BigTV English

Terrorists Arrest: ఉగ్ర కుట్ర భగ్నం.. ఇద్దరు టెర్రరిస్టులు అరెస్ట్

Terrorists Arrest: ఉగ్ర కుట్ర భగ్నం.. ఇద్దరు టెర్రరిస్టులు అరెస్ట్

Terrorists Arrest: హైదరాబాద్‌లో ఉగ్రవాదుల కుట్రను రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ భగ్నం చేసింది. సౌదీ అరేబియా కేంద్రంగా పనిచేస్తున్న పాకిస్తాన్ ప్రేరేపిత హ్యాండ్లర్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ గుట్టురట్టు చేసింది. పక్కా సమాచారంతో ఏపీ పోలీసులతో కలిసి కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. బ్లాస్టింగ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్మెంట్స్‌‌‌‌‌‌‌‌ కోసం పేలుడు పదార్థాలు సేకరిస్తున్న ఇద్దరిని శనివారం అరెస్ట్ చేసింది. ఏపీ విజయనగరానికి చెందిన సిరాజ్‌‌‌‌‌‌‌‌ ఉర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెహ్మాన్‌‌‌‌‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ బోయగూడకు చెందిన సయ్యద్‌‌‌‌‌‌‌‌ సమీర్‌ను అదుపులోకి తీసుకొని, విజయనగరం పోలీసులకు అప్పగించింది.


ఐసిస్‌‌‌‌‌‌‌‌సహా పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ ప్రేరేపిత సంస్థల సానుభూతిపరులు, హ్యాండ్లర్ల ఆపరేషన్ల వివరాలను ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ సేకరిస్తోంది. విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన సయ్యద్ సమీర్ కలిసి అల్‌‌‌‌‌‌‌‌ హింద్‌‌‌‌‌‌‌‌ ఇత్తెహాదుల్​ ముస్లిమీన్​ పేరుతో పలు కార్యకలాపాలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇందులో భాగంగా సౌదీ అరేబియాలో ఉండే ఓ హ్యాండ్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, ఏపీలోని సానుభూతిపరులకు ఆదేశాలు వస్తున్నాయని తేల్చారు. బ్లాస్టింగ్స్‌‌‌‌‌‌‌‌ కోసం ఎక్స్‌‌‌‌‌‌‌‌పరిమెంట్స్​ చేసేందుకు సంబంధిత కెమికల్స్ కొనుగోలు చేసి, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో డమ్మీ బ్లాస్ట్‌‌‌‌‌‌‌‌లు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. ఇందుకోసం సిరాజ్‌‌‌‌‌‌‌‌ విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్లు సీఐసెల్‌‌‌‌‌‌‌‌కు సమాచారం అందింది.

రాష్ట్ర సీఐ సెల్‌‌‌‌‌‌‌‌ అధికారులు అందించిన సమాచారంతో విజయనగరం పోలీసులు అప్రమత్తం అయ్యారు. సిరాజ్‌‌‌‌‌‌‌‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అతడి ఇంట్లో పేలుళ్లకు వినియోగించే అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నారు. సమీర్‌‌‌‌‌‌‌‌ను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో అరెస్ట్ చేసి, విజయనగరం తరలించారు. వీరి వెనుక ఉన్న ఉగ్రవాద సంస్థల గురించి ఆరా తీస్తున్నారు. కాగా 2018 లో సిరాజ్, సమీర్ కలిసి హైదరాబాద్ లో ఇంజినీరింగ్ చదివారు. అప్పటి నుంచే వీరిద్దరూ ఐసిస్ వైపు ఆకర్షితులయ్యారు. హైదరాబాద్ లో పేలుడు పదార్థాలు కొనుగోలు చేస్తే దొరికిపోయే అవకాశాలు ఉన్నాయని విజయనగరంలో కొనుగోలు చేశారు. సిటీ శివారు ప్రాంతాల్లో డమ్మీ పేలుళ్లతో ప్రయోగం చేయాలనుకున్నారు.


Also Read: పాక్ కిస్సా ఖల్లాస్..! ఆ 108 కిలోమీటర్ల బోర్డర్ ఎందుకంత కీలకం

ఇదిలా ఉంటే.. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్ర కుట్రను భారత సైన్యం భగ్న చేసింది. పోషియన్‌లో ఉన్న డీకే పోరీ ప్రాంతంలో ఆర్మీ ఇద్దరు ఉద్రవాద సహచరులను అరెస్ట్ చేసింది. వారి వద్ద నుంచి పిస్టల్స్, నాలుగు గ్రెనేడ్లు, 43 లైవ్ రౌండ్లు ఇతర నేరారోపణ సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×