E-Paper
Advertisement

Yo Yo Honey Singh Concert: యో యో హనీ సింగ్ ఢిల్లీ కన్సర్ట్‌లో రభస.. అభిమానుల మధ్య చెలరేగిన ఘర్షణ..

Yo Yo Honey Singh Concert: యో యో హనీ సింగ్ ఢిల్లీ కన్సర్ట్‌లో రభస.. అభిమానుల మధ్య చెలరేగిన ఘర్షణ..
Advertisement

Yo Yo Honey Singh Concert: ప్రముఖ భారతీయ రాపర్, గాయకుడు యో యో హనీ సింగ్ తన సుదీర్ఘ విరామం తర్వాత దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సంగీత పర్యటన (India Tour) ఘనంగా ప్రారంభమైంది. అయితే, మొదటి రోజే ఢిల్లీలో జరిగిన ఈ కచేరీలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. అభిమానుల కేరింతల మధ్య సాగాల్సిన ఈ ఈవెంట్, ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది. మార్చి 14, శనివారం రాత్రి ఢిల్లీలోని ప్రఖ్యాత ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో హనీ సింగ్ తన ‘మై చాప్టర్ – ఇండియా టూర్’ (My Chapter – India Tour)ను ప్రారంభించారు. వేల సంఖ్యలో తరలివచ్చిన అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. హనీ సింగ్ తన పాపులర్ పాటలైన ‘దేశీ కలాకార్’, ‘సన్నీ సన్నీ’, ‘బ్రౌన్ రంగ్’, ‘బ్లూ ఐస్’ వంటి సూపర్ హిట్ సాంగ్స్‌తో స్టేజ్ మీద సెగలు పుట్టిస్తున్నారు.

Read also-Ustaad Bhagath Singh vs Dhurandhar 2: ఉస్తాద్ భగత్ సింగ్ చేసిన తప్పు.. ధురంధర్ సినిమాకు ప్లస్ కానుందా..!

Advertisement

కచేరీ జోరుగా సాగుతున్న సమయంలో, ప్రేక్షకుల మధ్య ఒక్కసారిగా వాగ్వాదం మొదలైంది. ఇది కాస్తా తీవ్ర స్థాయికి చేరుకుని, ఒకరినొకరు నెట్టుకోవడం, కొట్టుకోవడంతో స్టేడియంలో గందరగోళం నెలకొంది. కొందరు యువకులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కింద ప్రేక్షకుల్లో ఇంతటి ఘర్షణ జరుగుతున్నా, స్టేజ్ మీద ప్రదర్శన ఇస్తున్న హనీ సింగ్‌కు ఆ గొడవ గురించి తక్షణమే తెలియలేదు. ఆయన తన పాటలతో ప్రేక్షకులను ఉత్సాహపరచడంలో నిమగ్నమైపోయారు. స్టేడియంలోని లైటింగ్ మరియు మ్యూజిక్ సౌండ్ వల్ల గొడవ జరుగుతున్న విషయం ఆయనకు మొదట్లో అర్థం కాలేదు. అయితే, పరిస్థితి అదుపు తప్పుతోందని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది మరియు ఢిల్లీ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. గొడవ పడుతున్న వారిని చెదరగొట్టి, పరిస్థితిని సముదాయించి శాంతిని నెలకొల్పారు.

Read also-Actor Prabhas: పెళ్లి పీటలు ఎక్కబోతున్న ప్రభాస్… రాయలసీమ ఇంటి అల్లుడు కాబోతున్నాడా?

Advertisement

ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది భద్రతా లోపాలను ఎత్తిచూపుతుండగా, మరికొందరు ఇలాంటి పెద్ద ఈవెంట్లలో సంయమనం పాటించాలని హితవు పలుకుతున్నారు. ఇంతటి భారీ రద్దీ ఉన్న చోట చిన్న గొడవ కూడా పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో జరిగిన ఈ చేదు సంఘటనను పక్కన పెడితే, హనీ సింగ్ ఇండియా టూర్ షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. ఆయన తదుపరి ప్రదర్శనలు ఇలా ఉన్నాయి.. మార్చి 21న అహ్మదాబాద్ లో…మార్చి 28న ముంబైలో ఏప్రిల్ 4న పుణెలో ఏప్రిల్ 11న కోటాలో ఏప్రిల్ 25న ఇండోర్లో మే 16న బెంగళూరులో ఈ పర్యటన ముగియనుంది. రాబోయే నగరాల్లో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు కఠినమైన భద్రతా చర్యలు తీసుకుంటారని అభిమానులు ఆసిస్తున్నారు.

Related News

RC17 కోసం హాలీవుడ్ దిగ్గజం…సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘కృష్ణంభజే’ నుండి ఫస్ట్ లుక్ లాంఛ్ !

సంక్రాంతి రేస్ నుంచి చిరంజీవి ‘కాకా’ ఔట్? నిజమేనా?

ఇరుముడి సినిమాకు భారీ షాక్…ప్రొజెక్టర్ ద్వారా వీధుల్లో ప్రదర్శనలు!

భార్యను కలవబోతున్న సీఎం విజయ్…త్రిష సైడ్ అవ్వాల్సిందేనా?

Big Stories

Advertisement
×