BigTV English
Advertisement

Home Facial Glow: కాఫీపొడిలో వీటిని కలిపి ఫేస్ ప్యాక్ వేస్తే.. అందమంతా మీ ముఖంలోనే!

Home Facial Glow: కాఫీపొడిలో వీటిని కలిపి ఫేస్ ప్యాక్ వేస్తే.. అందమంతా మీ ముఖంలోనే!

Home Facial Glow: మనిషికి అందం అనేది సహజమైనప్పటికీ.. కొంచెం శ్రద్ధ పెట్టామంటే.. మరింత ఆకర్షీణీయంగా మార్చుకోవచ్చు. నాచురల్‌గా, ఎలాంటి కెమికల్స్ ప్రొడక్ట్స్ అవసరం లేకుండా.. ఇంట్లోనే కొన్ని టిప్స్ పాటించడం వల్ల.. అందమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం బిజీ లైఫ్‌లో బయటకు వెళ్లి ఫేసియల్స్ చేపించుకునే టైమ్ కూడా కొంత మందికి ఉండదు. కాబట్టి వీకెండ్ లోనే సమయం దొరికినప్పుడు ఈ ఫేస్ ప్యాక్‌లు ట్రై చేయండి. నిత్యం తాజాగా, అందంగా, యవ్వనంగా కనిపిస్తారు. మరి ఫేస్ ప్యాక్‌లు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


స్టెప్-1
చిన్న బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ పెరుగు, టీ స్పూన్ కాఫీ పొడి వేసి బాగా మెత్తగా, పేస్ట్ లాగా సిద్ధం చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకుని.. పావు గంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గించేలా చేస్తాయి. ఈ రెండు పదార్ధాలు చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచడంలో సహాయపడతాయి.

స్టెప్-2
చిన్న బౌల్ తీసుకుని.. అందులో రెండు టేబుల్ స్పూన్ కాఫీ పొడి, టీ స్పూన్ పంచదార, కొబ్బరి నూనె, తేనె కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ఫేస్‌కి అప్లై చేసి.. అరగంట తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం ద్వార చర్మం ఎక్స్‌ఫోలియేట్ చేసి, ముఖం ప్రకాశవంతంగా కనిపించడంలో సహాయపడుతుంది.


స్టెప్-3
చిన్న గిన్నె తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ కాఫీ పొడి, పసుపు టీస్పూన్, పెరుగు రెండు చెంచాలు కలిపి మెత్తని పేస్ట్ లాగా సిద్ధం చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 15-20 నిమిషాల తర్వాత.. గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది. చర్మం తాజాగా అందంగా, మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. కాఫీ పొడి చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయడంలో చక్కగా పనిచేస్తుంది. పసుపు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. పెరుగు చర్మాన్ని తేమను అందించడంలో సహాయపడుతుంది.

స్టెప్-4
చిన్న గిన్నె తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ క్యారెట్ జ్యూస్, ఆరెంజ్ పీల్ పౌడర్ టేబుల్ స్పూన్, పపాయ పౌడర్ టీ స్పూన్ , అలోవెరా జెల్ టీ స్పూన్, తేనె కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకుని అరగంట తర్వాత.. గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది. ముఖం తాజాగా, కాంతివంతంగా మెరిసేలా చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా టైమ్ దొరికినప్పుడల్లా ట్రై చేయండి. మీ అందం చూసి మీరే మురిసిపోతారు.

Also Read: ఇంట్లోనే గోల్డ్ ఫేషియల్.. అందమైన చర్మం మీ సొంతం

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Kitchen tips: వంట చేస్తున్నప్పుడు కళాయి మూతపై నీరు ఎందుకు పోయాలి?

Chicken Korma: అన్నం, చపాతీల్లోకి అదిరిపోయే చికెన్ కుర్మా, రెసిపీ ఇదిగో

Farmer’s Honor: పండ్లు, కూరగాయల మీద పండించిన రైతుల ఫోటో.. ఎంత మంచి నిర్ణయమో!

Tulsi Leaves: ప్రతిరోజు ఉదయం తులసి ఆకులను నమిలితే.. ఏమవుతుంది ?

Let them go: వెళ్లేవాళ్లని వెళ్లనివ్వండి బాసూ.. లేదంటే మనసును బాధపెట్టినవాళ్లవుతారు!

Foot Massage: ఏంటీ.. త‌ర‌చూ ఫుట్ మ‌సాజ్ చేసుకుంటే ఇన్ని లాభాలా!

Hair Thinning: జుట్టు పలచబడుతోందా ? అయితే ఈ ఆయిల్స్ వాడండి !

Jamun Seeds Powder: నేరేడు విత్త‌నాల పొడిని ఇలా వాడారంటే.. ఎలాంటి రోగమైన పారిపోవాల్సిందే!

Big Stories

×