BigTV English

War 2 Movie: వార్ 2 షూటింగ్ పూర్తి… హృతిక్ రోషన్ పై తారక్ సెన్సేషనల్ ట్వీట్!

War 2 Movie: వార్ 2 షూటింగ్ పూర్తి… హృతిక్ రోషన్ పై తారక్ సెన్సేషనల్ ట్వీట్!

War 2 Movie :యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో ఎంతో బిజీగా ఉంటూనే మరోవైపు బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అనుకుంటున్నారు. RRR తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో మార్మోగిపోతుంది. ఇటీవల దేవర(Devara)తో పాన్ ఇండియా హిట్ అందుకున్న ఎన్టీఆర్ త్వరలోనే వార్ 2(WAR 2) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 14వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ(Ayaan Mukerji) దర్శకత్వంలో హృతిక్ రోషన్(Hrithik Roshan), ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా పట్ల తెలుగులో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.


ఎన్నో విషయాలు నేర్చుకున్నా…

ఇకపోతే తాజాగా ఎన్టీఆర్ ఈ సినిమాకు సంబంధించి బిగ్ అప్డేట్ ఇస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ఈ సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నట్లు ఎన్టీఆర్ తెలియ చేశారు. ఇలా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెట్ నుంచి వెనక్కి తిరిగి రావడం చాలా బాధాకరంగా ఉందని తెలిపారు. హృతిక్ సర్ గారితో పని చేయడం ఎంతో గొప్ప అనుభవమని తారక్ తెలిపారు. ‘వార్‌2’ చిత్రం కోసం చేసిన జర్నీలో ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఇక డైరెక్టర్‌ అయాన్‌ గురించి చెప్పాలంటే అతనో అద్భుతం. ఈ సినిమాలో ప్రేక్షకుల కోసం పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేశారు అంటూ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ గురించి తెలిపారు.


గొప్ప అనుభూతిని కలిగిస్తుంది…

పాన్ ఇండియా భారీ బడ్జెట్ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. యష్‌రాజ్‌ ఫిలింస్‌ యూనిట్‌లోని అందరూ నాపై ఎంతో ప్రేమ చూపించారు. సినిమా కోసం ఎంతో ఎఫర్ట్‌ పెట్టారు. వారందరికీ చాలా చాలా థాంక్స్‌ .. మీకు గ్రేట్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చేందుకు వస్తున్న వార్‌2 కోసం ఆగస్ట్‌ 14 వరకు మీరందరూ వేచి ఉండలేరనే విషయం నాకు తెలుసు. అయినప్పటికీ ఒక గొప్ప అనుభూతిని పొందడం కోసం ఎదురు చూడక తప్పదు అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ వార్ 2 సినిమా గురించి అలాగే ఈ ఈ చిత్ర బృందంతో ఆయనకు ఎదురైన అనుభవాల గురించి తెలియజేస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఎన్టీఆర్ ఈ సినిమా మాత్రమే కాకుండా ప్రస్తుతం ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్షన్లో కూడా ఓ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఈయన త్రివిక్రమ్ తో కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. అనంతరం దేవర 2, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో కూడా ఈయన సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించిన వార్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇక ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత నాగ వంశీ (Nagavamshi) కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 14వ తేదీ అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Also Read: SSMB 29 Update : ఎస్ఎస్ఎంబి 29 సెట్ లో అడుగుపెట్టిన మాధవన్.. మహేష్ తండ్రిగా స్టార్ హీరో?

Related News

Coolie Vs War 2: రాజకీయ చిచ్చు లేపిన లోకేష్.. ఎన్టీఆర్ ను దెబ్బతీయడానికేనా?

War 2: ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సర్వం సిద్ధం.. కానీ ఆంక్షలు తప్పనిసరి!

Mahavatar Narasimha Collections : నరసింహుడి ఉగ్రతాండవం ఇప్పటిల్లో తగ్గేట్టులేదే.. 200 కోట్ల రాబడుతుందా..?

Filmfare Awards 2025: ఫిల్మ్ ఫేర్ గ్లామర్ & స్టైల్ సౌత్ విన్నర్స్ ఫుల్ లిస్ట్ ఇదే..!

Coole Vs War 2: కూలీ, వార్ 2 ప్లస్.. మైనస్ లు.. బాక్సాఫీసు క్లాష్ లో బాలీవుడ్ కి తడబాటు తప్పదా?

Tollywood workers Strike: చర్చలు ఫెయిల్… సమ్మెపై నిర్ణయం ఇదే

Big Stories

×