Bengal: అరచేతిలోకి టెక్నాలజీ వచ్చినా ఇంకా మూఢ నమ్మకాలు కొనసాగుతున్నాయి. మాంత్రికుల మాటల్లో పడి ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బెంగాల్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య చంపి తలను త్రిశూలంపై పెట్టి తాంత్రిక పూజలు చేశాడు భర్త. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసుుల షాకయ్యారు.
పశ్చిమ బెంగాల్లోని బాంకురా జిల్లా నట్ లాల్బాబా మనాచర్ ప్రాంతంలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగులోకి వచ్చింది. దసరా ముందు రోజు అంటే అష్టమి నాడు అక్టోబర్ 19న తాంత్రిక పూజల కోసం భార్య 39 ఏళ్ల రుంపా చౌదరిని చంపాడు ఆమె భర్త మంగళ్ చౌదరి. ఆ తర్వాత ఆ తల నరికి పూజ గదిలోని త్రిశూలంపై పెట్టి తాంత్రిక పూజలు చేశాడు. ఆ తర్వాత 60 ఏళ్ల వయసున్న తన తండ్రి రాజేంద్ర చౌదురిపై దాడి చేశాడు. వరుస ఘటనలతో ఆ ప్రాంత ప్రజలు హడలిపోయారు.
అదే సమయంలో తన సోదరుడ్ని చంపేందుకు ప్రయత్నం చేశాడు. ఈ విషయం తెలిసి చాకచక్యంగా ఇంట్లో నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత భార్యని చంపిన కత్తి పట్టుకుని ఊరంతా తిరిగి ప్రజలను భయబ్రాంతులకు గురి చేశాడు. హత్య ఘటనల గురించి తెలుసుకున్న స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే సోనాముఖి, కాంక్సా పోలీస్ స్టేషన్ల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడి భార్య, తండ్రి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చివరకు పూజలు చేసిన మంగళ్ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి చేతికి గాయం కావడంతో చికిత్స కోసం వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్పించారు. నిందితుడు చికిత్స పొందుతున్నందున వెంటనే కోర్టులో హాజరుపరచలేమని చెబుతున్నారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, హత్యల వెనుక అసలు ఏం జరిగింది? అనే దానిపై కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు.
ALSO READ: ఎల్ఐసిలో ఫ్రెషర్స్ జాబ్స్.. 232 ఉద్యోగ ఖాళీలు.. వెంటనే అప్లై చేయండి
మంగళ్, అతని భార్య ఇంట్లో తరచూ పూజలు చేసేవారని అంటున్నారు స్థానికులు. ఓ తాంత్రిక మాంత్రికుడు వాళ్ల ఇంటికి వచ్చేవాడని అంటున్నారు. ఈ క్రమంలో మంగళ్ హత్యలకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నరబలిలో భాగంగా జరిగిన హత్యలు జరిగాయా? దర్యాప్తు పూర్తయితే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు పోలీసులు.