BigTV English

Mutton Dalcha: మటన్ దాల్చా ఎప్పుడైనా ఇలా చేశారా? బిర్యానితో తింటే గిన్నెలో చిన్న ముక్క కూడా మిగలదు

Mutton Dalcha: మటన్ దాల్చా ఎప్పుడైనా ఇలా చేశారా? బిర్యానితో తింటే గిన్నెలో చిన్న ముక్క కూడా మిగలదు

మాంసాహారంలో కాస్త వెరైటీ డిష్ ప్రయత్నించాలనుకుంటే మటన్ దాల్చా వండండి. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. పైగా పోషకాలు నిండుగా ఉంటాయి. మటన్ దాల్చా అనగానే ముస్లింల వంటకంగా భావించకండి. ఇది అందరూ తినే టేస్టీ వంటకమే. పైగా రుచిలో అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా నచ్చేస్తుంది. దీన్ని బిర్యానితో లేదా బగారా రైస్ తో తింటే అద్భుతంగా ఉంటుంది.


మటన్ దాల్చా రెసిపీకి కావలసిన పదార్థాలు
మటన్ ముక్కలు – అరకిలో
నెయ్యి – ఒక స్పూను
కొత్తిమీర తరుగు – నాలుగు స్పూన్లు
చింతపండు – ఉసిరికాయ సైజులో
శెనగపప్పు – పావు కప్పు
కందిపప్పు – అరకప్పు
నూనె – నాలుగు స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
బిర్యానీ ఆకులు – రెండు
దాల్చిన చెక్క – చిన్న ముక్క
టమోటోలు – రెండు
యాలకులు – రెండు
లవంగాలు – రెండు
ఎండుమిర్చి – రెండు
ఉల్లిపాయలు – ఐదు
పచ్చిమిర్చి – నాలుగు
అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను
కారం – ఒక స్పూను
ధనియాల పొడి – ఒక స్పూను
గరం మసాలా – ఒక స్పూను
మిరియాలు – ఐదు
జీలకర్ర – అర స్పూను
ఆవాలు – అర స్పూను
కరివేపాకులు – గుప్పెడు

మటన్ దాల్చా రెసిపీ
1. శనగపప్పు, కందిపప్పులను ముందుగానే నానబెట్టుకోవాలి.
2. స్టవ్ మీద కుక్కర్ పెట్టాలి. కుక్కర్లో నూనె వేయాలి.
3. ఆ నూనెలో యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకూ వేసి వేయించాలి.
4. అందులోనే ఉల్లిపాయల తరుగును, అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేసి బాగా వేయించుకోవాలి.
5. పచ్చివాసన పోయేదాకా వేయించి ఆ తర్వాత పచ్చిమిర్చి, టమోటో ముక్కలు వేయాలి. పైన మూత పెట్టి టమోటో ముక్కలు మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి.
6. ఆ తర్వాత మటన్ ముక్కలను వేసి బాగా కలపాలి. ఐదు నిమిషాల పాటు మటన్ ముక్కలను ఉడికించాలి.
7. ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న శెనగపప్పు, కందిపప్పు వేసి బాగా కలపాలి. అవి ఉడకడానికి సరిపడా నీళ్లను వేయాలి.
8. ఆ నీళ్లలోనే కారం, పసుపు, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి వేసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేయాలని.
9. కనీసం ఐదు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. ఆవిరి తగ్గేదాకా అలా వదిలేయాలి.
10. తర్వాత కుక్కర్ మూత తీసి మళ్లీ స్టవ్ వెలిగించి ఉడికించాలి.
11. అందులో చింతపండు పులుసును కూడా వేసి బాగా కలపాలి.
12. అలా ఉడుకుతున్నప్పుడు మరొక స్టవ్ మీద కళాయిని పెట్టి నూనె, నెయ్యి వేయాలి.
13. అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మిరియాలు, కరివేపాకులను వేసి వేయించాలి.
14. ఈ పోపును ఉడుకుతున్న మటన్ పులుసుపై వేసి బాగా కలపాలి. పైన కొత్తిమీర తరుగును చల్లుకోవాలి.
15. అంతే టేస్టీ మటన్ దాల్చా రెడీ అయినట్టే. ఇది జ్యూసీగా, క్రీమీగా ఉంటుంది. రుచి అద్భుతంగా ఉంటుంది.


ఇందులో మనం ఎన్నో పదార్థాలను వేసాము. కాబట్టి మనకి పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇది మాంసాహారం, శాఖాహారము కలిపిన వంటకం. మీరు బగారా రైస్ తో పాటు ఈ మటన్ దాల్చా తింటే అదిరిపోతుంది. లేదా ప్లెయిన్ బిర్యానీతో ఈ మటన్ దాల్చాను కాంబినేషన్ తిని చూడండి. అద్భుతంగా ఉంటుంది. దీనిలో కారం తక్కువగా వేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ మటన్ దాల్చా సూపర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×