి. రోడ్డు బాగో లేకపోవడంతో ముందున్న కారు నెమ్మదిగా వెళ్తుంది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న మరో కారు మొదట్టో నెమ్మదిగా వెళ్లినట్టు అనిపించింది. ఉన్నట్టుండి ఒక్కసారి అతివేగంతో వచ్చి స్కూటీని ఢీకొట్టింది. దీంతో స్కూటీ రెండు కార్ల మధ్య నలిగిపోయింది. అయితే స్కూటీ పై ఉన్న వ్యక్తి అదృష్టావశాత్తూ ఎగిరి రోడ్డ పక్కకు పడ్డాడు. దీంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ సంఘటన మొత్తం స్థానిక సీసీటీవీ కెమెరా రికార్డ్ అయ్యింది.

వీడియోలో స్కూటీ వెనుకాలా ఓ కారు మొదట్లో నెమ్మదిగా వచ్చి.. ఆ తర్వాత అతివేగంతో స్కూటీని ఢీకొట్టినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రమాదం వల్ల స్కూటీ ధ్వంసం అయిపోయింది. రోడ్డుపై ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ పోస్ట్ చేయగా లక్షల మంది నెటిజన్లు ఈ వీడియోను వీక్షించారు. వేల మంది కామెంట్లు, లైకులు చేస్తున్నారు.

ALSO READ: Annamaya District: అన్నమయ్య జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు మృతి, ఒకరు గల్లంతు

ఈ వీడియోపై ఓ నెటిజన్ విధంగా కామెంట్ చేశాడు. ‘ఈ భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయి. అందుకే సెకన్ గ్యాప్ బతికేశావ్’ అని కామెంట్ చేశారు. మరో నెటిజన్ ‘అంత పెద్ద రోడ్డు ప్రమాదంలో కూడా నువ్వు ప్రాణాలతో బయటపడ్డావ్.. నువ్వు 100 ఏళ్లు బతికి తీరుతావ్ బ్రో’ అని కామెంట్ చేసుకొచ్చాడు. ‘కళ్లు మూసి తెరిచే క్షణాల్లో ఏం జరిగిందో అని బ్రో ఆలోచనలో పడిపోయాడు’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

ALSO READ: Jonnagiri: అదృష్టమంటే ఈమెది.. రూ.300 కూలికి పోతే.. రూ.40లక్షల వజ్రం దొరికింది..!

ఈ ఘటన భారతదేశంలో రోడ్డు ప్రమాదాల సంఘటన గురించి గుర్తు చేసింది. రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తోంది. రోడ్డు భద్రతా చట్టాలను ఖచ్చితంగా పాటించడం, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్‌ను నివారించడం చాలా ముఖ్యం. భారతదేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గత కొన్ని సంవత్సరాలుగా విపరీతంగా పెరిగింది. వీటిలో ఎక్కువ శాతం టూ-వీలర్‌లతో సంబంధం కలిగి ఉన్నాయి. ఈ షాకింగ్ ఘటన రోడ్డు భద్రత పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని మనకు గుర్తు చేస్తుంది. స్కూటీపై ఉన్న వ్యక్తి అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుండి తప్పించుకున్నప్పటికీ, ఈ సంఘటన రోడ్డు ప్రమాదాల తీవ్రతనువాటిని నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను స్పష్టం చేస్తుంది.

Related News

Viral Couple: ట్రక్‌లోనే ఇల్లు, జీవితం.. ఇలా ఉంటున్నారు ఈ దంపతులు.. సూపర్ కదా!

UP Man Arrested: నోరా ఫతేహిలా కనిపించాలంటూ భార్యను అలా చేసిన భర్త.. సీన్ కట్ చేస్తే..

Viral Video: 28వ అంతస్తులో ఆవు దూడ.. భలే పెంచుతున్నారే!

Viral Video: పోలీస్ స్టేషన్‌లో మహిళ అల్లరి, దాడి.. వీడియో చూసి పోలీసులు షాక్!

Golden Nurse Shark: గోల్డెన్ నర్స్ షార్క్.. ఫస్ట్ టైమ్ కనిపించింది బ్రో!

Big Stories

×