కేరళ తెలంగాణ మధ్య రైల్వే కనెక్టివిటీని మరింత మెరుగు పరుస్తోంది భారతీయ రైల్వే. ఇందులో భాగంగానే తిరువనంతపురం సెంట్రల్- సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న ఐకానిక్ శబరి ఎక్స్ ప్రెస్ ను రైల్వే బోర్డు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ గా అప్ గ్రేడ్ చేసింది. ఈ రైలు సెప్టెంబర్ 29 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ రైలు అందుబాటులోకి వస్తే, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. శబరి ఎక్స్ ప్రెస్ ద్వారా రాకపోకలు కొనసాగించే ప్రయాణీకులు, యాత్రికులకు ఈ రైలు ఎంతగానో ఉపయోగపడనుంది. ప్రస్తుతం ఈ రైలు నెంబర్లు 17229/17230 ఉండగా, ఇకపై 20630/20629 నెంబర్లుగా మారనున్నాయి.
శబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ప్రత్యేతలు
⦿ కొత్త రైలు నంబర్లు: 20630 (తిరువనంతపురం – సికింద్రాబాద్), 20629 (సికింద్రాబాద్ – తిరువనంతపురం)
⦿ కొత్త రైలు ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 29, 2025
⦿ శబరి ఎక్స్ ప్రెస్ అప్ గ్రేడ్ చేయబడిన తర్వాత పద్మావతి ఎక్స్‌ప్రెస్ (12763/12764), తిరుపతి – సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ (12731/12732) తో అనుసంధానించబడదు.
⦿ ఈ రైలు ఇప్పుడు తిరువనంతపురం సెంట్రల్ నుంచి ఉదయం 06.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.00 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ఇతర రైళ్లపై ప్రభావం
శబరి ఎక్స్ ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ గా మారిన తర్వాత దక్షిణ రైల్వే పరిధిలో నడిచే పలు రైళ్ల షెడ్యూల్ మారనుంది. ఈ మార్పులు సెప్టెంబర్ 29, 2025 నుండి కూడా అమలులోకి వస్తాయి
⦿ రైలు నం. 13351 – ధన్ బాద్ – అలప్పుజ ఎక్స్ ప్రెస్
జోలార్ పేటై- అలప్పుజ మధ్య నడిచే ఈ రైలుకు సంబంధించి కొత్త టైమ్ షెడ్యూల్ వచ్చేసింది. వీటిలో సేలం, ఈరోడ్, కోయంబత్తూర్, త్రిస్సూర్, ఎర్నాకుళం జంక్షన్ వంటి కీలక స్టేషన్లలో బయల్దేరే సమయాలు సర్దుబాటు చేశారు.
⦿ రైలు నం. 16160 – మంగళూరు సెంట్రల్ – తాంబరం ఎక్స్ ప్రెస్
పాలక్కాడ్- ఈ రోడ్ మధ్య ఈ రైలు టైమింగ్స్ మార్చారు. ఈ కారిడార్ లోని ఇతర ఎక్స్ ప్రెస్ సేవలతో లింక్ అయ్యేలా తగిన చర్యలు తీసుకోనున్నారు.
⦿ రైలు నం. 66601 – ఈరోడ్ – కోయంబత్తూర్ ప్యాసింజర్
ఈ రోడ్ నుంచి ఉదయం 07.30 గంటలకు ప్రారంభం కావడానికి తిరిగి షెడ్యూల్ చేయబడింది. తిరుప్పూర్, సూలూర్ రోడ్, కోయంబత్తూర్ నార్త్ లాంటి ఇంటర్మీడియట్ స్టేషన్లలో మార్చిన ల్ట్‌ల తో స్థానిక ప్రయాణీకులకు మేలు కలగనుంది.
⦿ రైలు నంబర్ 16345 – లోకమాన్య తిలక్ టెర్మినస్ – తిరువనంతపురం సెంట్రల్ నేత్రావతి ఎక్స్ ప్రెస్
అక్టోబర్ 21, 2025 నుంచి అమలులోకి వచ్చే ఈ రైలు అలువా- తిరువనంతపురం మధ్య అప్ డేట్ చేసిన టైమింగ్స్ ను ఫాలో అవుతుంది. ఈ రైలు దక్షిణ కేరళ జిల్లాలకు మెరుగైన కనెక్టివిటీకి సహాయపడుతుంది.
కేరళకు వెళ్లే ప్రయాణీకులకు గుడ్ న్యూస్
శబరి ఎక్స్ ప్రెస్‌ను అప్ గ్రేడ్ చేయడంతో కేరళ నుంచి వచ్చే ప్రయాణికులు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కేరళకు వెళ్లే ప్రయాణీకులకు ఎంతో ఉపయోగపడనుంది.
Read Also: రైల్వే స్టేషన్లలో AI టెక్నాలజీ, ఇక చీమ చిటుక్కుమన్నా ఇట్టే తెలిసిపోతుంది!