Big Stories

నిర్మలమ్మకు USISPF కొత్త వినతులు

USISPF

USISPF’s new requests to Nirmala

దేశంలో ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానాన్ని సరళీకృతం చేయాలని, విదేశీ కంపెనీల కార్పొరేట్ పన్ను రేట్లను హేతుబద్ధీకరించాలని… యుఎస్‌ ఇండియా స్ట్రాటజిక్ అండ్ పార్టనర్‌షిప్ ఫోరమ్… కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేసింది. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకు ఇండియాపై నమ్మకం మరింత పెరిగి… విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెల్లువలా తరలివస్తాయని… యుఎస్‌ఐఎస్‌పీఎఫ్‌ ఆర్థిక మంత్రిత్వ శాఖకు కోరింది. మూలధన లాభం పన్ను సంస్కరణలను సరళీకృతం చేయాలని, వివిధ సాధనాల హోల్డింగ్ కాలాలు, రేట్లను సమన్వయం చేయాలని సూచించింది.

- Advertisement -

గ్లోబల్ టాక్స్ డీల్‌కు భారత నిబద్ధతను పునరుద్ఘాటించడంతో పాటు, సెక్యూరిటీల్లో పెట్టుబడి నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ వరకు… రాయితీ పన్ను విధానాన్ని విస్తరించాలని, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు విజ్ఞప్తి చేసింది… యుఎస్‌ఐఎస్‌పీఎఫ్‌. హెల్త్‌ వంటి నిర్దిష్ట సెక్టార్లలో పునరుత్పాదక శక్తి… పరిశోధన, అభివృద్ధి పెట్టుబడులపై పన్ను రాయితీలు ఇవ్వాలని కోరింది. ముడిచమురు, సహజ వాయువు కంపెనీలకు అందించిన కస్టమ్స్ సుంకం మినహాయింపులపై వివరణ అడిగింది. ఎక్స్-రే యంత్రాలపై కస్టమ్స్ సుంకం రేట్లను 10 నుంచి 7.5 శాతానికి తగ్గించాలని, నిర్దేశిత పరిశోధన ద్వారా దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై కస్టమ్స్ సుంకం మినహాయింపును అందించాలని కోరింది.

- Advertisement -

ఉత్పత్తి ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని… పోషకాహార ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ పెంపును ఉపసంహరించుకోవాలని యుఎస్‌ఐఎస్‌పీఎఫ్‌ అభిప్రాయపడింది. దేశంలో శాస్త్రీయంగా తయారుచేసే పోషకాహార లభ్యతను ప్రోత్సహించాలని కోరింది. కస్టమ్స్ టారిఫ్‌లు, పన్నులు, టెలికాం ఉత్పత్తులపై కస్టమ్స్ టారిఫ్ చట్టంలోని అస్పష్టతలను పరిష్కరించాలని తెలిపింది. అలాగే CAROTAR,ఫేస్‌లెస్‌ ఎసెస్‌మెంట్‌ వంటి వాణిజ్య సులభతర పథకాలను బలోపేతం చేయాలని, అధునాతన జీవ ఇంధన ప్రాజెక్టులకు కస్టమ్స్ సుంకంపై రాయితీలను పొడిగించాలని యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌ ఆర్థిక మంత్రి నిర్మలకు విజ్ఞప్తి చేసింది. వీటిని ఆమె ఏ మేరకు పరిగణనలోకి తీసుకుంటారో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News