BigTV English

OTT Movie : 12 ఏళ్ల అమ్మాయి ప్రెగ్నెంట్… హాకీ ఆడడానికి వెళ్లి… ఈ డైరెక్టర్ గట్స్‌కు దండం పెట్టాలి సామీ

OTT Movie : 12 ఏళ్ల అమ్మాయి ప్రెగ్నెంట్… హాకీ ఆడడానికి వెళ్లి… ఈ డైరెక్టర్ గట్స్‌కు దండం పెట్టాలి సామీ

OTT Movie : టీనేజ్ లో పిల్లలకు తల్లిదండ్రుల అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ వయసులో పిల్లలకి ప్రపంచం కొత్తగా అనిపిస్తుంది. ప్రేమ, ఆకర్షణ మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా వీళ్ళు చేసే తప్పులకు తల్లిదండ్రులే వీళ్లకన్నా ఎక్కువగా బాధపడుతుంటారు. అందుకే పేరెంట్స్ పిల్లలతో ప్రేమగా, ఆ వయసులో వచ్చే మార్పులగురించి అర్థమయ్యేలా చెప్పాలి. వాళ్లకు సరైన గైడెన్స్ ఇవ్వాలి. లేకపోతే పరిస్థితి మరోలా మారుతుంది. ఈ నేపధ్యంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఒండ్రాగా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ఒక షార్ట్ ఫిల్మ్ రూపొందింది. ఇందులో పన్నెండేళ్ల అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. ఆతరువాత స్టోరీ ఎమోషన్స్ తో ప్రేక్షకులను ఆలోచనలో పడేస్తుంది. ఈ షార్ట్ ఫిల్మ్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమ్ అవుతోంది ? అనే వివరాల్లోకి వెళితే …


యూట్యూబ్ లో

‘మా’ (MAA) 2018లో విడుదలైన తమిళ షార్ట్ ఫిల్మ్. సర్జున్ కె.ఎం రచన, ఎడిటింగ్ దర్శకత్వంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఒండ్రాగా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో రూపొందింది. ఈ చిత్రంలో అనిఖా సురేంద్రన్ (అమ్ము), కాని కుసృతి (సత్య) ప్రధాన పాత్రల్లో నటించారు. 28 నిమిషాల నిడివితో, ఈ షార్ట్ ఫిల్మ్ టీనేజ్ ప్ప్రెగ్నెంట్ అనే సున్నితమైన అంశాన్ని తల్లి-కూతురు సంబంధం చుట్టూ చర్చిస్తుంది. ఇది 2018 జనవరి 26 న ఒండ్రాగా ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదలైంది. 2018 ఫిబ్రవరి 23న తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. IMDbలో దీనికి 8.1/10 రేటింగ్ ఉంది.


స్టోరీలోకి వెళితే

అమ్ము (అనిఖా సురేంద్రన్) సాంప్రదాయ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన 15 ఏళ్ల స్కూల్ విద్యార్థిని. ఒక రోజు హాకీ ప్రాక్టీస్ సమయంలో ఆమె సొమ్మసిల్లి పడిపోతుంది. స్పృహలోకి వచ్చిన తర్వాత, ఆమె తన స్నేహితురాలితో మాట్లాడుతూ, “నీ పీరియడ్స్ ఎప్పుడైనా ఆలస్యమయ్యాయా?” అని అడుగుతుంది. స్నేహితురాలు ఒకటి రెండు రోజులు ఆలస్యమయ్యాయని చెప్పగా, అమ్ము భయంతో, “3-4 వారాలు ఆలస్యమైన సందర్భం ఉందా?” అని అడుగుతుంది. ఈ సంభాషణలో ఆమె గర్భవతి అని సూచనలు స్పష్టమవుతాయి. ఇంటికి వెళ్లిన తర్వాత, ఆమె వాంతి చేసుకుంటుంది. ఆమె భయం నిజమే అవుతుంది. ఆమె తన స్కూల్‌మేట్‌తో సన్నిహితంగా ఉండటంవల్ల గర్భవతి అవుతుంది.

అమ్ము ఈ విషయాన్ని తన తల్లి సత్య (కాని కుసృతి)తో పంచుకుంటుంది. సత్య మొదట ఈ విషయం తెలుసుకుని షాక్ అవుతుంది. ఆమె తన కూతురిని తిడుతూ, ఈ తప్పు గురించి ఆలోచిస్తూ కుంగిపోతుంది. సత్య తన భర్తకు ఈ విషయం చెప్పడం అసాధ్యమని భావిస్తుంది. ఎందుకంటే అతను అమ్ము షార్ట్స్ వేసుకుని హాకీ ఆడినందుకే ఆమెను తప్పుబడతాడు. ఇక ఈ విషయం తెలిస్తే బతకనిస్తాడా అని భయపడుతుంది. ఇక తల్లి-కూతురు మధ్య ఎమోషన్స్ బయటపడతాయి. ఈ విషయం సమాజంలో తెలిస్తే పరిస్థితి ఏమవుతుందో అని డిప్రెషన్ లోకి వెళ్తుంది. సత్య ఒక దశలో కూతురు చనిపోతే బాగుండని కోరుకుంటుంది. కానీ ఒక కలలో అమ్ము చనిపోయిన దృశ్యం చూసిన తర్వాత, ఆమె తన కూతురిని గట్టిగా కౌగిలించుకుని ఓదారుస్తుంది.

Read Also : అమ్మాయిలే వీడి టార్గెట్… లవ్ పేరుతో ట్రాప్.. ముక్కలు ముక్కలుగా కట్ చేసి, మాంసాన్ని తినే మెంటల్ కిల్లర్

కథలో ఒక కీలకమైన అంశం ఏమిటంటే, అమ్ము గర్భం కారణంగా బాధపడుతున్నప్పటికీ, ఆమె తన తల్లిని బాధపెట్టినందుకు ఎక్కువగా బాధపడుతుంది. సినిమా చివరలో ప్రెగ్నెంట్ కి కారణమైన అబ్బాయి ఎటువంటి బాధ లేకుండా హాకీ ఆడుతుండగా, అమ్ము తన సాధారణ జీవితానికి తిరిగి రావడానికి సంకోచిస్తుంది. ఈ సన్నివేశం అబ్బాయిలు, అమ్మాయిలు ఎదుర్కొనే భిన్నమైన పరిణామాలను హైలైట్ చేస్తుంది. అమ్ము ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటుంది ? అనే విషయాన్ని ఈ షార్ట్ ఫిల్మ్ ను చూసి తెలుసుకోండి.

Related News

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

Big Stories

×