Bigg Boss 10 Telugu Day 65 Promo 3: బిగ్ బాస్ 10 తెలుగు కార్యక్రమం 9 వారాలను పూర్తి చేసుకొని విజయవంతంగా పదవ వారంలోకి అడుగు పెట్టింది. ఇక పదవ వారం ఫ్యామిలీ వీక్ కావడంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లు తమ ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి వస్తే చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇన్ని రోజులు పాటు బిగ్ బాస్ హౌస్ లో గొడవలు, కొట్లాటలు టాస్కులు అంటూ పోటాపోటీగా కొనసాగింది. కానీ ఈ వారం మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి అడుగుపెట్టడంతో చాలా ఎమోషనల్ గా కొనసాగుతుందని చెప్పాలి.
ఇక ఈరోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించి రెండు ప్రోమోలను విడుదల చేయగా ఇందులో నరేష్ తో పాటు శ్వేత ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. తాజాగా మూడో ప్రోమో విడుదల చేశారు. ఇందులో భాగంగా టెంపర్ వంశీ (Temper Vamsi)ఫ్యామిలీ హౌస్ లోకి రావడంతో ఒక్కసారిగా ఆయన తన ఫ్యామిలీని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ముందుగా నాన్న అని ఓ చిన్నారి మాట వినిపించడంతో రాంప్రసాద్ తన ఫ్యామిలీ వచ్చారని ఎదురు చూశారు కానీ టెంపర్ వంశీ కూతురు మాత్రం డోర్ ఓపెన్ కాగానే నాన్న అంటూ పరుగులు పెడుతూ తన తండ్రిని హగ్ చేసుకుంది.
ఇలా తన కూతుర్ని చూడగానే వంశీ కన్నీళ్లు పెట్టుకున్నారు.. తన కుమార్తె మాట్లాడుతూ.. ఐ హావ్ ఏ హీరో.. ఐకాల్ హిమ్ డాడ్ అని చెప్పడంతో అందరూ ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత వంశీ భార్య హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుంది. భార్యని చూడగానే గట్టిగా హగ్ చేసుకున్న వంశీ నేను వచ్చాక నీకు ఎలా అనిపించిందని అడుగుతుంటే.. చూసావు కదా నా రియాక్షన్ అని వంశీ సమాధానం ఇచ్చారు. చాలా అద్భుతంగా ఆడుతున్నావ్ అంటూ వంశీ భార్య వంశి ఆట తీరుపై ప్రశంసలు కురిపిస్తుంది. ఇకపోతే త్రిగుణ్ వంశీ కూతురికి వంశీ చేసిన డంబెల్ క్యారెక్టర్ నేర్పించి తీసుకురాగా వంశీ లాగే అతని కూతురు డంబెల్ అని అందరిని నవ్విస్తుంది.
A HEARTFELT FAMILY MOMENT FOR VAMSI 🤌❤️
Eroju Bigg Boss House lo jaragaboye Beautiful Moments ni miss avvakandi! 👁️🫶Watch #BiggBossSeason10Telugu Mon – Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & Stream 24/7 on #JioHotstar#StarMaaPromo pic.twitter.com/jQ4lbbIaQ4
— Starmaa (@StarMaa) November 10, 2026
ఇక వంశీ కుమార్తె గార్డెన్ ఏరియాలో ఉన్న బోర్డు మీద ఐ లవ్ యు నాన్న అంటూ ప్రేమగా రాస్తుంది. అది చూసిన వంశీ మరి కాస్త ఎమోషనల్ అయ్యారు. ఇలా తన ఫ్యామిలీ హౌస్ లోకి అడుగుపెట్టడంతో వంశీ ఎంతో హ్యాపీగా ఎమోషనల్ అవుతూ కనిపించారు. మరి వంశీ భార్య తనకు ఎలాంటి సలహాలు ఇచ్చారు. తన ఆట తీరును ఎలా మార్చుకోవాలని చెప్పారు అనేది తెలియాలి అంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే. ఒక్కొక్కరిగా ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి రావడంతో కంటెస్టెంట్లలో ఎంతో సంతోషం కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వారి ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: షన్ను పెళ్లి చేసుకుంటే నేనూ చేసుకోవాలా? పెళ్లి పై దీప్తి సునయన కామెంట్స్ వైరల్!