War 2 Pre Release: యష్ రాజ్ ఫిలిమ్ యూనివర్స్ నుంచి అయాన్ ముఖర్జీ(Ayan Mukerji) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చిత్రం వార్ 2(War 2). ఈ సినిమాలో హృతిక్ రోషన్ (Hrithik Roshan)ఎన్టీఆర్ (Ntr)ప్రధాన పాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలను నిర్వహిస్తూ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. అయితే తాజాగా హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమానికి చిత్ర బృందం మొత్తం హాజరయ్యారు ఇక ఈ కార్యక్రమంలో హృతిక్ రోషన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
విలన్ గా ఎన్టీఆర్?
ఈ కార్యక్రమంలో భాగంగా దర్శకుడు అయాన్ ముఖర్జీ వేదికపై మాట్లాడుతూ ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాల గురించి అభిమానులతో పంచుకున్నారు. అయితే ఆయన మాట్లాడుతున్న నేపథ్యంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగులో అనువాదం చేశారు. ఎన్టీఆర్ తమ సినిమాలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది అంటూ ఈ సినిమా గురించి ఎన్నో విషయాలు తెలిపారు. అయితే ఈ సినిమా గురించి గత కొంతకాలంగా ప్రేక్షకులకు ఎన్నో సందేహాలు వ్యక్తమౌతూనే ఉన్నాయి.. ఇందులో ఎన్టీఆర్ విలన్ పాత్రలో నటించబోతున్నారని హీరో హృతిక్ రోషన్ అంటూ ఎన్నో వార్తలు బయటకు వచ్చాయి.
గుడ్ ఎవరు? బ్యాడ్ ఎవరు?
ఈ క్రమంలోనే యాంకర్ సుమ ఈ విషయం గురించి డైరెక్టర్ అయాన్ ముఖర్జీని ప్రశ్నించింది. మా తెలుగు ప్రేక్షకుల నుంచి ఎన్నో డౌట్స్ ఉన్నాయ్ అంటూ ఈ సినిమాలో గుడ్ ఎవరు?బ్యాడ్ ఎవరు? అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు అయాన్ ముఖర్జీ సమాధానం చెబుతూ.. ఈ సినిమాలో గుడ్ ,బాడ్ అనేది ఎవరో తెలియాలి అంటే కచ్చితంగా మీరంతా సినిమాకు వచ్చి సినిమా చూసిన తర్వాత మీరే ఆ విషయం గురించి సమాధానం చెప్పాలని తెలిపారు. ఎందుకంటే ఈ సినిమాలో వీరిద్దరూ హీరోలు గానే నటించారు . ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా చూసిన వారందరూ కూడా ఇద్దరూ హీరోలనే చెబుతారు మరి గుడ్ ఎవరు బ్యాడ్ ఎవరనేది మీరే చెప్పాలని ఆయాన్ ముఖర్జీ తెలిపారు.
ఎన్టీఆర్ పాత్ర అరగంట మాత్రమేనా?
ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర గురించి పలు సందేహాలు ఉన్నాయి ఎన్టీఆర్ పాత్ర సినిమా మొదలైన అరగంట తర్వాత నుంచి ఉంటుందని, ఈయన పాత్ర సినిమాలో అరగంట మాత్రమే ఉంటుంది అంటూ ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం గురించి కూడా ఆయాన్ ముఖర్జీని ప్రశ్నించడంతో ఆయన ఈ సందేహాలకు సమాధానం తెలియాలి అంటే కచ్చితంగా సినిమా చూడాల్సిందేనని తెలిపారు. అయితే నిర్మాత నాగవంశీ మాత్రం సినిమా మొదలైన 15 నిమిషాల నుంచి ఎన్టీఆర్ పాత్ర చివరి వరకు ఉంటుందని ఓ సందర్భంలో వెల్లడించారు. ఏది ఏమైనా ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారన్న నేపథ్యంలో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 14వ తేదీ వార్ 2 ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.
Also Read: Upasana: ఉపాసనను చూడగానే చిరు అంత మాట అన్నారా.. నిర్ణయం మారిందా?