E-Paper
Advertisement

ఆకునూరి మురళికి కావాలనే పొగబెట్టారా? విద్యాశాఖలో పెద్దల మధ్య నడిచిన గొడవేంటి..?

ఆకునూరి మురళికి కావాలనే పొగబెట్టారా? విద్యాశాఖలో పెద్దల మధ్య నడిచిన గొడవేంటి..?
Advertisement

Murali Resignation: స్వేచ్ఛ బ్యూరో: విద్యా కమిషన్ చైర్మన్ ఆకు నూరి మురళి రాజీనామా కు గల కారణాలను ప్రభుత్వం అన్వేషిస్తుంది. ఏం జరిగింది? ఆకస్మికంగా ఆయన ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? అనే అంశాలపై సర్కార్ స్టడీ చేస్తున్నట్లు తెలిసింది. కీలకమైన అధికారిగా గుర్తింపు తెచ్చుకున్న మురళి రాజీనామా కారణాలను తెలుసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు వివిధ సోర్స్ ల ద్వారా తెలుసుకుంటున్నారు. చైర్మన్ పదవీ కాలానికి నాలుగు నెలల ముందే రిజైన్ చేయడంపై సర్కార్ కూడా సీరియస్ గా అధ్యయనం చేస్తుంది. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులను తీసుకువచ్చేందుకు సర్కార్ ప్రత్యేకంగా విద్యా కమిషన్ ను ఏర్పాటు చేసింది.దీన్ని సమర్ధవంతంగా ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రత్యేక అధికారి అవసరమని భావించిన సర్కార్, ఆకునూరి మురళికి చైర్మన్ బాధ్యతలు అప్పగించింది.

ఆకస్మికంగా రాజీనామా..

ఆయన విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కీలక మైన నిర్ణయాలు చేపట్టాల్సి ఉంటుందని, రాష్​ట్ర వ్యాప్తంగా పర్యటించి ఓ నివేదిక తయారు చేశారు. ఆ నివేదిక ప్రభుత్వానికి సమర్పించిన కొన్ని రోజుల్లోనే రిజైన్ చేయడం చర్చాంశనీయమైంది. తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ పదవికి ఆకస్మికంగా రాజీనామా చేసిన ఆకునూరి మురళి వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పదవీకాలం పూర్తికాకముందే ఆయన రాజీనామా చేయడం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే తన రాజీనామాపై ఆకునూరి మురళి పైకి టాస్క్ కంప్లీట్ అని రాజీనామా లేఖలో తెలిపినా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. మరోవైపు ప్రభుత్వ వర్గాలు ఈ అంశంపై మాట్లాడేందుకు నిరాకరించడం గమనార్హం.

Advertisement

Also Read: కర్ణాటక కాంగ్రెస్‌లో రాజకీయాలకు ఎండ్ కార్డు.. ఏడు గంటలపాటు, మెట్టు దిగిన సిద్ధరామయ్య, నేడో రేపో

చైర్మన్, ఐఏఎస్ అధికారికి సయోధ్య కుదరలేదా..?

ఎడ్యుకేషన్ చైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా చేయడానికి వెనక ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ఉన్నట్లు సెక్రటేరియట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఆకునూరి మురళి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సదరు అధికారి ఆయన పై అసంతృఫ్తితోనే ఉన్నారట. మురళి ఇచ్చిన సూచనలు, సలహాలను సదరు అధికారి తీసుకునేందుకు ఆసక్తి చూపలేదనే చర్చ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ లో ఉన్నది. విద్యా వ్యవస్థ డెవలప్ గురించి తన వద్ద ఉన్న సలహాలను చెప్పినప్పటికీ, సదరు ఐఏఎస్ అధికారి రీసివ్ చేసుకునేందుకు మక్కువ చూపలేదని సమాచారం. తన అనుభవం ద్వారా విద్యా వ్యవస్థపై విషయాలను వివరించాలని ప్రయత్నించినా, సదరు ఐఏఎస్ అధికారి చాలా లైట్ తీసుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆ ఇద్దరి మధ్య గ్యాప్ కు దారి తీసినట్లు ఉద్యోగుల్లో చర్చ జరుగుతుంది. ఈ విభేదాలు మరింత తీవ్రమై, మురళి రాజీనామా చేసే పరిస్థితి వరకు వచ్చిందని సెక్రటేరియట్ లోని ఉద్యోగుల్లో చర్చ జరుగుతుంది.

సర్వీస్ లో ఉన్నప్పటి నుంచేనా..

Advertisement

విద్యా శాఖకు బాస్ గా ఉన్న సదరు అధికారికి, ఆకునూరి మురళి ప్రభుత్వ సర్వీస్ లో ఉన్నప్పటి నుంచే గ్యాప్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మురళి ఇచ్చిన నివేదిక విషయాలపై నిత్యం విమర్శలు, అసంతృఫ్తిని వ్యక్తం చేస్తూ సదరు అధికారి ముందుకు సాగారు. ముఖ్యమంత్రికి దృష్టికి రిపోర్టు వెళ్లిన తర్వాత కూడా కొన్ని అంశాలను సదరు ఐఏఎస్ నిలపివేసినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని మురళి ప్రభుత్వ సలహాదారుడు కేకే దృష్టికి కూ‌‌డా తీసుకువెళ్లారు. కానీ ఆయన కూడా సదరు అధికారికే మద్ధతు పలికినట్లు ప్రచారం కున్నది. పేరుకుమాత్రమే పదవి ఇచ్చి, నిర్ణయాదికారం తీసుకునే అవకాశం ఇవ్వనందున వెంటనే మురళి రిజైన్ చేసినట్లు వెళ్లినట్లు ఆఫీసర్స్ వర్గాల్లో పుల్ డిస్కషన్ కొనసాగుతుంది. ప్రభుత్వం కూడా తన సూచనలను సరైన స్థాయిలో పట్టించుకోకపోవడంతో మనస్థాపానికి గురైనట్లు మురళి సన్నిహితులు కూడా స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మురళి రాజీనామాపై సర్కార్ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందనేది బిగ్ డిస్కషన్!

Also Read: వివాదానికి తెరలేపిన బీజేపీ కల్లాల యాత్ర.. అసలు చిట్టా మర్చిపోయారా..!

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×