E-Paper
Advertisement

బెంగళూరు లాడ్జిలో దారుణం.. కేరళ యువతి దారుణ హత్య.. పోలీసుల అదుపులో ప్రియుడు!

బెంగళూరు లాడ్జిలో దారుణం.. కేరళ యువతి దారుణ హత్య.. పోలీసుల అదుపులో ప్రియుడు!
Advertisement

Bengaluru Murder: బెంగళూరులోని ఓ ప్రైవేట్ లాడ్జిలో కేరళకు చెందిన 22 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురైంది. మరొకరితో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ప్రియుడే ఆమెను కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు.

అసలేం జరిగిదంటే?

కేరళకు చెందిన గంగ (22), గోకుల్ కృష్ణ (23) గురువారం బెంగళూరులోని ప్రైవేట్ లాడ్జిలో దిగారు. మరుసటి రోజు అంటే శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో గంగ హత్య జరిగింది. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. గంగకు మరొక వ్యక్తితో సంబంధం ఉందని గోకుల్ అనుమానించాడు. ఇదే విషయమై శుక్రవారం ఉదయం ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో కోపంతో రగిలిపోయిన గోకుల్.. కత్తితో గంగపై విచక్షణారహితంగా దాడి చేశాడు.

రక్తపు మడుగులో మృతదేహం

Advertisement

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో ఉన్న గంగను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గదిలోని మంచంతో పాటు మెట్ల మార్గంలోనూ రక్తపు మరకలు పెద్ద ఎత్తున ఉండటం చూస్తే దాడి తీవ్ర ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని పోలీసులు తెలిపారు. మరోవైపు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు పేర్కొన్నారు.

నిందితుడి అరెస్ట్

మరోవైపు ఘటనపై కేసు నమోదు చేసిన కాటన్‌పేట పోలీసులు.. పరారీలోనిప ప్రియుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అతడిని పట్టుకొని అరెస్టు చేశారు. హత్యకు దారితీసిన కచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి ప్రస్తుతం అతడ్ని విచారిస్తున్నారు.

Advertisement

Also Read: సుప్రీంకోర్టు తీర్పు ఎఫెక్ట్.. సీఎం విజయ్‌పై స్టాలిన్ ఫైర్.. ‘స్టాండప్ కమెడియన్‌’లా మారారంటూ ఘాటు వ్యాఖ్యలు!

నాలుగేళ్ల ప్రేమ..

కేరళకు చెందిన గంగ, గోకుల్ కృష్ణ గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ బెంగళూరులోని హర్ష కాలేజీలో నర్సింగ్ చేశారు. కాలేజీలో గోకుల్‌కు గంగ జూనియర్ కాగా.. నర్సింగ్ కోర్సు పూర్తయిన తర్వాత ఉద్యోగ వేటలో భాగంగా ఇద్దరూ బెంగళూరుకు వచ్చారు. గంగ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుండగా.. గోకుల్ నర్సింగ్ కాలేజీల్లో విద్యార్థులకు అడ్మిషన్లు ఇప్పించే పని చేస్తున్నాడు.

Also Read: ప్రతి 17 గంటలకో బాల్య వివాహం.. తెలంగాణలో షాకింగ్ గణాంకాలు.. రంగంలోకి పోలీస్ శాఖ!

Tags

Related News

సుప్రీంకోర్టు తీర్పు ఎఫెక్ట్.. సీఎం విజయ్‌పై స్టాలిన్ ఫైర్.. ‘స్టాండప్ కమెడియన్‌’లా మారారంటూ ఘాటు వ్యాఖ్యలు!

తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన ప్రధాని మోదీ.. ఎక్స్‌లో ఆసక్తికర పోస్ట్!

మహారాష్ట్రలో మళ్లీ పొలిటికల్ ట్విస్ట్.. ఎన్డీఏలోకి ఎన్సీపీ (ఎస్పీ)? శరద్ పవార్ పెట్టిన కండిషన్స్ ఇవే!

మహిళా కలెక్టర్‌పై లైంగిక వేధింపులు.. టీవీకే ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేష్ అరెస్టు.. అసలేం జరిగిందంటే?

‘రామాయణ’ చిత్రానికి సుప్రీం కోర్టులో భారీ ఊరట.. పిటిషనర్లకు ధర్మాసనం స్ట్రాంగ్ కౌంటర్!

యూపీలో సీట్ల లొల్లి.. కాంగ్రెస్‌తో చీలికలంటూ ప్రచారం.. అఖిలేష్ యాదవ్ క్లారిటీ ఇదే!

మమతా బెనర్జీకి భారీ ఊరట.. స్పీకర్‌కు కలకత్తా హైకోర్టు షాక్.. ప్రతిపక్ష నేతగా రితబ్రత బెనర్జీ నియామకం కొట్టివేత!

Big Stories

Advertisement
×