Best Mid Range Phones 2026: ఒకప్పుడు మంచి ఫీచర్లు కావాలంటే ఎక్కువ డబ్బులు పెట్టి ఫ్లాగ్‌షిప్ ఫోన్లు కొనాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి పూర్తిగా మారింది. ఎక్కువ ధరకు స్వస్తి చెబుతూ.. మిడ్‌రేంజ్ బడ్జెట్‌లోనే హైరిఫ్రెష్‌రేట్ డిస్‌ప్లేలు, అద్భుతమైన కెమెరాలు, పవర్‌ఫుల్ ప్రాసెసర్లు, పెద్ద బ్యాటరీలతో స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌ను ఏలుతున్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ బడ్జెట్‌లో ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న 5 ఉత్తమ మిడ్‌రేంజ్ ఫోన్ల గురించి తెలుసుకుందాం.
భారీ పెర్ఫార్మన్స్, సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ కోరుకునే వారికి OnePlus Nord 6 పర్ఫెక్ట్ ఛాయిస్. దీనిలో స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్‌తో పాటు 165Hz రిఫ్రెష్ రేట్ ఉన్న 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లేను అందించారు. గేమింగ్, హెవీ వినియోగానికి ఇది అద్భుతంగా సెట్ అవుతుంది. దీని ప్రధాన ఆకర్షణ 9000mAh భారీ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్. రోజంతా ఫోన్ స్క్రోల్ చేసేవారికి ఇది తిరుగులేని ఆప్షన్.
స్టాక్ ఆండ్రాయిడ్ అనుభవం, లాంగ్ టర్మ్ వాడకం ముఖ్యం అనుకునే వారికి Google Pixel 10a నచ్చుతుంది. ఇది 6.3 అంగుళాల OLED 120Hz డిస్‌ప్లే, టెన్సార్ G4 చిప్‌సెట్, 5100mAh బ్యాటరీతో వస్తుంది. ఫొటోల కోసం 48MP మెయిన్ కెమెరా ఉంది. ఈ ఫోన్ అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. గూగుల్ అందిస్తున్న ఏడేళ్ల ఓఎస్, సెక్యూరిటీ అప్‌డేట్లు. ఒక్కసారి కొంటే ఏళ్ల తరబడి ఫోన్ మార్చే పని ఉండదు.
Also Read: గూగుల్ షాకింగ్ నిర్ణయం.. ఆ రెండు కారణాలతో Pixel 10 ధర భారీగా పతనం!
ప్రీమియం డిజైన్, సూపర్ డిస్‌ప్లే కోరుకునే వారికి మోటరోలా ఒక మంచి ప్రత్యామ్నాయం. Motorola Edge 70 Fusionలో 144Hz రిఫ్రెష్ రేట్, 5200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగిన 6.7 అంగుళాల POLED స్క్రీన్‌ను అందించారు. స్నాప్‌డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 5200mAh బ్యాటరీ, 68W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి. IP68 వాటర్ రెసిస్టెన్స్, 50MP OIS కెమెరాతో ఇది చాలా స్లిమ్‌గా, తేలికగా ఉంటుంది.
బ్రాండ్ విలువ, నమ్మకం, దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ సపోర్ట్ కోరుకునే వారికి శాంసంగ్ బెస్ట్ ఛాయిస్. Galaxy A57 5Gలో 6.7 అంగుళాల సూపర్ AMOLED ప్లస్ 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ (45W ఛార్జింగ్) ఉన్నాయి. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో పాటు IP68 రేటింగ్ లభిస్తుంది. శాంసంగ్ ఈ ఫోన్‌కు ఆరేళ్ల పాటు ఓఎస్ అప్‌డేట్లు ఇస్తోంది. డైలీ యూసేజ్‌కు, శాంసంగ్ ఇకోసిస్టమ్ ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఫోన్.
రొటీన్ ఫోన్ డిజైన్లతో విసిగిపోయి, కొత్తగా కనిపించాలనుకునే వారి కోసం Nothing Phone 4a Pro సిద్ధంగా ఉంది. అల్యూమినియం యూనిబాడీ ఫ్రేమ్‌తో వచ్చే ఈ ఫోన్ వెనుక వైపు 137 ఎల్ఈడీలతో కూడిన గ్లిఫ్ మ్యాట్రిక్స్ లైటింగ్ సిస్టమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇందులో 6.83 అంగుళాల AMOLED 144Hz డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉన్నాయి. లుక్స్ పరంగా యూనిక్‌గా ఉండాలనుకునే వారికి ఇది మంచి ఛాయిస్.
Also Read: ఇయర్‌బడ్స్ కాదు.. ఏకంగా స్మార్ట్‌ఫోన్‌నే దించేస్తున్న Mivi, పూర్తి వివరాలు ఇవే!