BigTV English

Kuberaa film: ఇంత గొప్ప కథను అందించిన పింగళి చైతన్య ఎవరు.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

Kuberaa film: ఇంత గొప్ప కథను అందించిన పింగళి చైతన్య ఎవరు.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

Kuberaa film: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush), టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నాగార్జున(Nagarjuna ) కాంబినేషన్లో తాజాగా థియేటర్లలో విడుదలైన చిత్రం కుబేర (Kubera). ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Shekhar Kammula) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ప్రముఖ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika mandanna) ఇందులో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం ఎవరి నోట విన్నా.. ఈ కుబేర సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకి గొప్ప కథ కుదిరింది అని, ఆ కథను ఎస్టాబ్లిష్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఇంత గొప్ప కథను అందించింది పింగళి చైతన్య (Pingali Chaitanya). మరి ఈమె ఎవరు? ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అని తెలుసుకోవడానికి అభిమానులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. మరి ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం.


పింగళి చైతన్య బ్యాక్ గ్రౌండ్..

కుబేర సినిమాకు అద్భుతమైన కథను అందించిన పింగళి చైతన్య ఎవరో కాదు.. భారత జాతీయ జెండాకు రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య మనవరాలు. ఈయన వారసత్వం నుంచి పింగళి దశరథ రామ్ వచ్చారు. ఈయన కూడా జర్నలిజంలో పెను మార్పులు చేసి ఎన్కౌంటర్ అంటూ తన తలరాతలతో ఎంతోమంది గుండెల్లో వణుకు పుట్టించారు. ఆయన కుమార్తెగా పింగళి చైతన్య గొప్ప రచనలు చేస్తూ అందరి మన్ననలు సొంతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె కుబేర మూవీకి కథను అందించారు. ఇకపోతే పింగళి చైతన్య ప్రస్తుతం కుబేర సినిమాకు కో రైటర్ గా పనిచేశారు. కథలో, కథ రచనలలో శేఖర్ కమ్ములతో కలసి పనిచేసిన ఈమె.. ప్రస్తుతం ఈ సినిమాకి సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ రావడంతో ఈమె పేరు కాస్త వెలుగులోకి వచ్చింది.


పింగళి చైతన్య భవిష్యత్తు పయనం ఎటువైపు..

సినిమా చూసిన చాలామంది.. కథ కొత్తగా ఉందని, శేఖర్ కమ్ములాకి ఇదొక కొత్త జానర్ అని చెబుతున్నారు. ఈ సినిమాతో మంచి విజయం అందుకున్నారు కానీ భవిష్యతులో పింగళి చైతన్య సినిమా కథలు రాయడానికి ప్రాధాన్యత ఇస్తారా? లేదా? తన రచనల్లోనే బిజీగా ఉండిపోతారా? అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే కథా రచయిత్రిగా ఈ సినిమాతో మంచి పేరు దక్కించుకున్న ఈమెకు.. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఒకవేళ ఈమె గనుక సినిమా ప్రపంచం వైపు అడుగులు వేయాలి అనుకుంటే.. ఇంకెన్ని గొప్ప కథలు తెరపై కనిపిస్తాయో చూడాలి అని, అభిమానులు కూడా ఆసక్తి కనబరుస్తూ ఉండడం గమనార్హం.

కథా రచయిత్రి మాత్రమే కాదు పాటల రచయిత్రి కూడా..

అద్భుతమైన నవలా పుస్తకాలతో వెలుగులోకి వచ్చిన ఈమె తొలిసారి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్(Varun Tej) నటించిన ‘ఫిదా’ మూవీకి కో-రైటర్‌గా చేసింది. అంతేకాకుండా ఫిదా సినిమాలో ‘ఊసుపోదు ఊరుకోదు’, ‘ఫిదా ఫిదా’, నేల టికెట్ సినిమాలో ‘బిజిలి’, ‘విన్నానులే’, లవ్ స్టోరీ (2020) సినిమాలో ‘ఏయ్ పిల్ల’, మసూద (2022) సినిమాలో ‘దాచి దాచి’, షరతులు వర్తిస్తాయి (2024) సినిమాలో ‘ఆకాశం అందని’ అనే పాటలు రాసి.. పాటల రచయిత్రి కూడా పనిచేసింది.

అత్యంత ధనవంతుడికి.. ఏమీ ఆశించని బిచ్చగాడికి మధ్య సాగే కథ..

కుబేర స్టోరీ విషయానికి వస్తే.. అత్యంత ధనవంతుడికి.. ఏమీ ఆశించని బిచ్చగాడికి మధ్య సాగే కథ ఇది. ఇందులో ఎవరికి వారు తమ పాత్రలతో అద్భుతంగా ఆకట్టుకున్నారు. మరి మొదటి రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కమర్షియల్ గా ఎలాంటి కలెక్షన్స్ వసూల్ చేస్తుందో చూడాలి.

ALSO READ:Sukumar – Mahesh Babu: ఆరేళ్ల తర్వాత మళ్లీ కలయిక.. ఈసారైనా వర్కౌట్ అవుతుందా?

Related News

War 2 Pre Release Event : ఇప్పుడు అసలైన వార్… ఈ ఒక్క దాంతో కూలీని దాటేసింది

NTR: కాళ్ళ మీద పడ్డ అభిమాని.. ఎన్టీఆర్ ఏం చేసాడంటే

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

War 2 Pre release: అభిమానులపై కోప్పడిన తారక్.. ఇక్కడి నుంచి వెళ్లిపోనా అంటూ!

War 2 Pre release: నన్ను ఎవరూ ఆపలేరు.. పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చిన తారక్!

War 2 Pre release: తారక్ మీకు అన్న… నాకు తమ్ముడు.. స్పీచ్ అదరగొట్టిన హృతిక్!

Big Stories

×