E-Paper
Advertisement

ఫ్రైడే ఓటీటీలోకి ఏకంగా 12 సినిమాలు… అన్నీ తెలుగులోనే… మిస్ అవ్వకూడని సినిమాలు ఇవే

ఫ్రైడే ఓటీటీలోకి ఏకంగా 12 సినిమాలు… అన్నీ తెలుగులోనే… మిస్ అవ్వకూడని సినిమాలు ఇవే
Advertisement

Friday OTT Releases: వారం వారం ఓటీటీలో వచ్చే సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూసే మూవీ లవర్స్‌కి ఈసారి నిజంగానే పెద్ద పండగ అని చెప్పవచ్చు. సామాన్యంగా ఏదో ఒకట్రెండు సినిమాలు వస్తేనే సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తారు మూవీ లవర్స్. కానీ ఈ ఫ్రైడే మాత్రం ఏకంగా పన్నెండు చిత్రాలు తెలుగులో ఓటీటీలోకి అడుగు పెడుతుండడం అదిరిపోయే గుడ్ న్యూస్. ఇంకేముంది వీకెండ్ ప్లాన్స్ అన్నీ ఇప్పుడే ఫిక్స్ చేసుకునే పనిలో పడ్డారు. నెట్‌ఫ్లిక్స్, సోనీలివ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5, లయన్స్ గేట్ ప్లే… ఇలా అన్ని మేజర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కలిసి ఈ శుక్రవారం ప్రేక్షకులకు నాన్-స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించడానికి సిద్ధమయ్యాయి. కేవలం ఒక్క భాషలోనే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ వంటి పాన్ ఇండియా భాషల్లో ఈ కంటెంట్ అందుబాటులోకి వస్తుండటం విశేషం.

ఇక ఈ లిస్ట్ లో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ల నుంచి గ్రిప్పింగ్ థ్రిల్లర్లు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాలు, ఫన్ ఫిల్డ్ సిరీస్‌లు అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా ‘సిగ్మా’, ‘ఇమ్మోర్టల్’ లాంటి యాక్షన్ ప్యాక్డ్ మూవీస్‌తో పాటు, ‘సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్’ అనే పోలీస్ డ్రామాపై యూత్‌లో విపరీతమైన క్రేజ్ కనిపిస్తోంది. అలాగే ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’, ‘రుద్రవనం పీఎస్’ లాంటి డిఫరెంట్ జోనర్ ప్రాజెక్ట్‌లు కూడా ప్రేక్షకులను కట్టిపడేయడానికి రెడీ అయ్యాయి. ఇక విదేశీ కంటెంట్‌ను ఇష్టపడే వారి కోసం స్పానిష్, జర్మన్, కొరియన్ భాషల నుంచి డబ్ అయిన క్రైమ్, మిస్టరీ థ్రిల్లర్లు కూడా ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకోవడం మరో హైలైట్. మొత్తానికి చూడ్డానికి బోలెడన్ని ఆప్షన్లు ఉన్నప్పటికీ.. ఏ సినిమా చూడాలి, ఏది స్కిప్ చేయాలి అనే కన్ఫ్యూజన్ ఇప్పుడు ఆడియన్స్‌లో మొదలైంది. సోషల్ మీడియాలో ఇప్పటికే దీనికి సంబంధించిన మీమ్స్, ట్రెండింగ్ హ్యాష్‌టాగ్‌లు వైరల్ అవుతున్నాయి. మీ వీకెండ్‌ను మరింత మసాలాగా, బోర్ కొట్టకుండా గడపడానికి ఈ సినిమాలన్నీ పక్కా ప్లానింగ్‌తో వస్తున్నాయి. పాప్‌కార్న్ రెడీ చేసుకుని సోఫాలో వాలిపోతే సరిపోతుంది, ఈ శుక్రవారం బోర్ అనే మాటే ఉండదు.

ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చే 12 సినిమాలు, సిరీస్‌లు ఇవే

Advertisement

1. సిగ్మా (Sigma)

సందీప్ కిషన్ నటించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో అక్టోబర్ 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.

Advertisement

2. ఇమ్మోర్టల్ (Immortal)

జీవీ ప్రకాశ్ కుమార్, కయాదు లోహర్ నటించిన ఈ హారర్ థ్రిల్లర్ సోనీలివ్‌ (SonyLIV)లో అక్టోబర్ 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

3. లవ్ ఆల్వేస్ (Love Always) – సిరీస్

ప్రేమ, భావోద్వేగాలతో సాగే ఈ సిరీస్ జియోహాట్‌స్టార్‌ (JioHotstar)లో అక్టోబర్ 30 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ సిరీస్‌ను తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో చూడొచ్చు.

4. సబ్-ఇన్‌స్పెక్టర్ యుగంధర్ (Sub-Inspector YUGANDHAR)

ఆది సాయికుమార్ నటించిన ఈ పోలీస్ డ్రామా నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.

5. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ (Don’t Trouble The Trouble)

విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో చూడొచ్చు.

6. రుద్రవనం పీఎస్ (Rudravanam PS) – సిరీస్

క్రైమ్, మిస్టరీ అంశాలతో రూపొందిన ఈ తెలుగు సిరీస్ జీ5 (ZEE5)లో అక్టోబర్ 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ తెలుగు భాషలో అందుబాటులోకి రానుంది.

7. అవరాచన్ అండ్ సన్స్ (Avaraachan And Sons)

మలయాళ కుటుంబ నేపథ్యంతో సాగే ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌ లో అక్టోబర్ 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాను మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో చూడొచ్చు.

8. అక్క (AKKA) – సిరీస్

కీర్తి సురేశ్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌ లో అక్టోబర్ 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ హిందీ, తమిళం, తెలుగు భాషల్లో అందుబాటులోకి రానుంది.

9. కొలిజన్ కోర్స్ (Collision Course)

విదేశీ కంటెంట్‌ను ఇష్టపడే వారికి ఈ చిత్రం మరో బెస్ట్ ఆప్షన్. నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమా స్పానిష్, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.

10. ది బర్త్‌డే గిఫ్ట్ (The Birthday Gift)

జర్మన్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌ లో అందుబాటులోకి రానుంది. ఈ సినిమాకు జర్మన్ (ఒరిజినల్), ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో వెర్షన్లు ఉన్నాయి.

11. డెడ్-ఎండ్ జాబ్ (Dead-End Job) – సిరీస్

కొరియన్ కంటెంట్‌ను ఇష్టపడేవారికి ఈ సిరీస్ ఆసక్తికరంగా ఉండనుంది. నెట్‌ఫ్లిక్స్‌ లో అందుబాటులోకి వచ్చే ఈ సిరీస్‌ను కొరియన్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో చూడొచ్చు.

12. ది స్ట్రేంజర్స్: చాప్టర్ 3 (The Strangers: Chapter 3)

హారర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం బెస్ట్ ఆప్షన్. లయన్స్‌గేట్ ప్లే (Lionsgate Play)లో అందుబాటులోకి రానున్న ఈ సినిమాను ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో చూడొచ్చు.

Read Also: ఏడుగురు పెళ్లికొడుకుల మధ్య చిక్కుకున్న అమ్మాయి కథ… ఫ్యామిలీ డ్రామానే

Tags

Related News

ప్రేయసిని వదిలి పారిపోయిన డాక్టర్ కు పరేషాన్ చేసే ట్విస్ట్… కొరియన్ మెడికల్ మాస్టర్ పీస్ స్పై థ్రిల్లర్

డాక్టర్లకే అంతుచిక్కని మెడికల్ మిస్టరీ… ఓటీటీలో తెలుగులో వచ్చేసిన మైండ్ బ్లాక్ మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్

శివుడిని భర్తగా పొందాలనే పార్వతీ దేవి పట్టుదల… శివపత్ని ఉగ్రరూపం ఇప్పుడు ఓటీటీలో

రేసింగ్ స్టార్‌తో మెకానిక్ ఫేక్ ఎంగేజ్‌మెంట్‌… ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్ తెలుగులో

లాటరీ తెచ్చే తిప్పలు… మనసారా నవ్వుకునే క్లీన్ వెబ్ సిరీస్… నాన్‌స్టాప్ కామెడీ హంగామా

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న రాజమౌళి కొడుకు మూవీ!

చావును కూడా పండుగలా మార్చే అద్భుతమైన వేడుక… ఓటీటీలోకి వచ్చిన ఈ మెక్సికన్‌ సంప్రదాయాన్ని చూశారా ?

Big Stories

Advertisement
×