Aamir Khan: రీసెంట్ టైమ్స్ లో వచ్చిన సినిమాలలో ఎన్నో అంచనాల మధ్య విడుదలైంది కూలీ. లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj)దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. అయితే ఈ సినిమాకి యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది అని అందరూ ఊహించరు. కానీ ఎవరు ఊహించని విధంగా మిక్స్డ్ టాక్ వచ్చింది.
రజనీకాంత్ తో పాటు ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర. మలయాళం హీరో సౌబిన్ సాహిర్. తెలుగు స్టార్ హీరో నాగార్జున. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన. ఇంతమందిని ఒక సినిమాలో డీల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కానీ లోకేష్ దర్శకుడు కాబట్టి అది చేయగలిగాడు. అయితే మిగతా హీరోల పాత్రల విషయంలో కొంత మేరకు అసంతృప్తి ఉంది.
సిగరెట్ వెలిగిస్తే తప్పేంటి
విక్రమ్ సినిమాలో చివరి ఐదు నిమిషాల్లో సూర్య వచ్చి రోలెక్స్ పాత్రలో సంచలనం సృష్టించాడు. సూర్య కనిపించింది క్లైమాక్స్ లో అయినా కానీ ఆ ఇంపాక్ట్ మాత్రం చాలా రోజులు పాటు వెంటాడింది. ఇకపోతే అదే స్థాయిలో అమీర్ ఖాన్ కూలీ సినిమాలో కనిపించబోతున్నాడు అని మొదట వార్తలు వినిపించాయి. కూలి సినిమాకు సంబంధించి అమీర్ ఖాన్ గెటప్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. అయితే సినిమాలో మాత్రం అమీర్ ఖాన్ వచ్చిన తర్వాత కామెడీ ఉంటుంది. దీనిపై చాలా విమర్శలు వచ్చాయి.
తనపై వచ్చిన విమర్శలకు అమీర్ ఖాన్ స్పందించారు. కూలి సినిమాలో నా పాత్ర సూపర్స్టార్ రజనీకాంత్ కి బీడీ బీడీ వెలిగించడం. నేను నిజాయితీగా చెబుతున్నాను అలా చేయడంలో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను రజినీకాంత్ కి డై హార్డ్ ఫ్యాన్. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నేను చాలా ప్రయిడ్ గా ఫీల్ అవుతున్నాను. నా జీవితానికి అదొక మెమొరీ.
నాగార్జున పాత్ర పై విమర్శలు
ఇకపోతే ఈ సినిమా రిలీజ్ కి ముందు నాగార్జునది ఒక పవర్ఫుల్ విలన్ రోల్ అంటూ చెప్పారు. అయితే నాగర్జునది అంత పవర్ఫుల్ విలన్ రోల్ అని సినిమా చూసినప్పుడు అనిపించలేదు. ఏడుసార్లు లోకేష్ కనకరాజ్ కథ చెప్పాడు అంటే, అది ఏ రేంజ్ లో ఉండబోతుందో అని అందరు విపరీతమైన అంచనాలు పెంచేసుకున్నారు. కట్ చేస్తే సినిమాలో నాగార్జున పాత్ర చాలామందిని విపరీతంగా డిసప్పాయింట్ చేసింది. దీనిపై లోకేష్ మీద ట్రోలింగ్ కూడా నడిచింది.
Also Read: Mega157 Teaser: బాస్ ను చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు, అనిల్ రావిపూడి అదరగొట్టాడు