E-Paper
Advertisement

రాతియుగంలో మోటు-పత్లూ రోలర్ కోస్టర్ రైడ్… డైనోసార్లు, వింత మనుషులతో అల్టిమేట్ అడ్వెంచర్… 8 భాషల్లో స్ట్రీమింగ్

రాతియుగంలో మోటు-పత్లూ రోలర్ కోస్టర్ రైడ్… డైనోసార్లు, వింత మనుషులతో అల్టిమేట్ అడ్వెంచర్… 8 భాషల్లో స్ట్రీమింగ్
Advertisement

Motu Patlu & the Mystery of Nagmani OTT: ఇండియాలో చిన్నారులకు ఎంతో ఇష్టమైన యానిమేషన్‌ జోడీ మోటు-పత్లూ. ఫుర్ఫురి నగర్‌లో వీళ్లు చేసే అల్లరి, జాన్‌ దొంగతనాలు, మోటు సమోసాల కోసం పడే పాట్లు.. ఇవన్నీ పిల్లలతో పాటు పెద్దలకూ వినోదాన్ని పంచుతుంటాయి. ఇప్పుడు ఈ ఫేమస్‌ జోడీ మరో కొత్త సాహసంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే ‘Motu Patlu & the Mystery of Nagmani’ (2026). టైమ్‌ ట్రావెల్‌, కామెడీ, అడ్వెంచర్‌ అంశాలతో రూపొందిన ఈ యానిమేషన్‌ మూవీ నవంబర్‌ 8 నుంచి JioHotstarలో 8 భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది. కేవలం పిల్లలే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా కడుపుబ్బా నవ్వించే ఈ ఐకానిక్ జోడి ఈసారి ఎలాంటి ప్రమాదంలో చిక్కుకున్నారు? తిరిగి తమ కాలానికి ఎలా చేరుకున్నారు? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ సినిమా కథాంశం అంతా మన మోటు మరియు పత్లూ వేసే ఒక క్రేజీ టైమ్ మెషిన్ ప్లాన్ చుట్టూ తిరుగుతుంది. సైంటిస్ట్ డాక్టర్ ఝట్కా కనిపెట్టిన ఒక కొత్త గ్యాడ్జెట్ వల్ల మన మోటు-పత్లూ, వాళ్ళ గ్యాంగ్ మెంబర్స్ అయిన ఘసితారామ్ అండ్ చింగం సార్ తో కలిసి అనుహ్యంగా నాటి రాతియుగం  కాలంలోకి వెళ్ళిపోతారు. అక్కడ అడుగు పెట్టగానే వాళ్లకు లైఫ్ లోనే బిగ్గెస్ట్ రోలర్ కోస్టర్ రైడ్ ఎక్స్ పీరియన్స్ అవుతుంది. చుట్టూ తిరిగే భారీ డైనోసార్లు, క్రూరమైన వింత మనుషులు  మధ్య మన మోటు గ్యాంగ్ ఇరుక్కుపోతుంది.

Advertisement

ఇక్కడి నుండి రాతియుగంలో మోటు-పత్లూ అసలైన రచ్చ మొదలవుతుంది! అక్కడ తినడానికి సమోసాలు దొరక్కపోవడంతో మన మోటు నీరసపడిపోవడం, ఆ కేవ్‌మెన్ మాఫియా గ్యాంగ్ మోటుని దేవుడిలా పూజించడం లాంటి సీన్స్ చిన్న పిల్లల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. మరోవైపు తెలివైన పత్లూ తన ఐడియాస్ తో ఆ డైనోసార్ల దాడుల నుండి, వింత మనుషుల ట్రాప్ నుండి తప్పించుకుని తిరిగి తమ మోడరన్ వరల్డ్ కి రావడానికి వేసే స్కెచ్ లు చాలా అడ్వెంచరస్ గా డిజైన్ చేశారు. విజువల్ ఎఫెక్ట్స్ స్క్రీన్ పై చాలా గ్రాండ్‌గా అనిపిస్తాయి.

తెలుగులో స్ట్రీమింగ్

‘Motu Patlu & the Mystery of Nagmani’ 2026 నవంబర్‌ 8న JioHotstarలో విడుదలైంది. ఈ యానిమేషన్‌ మూవీ నిడివి సుమారు 66 నిమిషాలు. హిందీతో పాటు తెలుగు, బెంగాలీ, మలయాళం, మరాఠీ, కన్నడ భాషల్లోనూ అందుబాటులో ఉంది. వీకెండ్ లో మీ ఇంట్లో ఉన్న పిల్లలతో కలిసి ఎటువంటి టెన్షన్స్ లేకుండా హ్యాపీగా నవ్వుకుంటూ టైమ్ స్పెండ్ చేయడానికి జియోహాట్‌స్టార్ లో ఉన్న ఈ మోటు-పత్లూ సరికొత్త అడ్వెంచర్ మూవీ ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఛాయిస్.

Advertisement

Read Also: రాణి శరీరంలోకి మగ చెఫ్‌ ఆత్మ… రాజభవనంలో వంటలతో పాటు రాజకీయాలు కూడా… కొరియన్‌ ఫాంటసీ కామెడీ డ్రామా

Tags

Related News

కోటీశ్వరుడి కొడుకు హత్య… రంగంలోకి దిగే 242 ఐక్యూ ఉన్న లేడీ డిటెక్టివ్‌… క్రిమినల్స్ కు దబిడి దిబిడే

తప్పుల్ని సరిచేసుకోవడానికి ఏడాది వెనక్కి వెళ్లే అద్భుతమైన అవకాశం… కొరియన్‌ టైమ్‌ ట్రావెల్‌ మిస్టరీ థ్రిల్లర్‌ సిరీస్‌

కొడుకు వింతగా ప్రవర్తిస్తున్నాడని టీచర్‌పై అనుమానం… స్కూలుకెళ్ళి చూస్తే దిమ్మతిరిగే ట్విస్ట్ ఉన్న మిస్టరీ డ్రామా

రాణి శరీరంలోకి మగ చెఫ్‌ ఆత్మ… రాజభవనంలో వంటలతో పాటు రాజకీయాలు కూడా… కొరియన్‌ ఫాంటసీ కామెడీ డ్రామా

అణు యుద్ధం జరిగి 200 ఏళ్లు… ముఖం లేని హీరో మాస్ జాతర… ‘మీర్జాపూర్’ను మించిన డైలాగులు

లాయర్‌ స్థానంలో నిందితుడిగా నిలబడితే… తన కేసులో తానే నిందితుడు… క్రేజీ కోర్ట్‌రూమ్‌ థ్రిల్లర్‌

నిన్నటిదాకా స్టార్ హీరోయిన్… ఇప్పుడు ఉండటానికి ఇల్లు కూడా లేదు… ఎమోషనల్ కామెడీ డ్రామా

Big Stories

Advertisement
×