E-Paper
Advertisement

మహిళా రిజర్వేషన్లపై మోదీ కీలక ప్రకటన.. నారీ శక్తికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని హామీ!

మహిళా రిజర్వేషన్లపై మోదీ కీలక ప్రకటన.. నారీ శక్తికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని హామీ!
Advertisement

Women Reservation: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు. మహిళలకు వారి హక్కులను అందించే మార్గంలో ఉన్న అన్ని అడ్డంకులను తొలగిస్తామని హామీ ఇచ్చారు. దశాబ్దాలుగా సాగుతున్న ఈ పోరాటంలో తాను కూడా భాగమేనన్న మోదీ.. నారీ శక్తికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని పునరుద్ఘాటించారు.

2029 నాటికి అమలు దిశగా..

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్న తరుణంలో ప్రధాని తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నిజానికి 2023లోనే మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందింది. అయితే దీనిని డీలిమిటేషన్ తో ముడిపెట్టడంతో అది అమలుకు నోచుకోలేదు. 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేసి.. మహిళలకు 33 శాతం సీట్లు ఇవ్వాలని కేంద్రం పట్టుదలగా ఉంది.

విపక్షాల మద్దతుతో కేంద్రం ధీమా

Advertisement

ఇదిలా ఉంటే వచ్చేవారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే డీలిమిటేషన్ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది. అన్ని రాష్ట్రాల్లో సీట్లను సమానంగా 50 శాతం పెంచేలా రూపొందించిన ఈ కొత్త బిల్లుకు ఎన్సీపీ (NCP), డీఎంకే (DMK) అధికారికంగా మద్దతు ప్రకటించాయి. దీంతో బిల్లు ఆమోదానికి కావాల్సిన 2/3 వంతు సంఖ్య బలానికి బీజేపీ మరింత చేరువైంది. కాగా ఈ ఏడాది ఏప్రిల్ లో ఇవే పార్టీలు.. డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించడంతో అది వీగిపోవడం గమనార్హం.

Also Read: ‘మరి పరిష్కారం ఏంటి?’.. డీలిమిటేషన్ వివాదంపై కాంగ్రెస్‌కు చంద్రబాబు సూటి ప్రశ్న!

సీట్ల పెంపుతో కొత్త రాజ్యాంగ సవరణ బిల్లు

Advertisement

ఇక సోమవారం ప్రవేశపెట్టనున్న ‘రాజ్యాంగ సవరణ బిల్లు – 2026’ ప్రకారం లోక్‌సభలో గరిష్ఠ సభ్యుల సంఖ్యను 850కి (50 శాతం) పెంచనున్నారు. ఇందులో రాష్ట్రాల నుంచి 815 మంది.. కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 35 మంది సభ్యులు ఉంటారు. అలాగే రాష్ట్ర శాసనసభల గరిష్ఠ సభ్యుల సంఖ్య పరిమితిని కూడా 500 నుంచి 650కి పెంచాలని ఈ బిల్లులో కేంద్రం ప్రతిపాదించనుంది. ఇక ఈ బిల్లు ఆమోదానికి 360 (2/3 వంతు) సభ్యుల మద్దతు అవసరం ఉండగా.. ఇప్పటికే 355 మందికి పైగా సభ్యుల మద్దతును బీజేపీ కూడగట్టినట్లు తెలుస్తోంది.

Also Read: బెంగళూరు లాడ్జిలో దారుణం.. కేరళ యువతి దారుణ హత్య.. పోలీసుల అదుపులో ప్రియుడు!

Tags

Related News

గతంలో వ్యతిరేకం.. ఇప్పుడు అనుకూలం.. డీలిమిటేషన్‌పై డీఎంకే యూటర్న్ వెనుక అసలు కథ ఇదే!

బెంగళూరు లాడ్జిలో దారుణం.. కేరళ యువతి దారుణ హత్య.. పోలీసుల అదుపులో ప్రియుడు!

సుప్రీంకోర్టు తీర్పు ఎఫెక్ట్.. సీఎం విజయ్‌పై స్టాలిన్ ఫైర్.. ‘స్టాండప్ కమెడియన్‌’లా మారారంటూ ఘాటు వ్యాఖ్యలు!

తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన ప్రధాని మోదీ.. ఎక్స్‌లో ఆసక్తికర పోస్ట్!

మహారాష్ట్రలో మళ్లీ పొలిటికల్ ట్విస్ట్.. ఎన్డీఏలోకి ఎన్సీపీ (ఎస్పీ)? శరద్ పవార్ పెట్టిన కండిషన్స్ ఇవే!

మహిళా కలెక్టర్‌పై లైంగిక వేధింపులు.. టీవీకే ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేష్ అరెస్టు.. అసలేం జరిగిందంటే?

‘రామాయణ’ చిత్రానికి సుప్రీం కోర్టులో భారీ ఊరట.. పిటిషనర్లకు ధర్మాసనం స్ట్రాంగ్ కౌంటర్!

Big Stories

Advertisement
×