E-Paper
Advertisement

బంపర్ ఆఫర్ కొట్టేసిన బేబీ నక్షత్ర.. హీరోయిన్ గా తొలి ఛాన్స్?

బంపర్ ఆఫర్ కొట్టేసిన బేబీ నక్షత్ర.. హీరోయిన్ గా తొలి ఛాన్స్?
Advertisement

Baby Nakshatra:ఇటీవల కాలంలో ప్రత్యేకించి కొన్ని చిత్రాలకు చైల్డ్ ఆర్టిస్టులు సోల్మేట్ గా మారుతున్నారటంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే గతంలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో బుల్లిరాజు (BulliRaju) ఎలా అయితే తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారో.. ఇప్పుడు వచ్చిన ‘ఇరుముడి’ చిత్రానికి కూడా బేబీ నక్షత్ర (Nakshatra ) అంతే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. బుల్లిరాజు కామెడీ తో మెప్పించి…ప్రస్తుతం లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటూ.. అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటే.. ఇటు బేబీ నక్షత్ర ఎమోషన్స్ తో అందరి దృష్టిని కట్టిపడేసింది. అంతేకాదు ఏకంగా మైత్రి మూవీ నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ (Ravi Shankar) నుండి బంపర్ ఆఫర్ అందుకొని ఆశ్చర్యపరిచింది.

లక్కీ ఛాన్స్ కొట్టేసిన బేబీ నక్షత్ర..

మలయాళ కుట్టి బేబీ నక్షత్ర సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుండగా.. డైరెక్టర్ శివ నిర్వాణ (Shiva Nirvana) ఈమె టాలెంట్ ను గుర్తించి ఇరుముడి సినిమాలో రవితేజ కి కూతురు పాత్రలో మణెమ్మ గా అవకాశం కల్పించారు. అనుకున్న దానికి మించి అద్భుతంగా నటించి అందరిని మెప్పించింది బేబీ నక్షత్ర. క్లైమాక్స్ లో వచ్చే 20 నిమిషాల సన్నివేశం ఆమె వల్లే బ్లాక్ బస్టర్ అయింది అనడంలో సందేహం లేదు. అలా అద్భుతంగా నటించిన ఈమెకు తాజాగా నిర్వహించిన ఇరుముడి బ్లాక్ బాస్టర్ ప్రెస్ మీట్ లో మైత్రి మూవీ మేకర్స్ లో ఒకరైన నిర్మాత రవిశంకర్ బంపర్ ఆఫర్ ప్రకటించారు.

బేబీ నక్షత్రకు నిర్మాత ప్రామిస్..

Advertisement

ఇరుముడి మూవీ బ్లాక్ బస్టర్ అందుకున్న నేపథ్యంలో హైదరాబాదు వేదికగా సోమవారం రాత్రి నిర్వహించిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ మాట్లాడుతూ..” బేబీ నక్షత్ర నటనకు నేను ఫిదా అయ్యాను. భవిష్యత్తులో ఆమె హీరోయిన్ అవ్వాలనుకుంటే.. ఆమెను మా కూతురిగా భావించి, ఆమెను హీరోయిన్గా మేమే ఇండస్ట్రీకి పరిచయం చేస్తాం” అంటూ హామీ ఇచ్చారు. మొత్తానికి అయితే బేబీ నక్షత్రకు ఇంత పెద్ద ఆఫర్ లభించడం నిజంగా అదృష్టం అంటూ కామెంట్లు చేస్తున్నారు . అంతేకాదు నిర్మాత రవిశంకర్ తీసుకున్న నిర్ణయానికి పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురుస్తోంది.

ALSO READ:స్కిట్ మొత్తం నైటీలతోనే.. రచ్చ చేసిన సెలబ్రిటీస్!

అద్భుతమైన నటన.. ధైర్యం, గట్టి గుండె కలిగిన అమ్మాయి..

Advertisement

ఈ ప్రెస్ మీట్ లో భాగంగా డైరెక్టర్ శివ నిర్వాణ నక్షత్ర గురించి మాట్లాడుతూ ఇప్పటివరకు నక్షత్ర లాంటి ధైర్యం, గట్టి గుండె కలిగిన అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు. తండ్రి లేకపోయినా.. ఆ బాధను దిగమింగుకొని గట్టి గుండెతో జీవిస్తున్న ఈ చిన్నారి మెచ్యూరిటీ లెవెల్స్ కి నేను ఫిదా అయిపోయాను. తనకు తెలుగు రాకపోయినా మలయాళం, తెలుగు తెలిసిన ఒక అసిస్టెంట్ ను ఆమెకు సపోర్టుగా ఉంచితే.. ఏకంగా తెలుగు నేర్చుకొని తన డైలాగ్స్ తో అందరిని అబ్బురపరిచింది. సినిమా క్లైమాక్స్ లో వచ్చే 20 నిమిషాలకి ఆమె ప్రాణం పోసింది. ఎమోషన్స్ పండించడంలో ఆమె దిట్ట అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు నక్షత్రకు తండ్రి లేడు అనే విషయాన్ని చెప్పి అందరిని ఎమోషనల్ చేశారు డైరెక్టర్ శివ నిర్వాణ.

Related News

చిరంజీవి డేట్ పై త్రివిక్రమ్ కన్ను!

నాని ‘ ప్యారడైజ్ ‘ కు ఆ టైం ఉండదా? ఇదేం ట్విస్ట్ మావా..

‘వారణాసి’ మూవీకి అలాంటి లేవట.. అసలు జక్కన్న ప్లానేంటబ్బా..?

బేబీ నక్షత్ర జీవితంలో ఇంత విషాదమా.. నిజాలు బయటపెట్టిన డైరెక్టర్!

రవితేజ ‘ఇరుముడి’ వివాదం.. ఆ ఒక్కటే డైరెక్టర్ మిస్టేకా..?

ఇదేం ప్రమోషన్స్ నెవ్వర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్..  కిల్లింగ్ లుక్ లో హాట్ బ్యూటీ..

షట్‌డౌన్ దిశగా కోలీవుడ్?.. బంద్‌పై ‘ఫెఫ్సీ’ కీలక విజ్ఞప్తి!

Big Stories

Advertisement
×