Furqan Bhatti On Vaibhav Sooryavanshi Double Century: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో (ACC Men’s Asia Cup Rising Stars 2026 ) భాగంగా నిన్న యూఏఈ వర్సెస్ టీమ్ ఇండియా (India A vs United Arab Emirates, 11th Match) జూనియర్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi Double Century) ఇరగదీశాడు. 28 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించి డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. అయితే వైభవ్ సూర్యవంశీ డబుల్ సెంచరీపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఇక వైభవ్ సూర్యవంశీ డబుల్ సెంచరీపై పాకిస్తాన్ స్పోర్ట్స్ అనలిస్ట్ ఫుర్ఖాన్ భట్టి ( Furqan Bhatti ) సంచలన వ్యాఖ్యలు చేశారు. వైభవ్ సూర్యవంశీ దెబ్బకు పాకిస్తాన్ గజ గజ వణికి పోతుందని బాంబు పేల్చాడు. వైభవ్ సూర్యవంశీని చూస్తేనే వణికిపోతున్నారని.. అత్యంత భయంకరమైన ఇన్నింగ్స్ నిన్న అతడు ఆడాడని ప్రశంసించాడు. ఇలాంటి ఇన్నింగ్స్ లు భవిష్యత్తులో కూడా ఎవరు చూడబోరని తెలిపాడు. మంచినీళ్లు తాగినంత సులభంగా 28 సిక్సర్లు కొట్టాడంటే వైభవ్ మామూలు మనిషి కాదని హాట్ కామెంట్స్ చేశాడు. ఇలాంటి వాడు పాకిస్తాన్ జట్టులో ఉంటే.. ఎన్నో రికార్డులు బద్దలు కొట్టే వాళ్ళమని తెలిపారు.
యూఏఈ జట్టుపై వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడని పాకిస్తాన్ స్పోర్ట్స్ అనలిస్ట్ ఫుర్ఖాన్ భట్టి పేర్కొన్నాడు. నిత్యం టీమ్ ఇండియాను విమర్శించే ఫుర్ఖాన్ భట్టి… తొలిసారిగా వైభవ్ సూర్యవంశీని మెచ్చుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. డబుల్ సెంచరీ సాధించిన వైభవ్ సూర్యవంశీకి అందరూ నిలబడి చప్పట్లు కొట్టాలని తెలిపాడు. ఇన్ని రోజులు అతడు గుడ్డిగా బ్యాట్ ఊపుతున్నాడని అందరూ అనుకున్నారు… అలా ఆడితే 50 పరుగులు లేదా సెంచరీ మాత్రమే చేయగలుగుతారని వెల్లడించాడు. కానీ డబుల్ సెంచరీ చేయడం అసాధ్యమని స్పష్టం చేశాడు.
వైభవ్ స్లాగర్ కాదని, ఫ్యూచర్ స్టార్ అన్నాడు. 25 నుంచి 30 బంతులు వైభవ్ సూర్యవంశీ ఎదుర్కొంటే.. సెంచరీ కచ్చితంగా సాధిస్తాడని హెచ్చరించాడు. ఆ లోపే అతన్ని ఔట్ చేస్తే ప్రత్యర్థి జట్టుకు మేలు జరుగుతుందని.. లేకపోతే వైభవ్ సూర్యవంశీ సునామీ సృష్టిస్తాడని హెచ్చరించాడు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైనల్ ఎలాగూ జరుగుతుందని… ఆ సందర్భంగా పాక్ బౌలర్లు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశాడు. వైభవ్ సూర్యవంశీని రెండు లేదా మూడు ఓవర్లలోపే ఔట్ చేయాలని తెలిపాడు. అలా కాదని లైట్ తీసుకుంటే పాకిస్తాన్ పై కూడా భారీ సెంచరీ సాధిస్తాడని ఫుర్ఖాన్ భట్టి వార్నింగ్ ఇచ్చాడు.