E-Paper
Advertisement

మహిళల అండాల అక్రమ దందా కేసులో.. కీలక నిందితుడు అరెస్ట్!

మహిళల అండాల అక్రమ దందా కేసులో.. కీలక నిందితుడు అరెస్ట్!
Advertisement

Egg Donation: సంచలనం సృష్టించిన అండాల అక్రమ దందా కేసులో పోలీసులు కీలక నిందితున్ని అరెస్ట్​ చేశారు. ఈ రాకెట్​ తో మరికొందరికి కూడా సంబంధం ఉన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో వారిని కూడా పట్టుకోవటానికి విచారణను ముమ్మరం చేశారు. మల్కాజిగిరి కమిషనరేట్​ ఎస్వోటీ అధికారులు ఇటీవల బేగంపేట పోలీసులతో కలిసి అండాల అక్రమ దందా చేస్తున్న పదిమందిని అరెస్ట్​ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో కీలక సూత్రధారి అయిన దుర్గాప్రసాద్ ను పట్టుకున్నారు.

గర్ల్స్ హాస్టల్ పేరుతో గదులు..

బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన యువతులను ఓ గ్యాంగ్​ హైదరాబాద్ రప్పిస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. ఆ తరువాత ప్రకాశ్ నగర్‌లోని నజ్రాన్ అపార్ట్‌మెంట్లో అమీ నీతా గర్ల్స్ హాస్టల్ పేరుతో గదులు తీసుకొని వసతి కల్పించి వారి నుంచి ఏడాదిగా అండాలు సేకరించి సంతాన సాఫల్య కేంద్రాలకు అమ్ముతున్నట్టు వెల్లడైంది. దీంట్లో దుర్గప్రసాద్ ప్రధానపాత్ర పోషించినట్టుగా అధికారులు నిర్ధారించుకుని అతన్ని అరెస్ట్​ చేశారు. హైదరాబాద్ లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి వేర్వేరు రాష్ట్రాలకు చెందిన యువతులను ఇక్కడికి పిలిపించుకున్నట్టుగా విచారణలో తేలింది.

ఫెర్టిలిటీ సెంటర్లలో తనిఖీలు..

Advertisement

దీంట్లో ఫెర్టిలిటీ సెంటర్​లు కీలకంగా పని చేసినట్టుగా వెల్లడైంది. ఈ క్రమంలో అధికారులు ఇప్పటికే కొన్ని ఫెర్టిలిటీ సెంటర్లలో తనిఖీలు జరిపారు. మరో ఇరవైకి పైగా సెంటర్లలో కూడా సోదాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ రాకెట్ లోని నిందితులు హార్మోన్​ ఇంజక్షన్లు ఇచ్చి మరీ ఒక్కో యువతి నుంచి పదేపదే అండాలను సేకరించి వాళ్ల ప్రాణాల మీదకు తెచ్చినట్టుగా అధికారులు చెబుతున్నారు.

Also read: రాప్తాడు ఎన్‌కౌంటర్ కేసు.. హైకోర్టులో కూటమి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం!

Tags

Related News

ఎమ్మెల్సీ ఎన్నికలపై కల్వకుంట్ల కవిత ధీమా.. కాలం కలిసోచ్చేనా..?

ఏసీబీకి రెడ్ హ్యండెడ్‌గా చిక్కిన​ మున్సిపల్​ కమిషనర్​!

దౌల్తాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారి ఇష్టారాజ్యం.. అల్లాడిపోతున్న పేద రోగులు!

ట్రైనీ DSPలకు సీఎం రేవంత్ రెడ్డి బంప‌ర్ ఆఫ‌ర్‌?

రాహుల్ పర్యటనను అడ్డుకుంటే.. ఢిల్లీ నుంచి వచ్చే బీజేపీ నేతలను అడ్డుకుంటాం: వీహెచ్ వార్నింగ్!

ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు టీపీసీసీ బిగ్ షాక్.. షోకాజ్ నోటీసులు జారీ?

ఓయూ లా కాలేజీ హాస్టల్‌పై వివాదం.. భవనం కూల్చివేతతో విద్యార్థుల ఆగ్రహం!

Big Stories

Advertisement
×