War 2Trailer : బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమాలలో వార్ 2 (War 2)ఒకటి. ప్రముఖ దర్శకుడు అయాన్ ముఖర్జీ (Ayan Mukerji)దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ యూనివర్స్ నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగానే ఈనెల 25వ తేదీ ట్రైలర్ లాంచ్(Trailer Launch) చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జూలై 25వ తేదీ ఉదయం 9:30 నిమిషాలకు ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది.
108 థియేటర్లలో ట్రైలర్ రిలీజ్..
ఇకపోతే ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం కోసం ఏకంగా థియేటర్లను కేటాయించడం విశేషం. థియేటర్లలోనే ఈ సినిమా ట్రైలర్ విడుదల కాబోతుందని తాజాగా చిత్ర బృందం వెల్లడించారు. ఇకపోతే రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కర్ణాటకలో కలిపి ఏకంగా 108 థియేటర్లను ట్రైలర్ లాంచ్ కోసం కేటాయించినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన థియేటర్ల లిస్ట్ కూడా విడుదల చేశారు. ఇలా థియేటర్లలో ఈ సినిమా ట్రైలర్ విడుదల కాబోతుందని తెలియగానే అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్(NTR) అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.
ఎన్టీఆర్ హృతిక్ మధ్య బిగ్ వార్…
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఎన్టీఆర్ RRR సినిమా తరువాత పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందు రావటమే కాకుండా బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకోవటం విశేషం. ఎన్టీఆర్ నటించిన మొదటి బాలీవుడ్ సినిమా కావడంతో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) మధ్య భీకరమైన యాక్షన్స్ సన్ని వేషాలు కూడా ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఇందులో ఎన్టీఆర్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నారని సమాచారం.
https://twitter.com/idlebraindotcom/status/1948333241892848043?t=hyEN9NNNbX3emYwnIJ9fyw&s=19
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ మంచి అంచనాలను పెంచేసింది. ఆగస్టు 14వ తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమా హిందీతో పాటు తమిళం, కన్నడ, తెలుగు భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఆగస్టు 14వ తేదీ ఈ సినిమాకు పోటీగా రజనీకాంత్ నటించిన కూలి సినిమా కూడా విడుదల కాబోతున్న నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఉండబోతుందని తెలుస్తోంది. మరి ఈ బాక్సాఫీస్ వార్ లో విజయం ఎవరిదనేది తెలియాల్సి ఉంది. రజనీకాంత్ కూలీ సినిమాపై కూడా ఇప్పటికే భారీ అంచనాలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక వార్ 2 సినిమా తెలుగు హక్కులను ప్రముఖ సినీ నిర్మాత నాగ వంశీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
Also Read: Krish Jagarlamudi: హరిహర వీరమల్లు విడుదల… బయటపడ్డ విభేదాలు?