BigTV English

Vishwambhara: విశ్వంభర వాయిదా? 2026 సమ్మర్ రిలీజ్, స్పెషల్ డేట్ ఫిక్స్

Vishwambhara: విశ్వంభర వాయిదా? 2026 సమ్మర్ రిలీజ్, స్పెషల్ డేట్ ఫిక్స్

Vishwambhara: మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సినిమా విశ్వంభర. బింబిసారా సినిమాతో దర్శకుడుగా పరిచయమైన వశిష్ట ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పుడు చాలామందికి విపరీతమైన క్యూరియాసిటీ పెరిగింది. ఇది ఒక సోషియో ఫాంటసీ జోనర్ లో వచ్చే సినిమా అని అప్పట్లో చెప్పారు.


జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి సినిమాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఆ జోనర్ లో ఇప్పటివరకు సినిమా చేయలేదు. అందుకనే మెగా అభిమానులంతా కూడా ఆ జోనర్ లో మెగాస్టార్ సినిమా చేస్తే చూడాలి అని ఎదురు చూశారు. మొత్తానికి ఈ సినిమా పోయిన సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వలన వాయిదా వేశారు. మొత్తానికి ఈ సినిమా ఇప్పుడు మళ్లీ వాయిదా జరిగినట్లు తెలుస్తోంది.

విశ్వంభర రిలీజ్ డేట్ 


ఎప్పుడో విడుదలవుతుంది అనుకున్న ఈ సినిమా ఇప్పటివరకు ప్రేక్షకులు ముందుకు రాలేదు. రీసెంట్ గా కూడా ఈ సినిమా సెప్టెంబర్లో రిలీజ్ అవుతుంది అని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ సినిమాను సమ్మర్ కు పోస్ట్ పోన్ చేసినట్లు తెలుస్తుంది. మార్చి 30న రంగస్థలం సినిమా వచ్చి అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు అదే డేట్ కు ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. గ్లోబల్ స్టార్ డేట్ మెగాస్టార్ ఎంట్రీ అంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని చెప్పాలి.

విశ్వంభర స్టోరీ 

విశ్వంభర సినిమాకి సంబంధించిన కథను ఇదివరకే ఇంటర్వ్యూస్ లో వశిష్ట చెప్పేశాడు. హీరో 14 లోకాలను దాటి హీరోయిన్ ను ఎలా తీసుకొచ్చాడు అనేది ఈ సినిమా కాన్సెప్ట్. అలానే 14 లోకాలను కూడా అద్భుతంగా చూపించబోతున్నాం అంటూ చెప్పాడు. ఇంతే కాకుండా ఈ సినిమా గురించి మరిన్ని విషయాలను కూడా వేరే ఇంటర్వ్యూలో చెప్పేసాడు. అయితే దీనిని బట్టి వశిష్ట కి కథ మీద ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు.

టీజర్ ట్రోల్స్ 

ఈ సినిమా టీజర్ విడుదలైనప్పుడు, విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. అవన్నీ కూడా దర్శకుడు వశిష్ఠ దృష్టికి చేరాయి. అందుకే సినిమా మీద ఇప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు. సినిమాకి సంబంధించిన సీజీలు క్లారిటీగా వస్తే గాని రిలీజ్ చేయమని ముందే ఫిక్స్ అయ్యారు. అందుకనే సినిమా రిలీజ్ డేట్ ను సమ్మర్ కి వాయిదా వేశారు. ఈ రిలీజ్ డేట్ ని కొంతసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది. యు వి క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తుంది.

Also Read: Aamir Khan: సిగరెట్ వెలిగిస్తే తప్పేంటి? స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు.!

Related News

Upcoming Movies Theater : అక్టోబర్ లో రఫ్ఫాడించేందుకు రెడీ అవుతున్న సినిమాలు..

Actress Hema: ఆ క్షణం ఎవరినైనా చంపేయాలనిపించేది..ఎమోషనల్ అయిన హేమ!

Bahubali The Epic: బాహుబలి ది ఎపిక్.. బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన జక్కన్న?

OG 2: పవన్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్.. ఓజి 2లో అకీరా .. థియేటర్లు తగలబడి పోవాల్సిందే!

Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ ఇంట సంబరాలు.. మరోసారి తండ్రైన ఆర్భాజ్ ఖాన్‌!

Samantha: ఫైనల్లీ కొత్త ప్రాజెక్ట్ పై అప్డేట్ ఇచ్చిన సమంత.. త్వరలోనే షూటింగ్ అంటూ!

Vijay Devarakonda: నిశ్చితార్థం తరువాత ఫేవరెట్ ప్లేస్ కి విజయ్ దేవరకొండ.. ప్రత్యేకం ఏంటబ్బా!

Rukmini Vasanth: క్రష్ ట్యాగ్ పై రుక్మిణి షాకింగ్ రియాక్షన్.. తాత్కాలికం అంటూ!

Big Stories

×